MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/pawana90713dc-d468-4566-98c0-00ca9b857603-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/pawana90713dc-d468-4566-98c0-00ca9b857603-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కోట్ల మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్న స్టార్ హీరో. ఓ మాస్ పొలిటీషియన్. ఓ మనసున్న మనిషి. ఇంతేనా..? పవన్ గురించి చెప్పుకోవాలంటే ఇంకా చాలానే ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద ఆయన సృష్టించిన చరిత్రలు ఇంకా మనకి సాక్ష్యాలుగా కనిపిస్తూనే ఉన్నాయి.pawan kalyan;pawan;chiranjeevi;kalyan;pawan kalyan;prema;konch;love;job;car;chennai;hero;girl;success;tholi prema;massపవన్ కళ్యాణ్ తొలి ప్రేమకథ: డొక్కుకారు వేసుకొని ఆ అమ్మాయి కోసం..!పవన్ కళ్యాణ్ తొలి ప్రేమకథ: డొక్కుకారు వేసుకొని ఆ అమ్మాయి కోసం..!pawan kalyan;pawan;chiranjeevi;kalyan;pawan kalyan;prema;konch;love;job;car;chennai;hero;girl;success;tholi prema;massTue, 22 Dec 2020 15:17:33 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కోట్ల మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్న స్టార్ హీరో. ఓ మాస్ పొలిటీషియన్. ఓ మనసున్న మనిషి. ఇంతేనా..? పవన్ గురించి చెప్పుకోవాలంటే ఇంకా చాలానే ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద ఆయన సృష్టించిన చరిత్రలు ఇంకా మనకి సాక్ష్యాలుగా కనిపిస్తూనే ఉన్నాయి. కానీ.., సినిమాల్లోకి వచ్చి  స్టార్ అయ్యాక పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలిసింది. మరి  సినిమాల్లోకి రాక ముందు పవన్ ఎలా ఉండేవారు? మనలాగే చాలా కామన్ మేన్ లా ఉండేవారు.

తాను మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిని అనే గర్వం పవన్ లో ఎప్పుడూ కనిపించేది కాదట.ఇక ఆ వయసులో పవన్ కళ్యాణ్ కి తొలిప్రేమ అందించిన తీపి గుర్తులు కూడా ఉన్నాయి. పవన్  కంప్యూటర్‌ కోచింగ్ కోసం కొన్ని రోజులు మద్రాస్ లో ఉండాల్సి వచ్చింది. అదే కొచింగ్ సెంటర్ లో కోచింగ్ కి వస్తున్న ఓ అందమైన అమ్మాయి మీద పవన్ మనసు పారేసుకున్నాడట. ఆమెకి తన ప్రేమ విషయం చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటే.., స్నేహితులు  దైర్యం చెప్పారట. దీనితో ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి ఇంట్లో ఎవరూ వాడకుండా పక్కన పడేసిన డొక్కుకారుని బయటకు తీసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడట పవన్ కళ్యాణ్. తాను మనసు పడ్డ అమ్మాయి అప్పటికే ఉద్యోగంలో కూడా చేరి లైఫ్ లో సెటిల్ అయ్యిందట. కానీ.., అప్పటికి పవన్ చేతిలో ఉద్యోగం కూడా లేదు. అయినా.., పవన్ దైర్యంగా ఆమెని  ఒప్పించి కార్ ఎక్కించుకున్నాడట. మార్గం మధ్యలో కార్ ఆపేసి పవన్ తన మనసులో మాటని ఆమెకి చెప్పేశాడట. అదంతా ఓపిగ్గా విన్న అమ్మాయి.. ఇది ప్రేమ కాదు పవన్. ఈ వయసులో ప్రేమేంటి’ అంటూ పవన్ కి తలలో బూజు వదిలేలా క్లాస్ పీకిందట. ‘ఆ సమయంలో ఆ అమ్మాయి మా క్లాస్‌ టీచర్‌లా కనిపించింది. అన్ని క్లాసులు పీకింది..’ అంటూ ఓసారి తన తొలిప్రేమ సంగతుల్ని గుర్తు చేసుకున్నారు పవన్‌. కానీ.., పవన్ కి రియల్  లైఫ్ లో చేదు అనుభవం మిగిల్చిన తొలిప్రేమ.. రీల్  లైఫ్ లో మాత్రం సూపర్ సక్సెస్ ఇవ్వడం విశేషం.






లైవ్ లో ... అభిజీత్ గురించి అఖిల్ సెన్సేషనల్ కామెంట్స్ ..... అలా అంటాడని అస్సలు ఊహించలేదు ....??

భూ సర్వే ఆలోచన జగన్ ది కాదా...?

కరోనా స్ట్రెయిన్...తస్మాత్ జాగ్రత్త

ప్రకాశం జిల్లా గుడిలో మాంసపు ముద్దలు

20 రూపాయలకు కక్కుర్తి పడి.. 1.50 లక్షలు పోగొట్టుకున్నాడు..?

రూ. 20పై ఆశపడి.. రూ.1.50 లక్షలు పోగొట్టుకున్నాడు

ఆ ఎన్నికల ఫలితాలు.. బిజెపి పెద్దలను కంగారు పట్టిస్తున్నాయి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>