TechnologyP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/nokiaf79aef2f-4a80-46d9-8942-5e6739f774fd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/nokiaf79aef2f-4a80-46d9-8942-5e6739f774fd-415x250-IndiaHerald.jpgనోకియా.. ప్రస్తుతం మార్కెట్‌ను ఊపేస్తున్న మొబైల్ సంస్థలు అసలు పుట్టకముందే ఓ ఊపు ఊపిన పేరు. ఆ తరువాత వివిధ కారణాల వల్ల నోకియా సంస్థను మైక్రోసాఫ్ట్ సంస్థ కొనుగోలో చేసింది. దీంతో నోకియా సంస్థను ప్రపంచం మర్చిపోవాల్సి వచ్చింది. అయితే కొద్ది సంవత్సరాల తర్వాత మళ్లీ నోకియా సంస్థ అదే పేరుతో ఆండ్రాయిడ్ ఫోన్లతో మార్కెట్‌లోకి అడుగుపెట్టింది.nokia;nokia;india;microsoftఈ-కామర్స్ సంస్థలకు మరో షాకిచ్చిన నోకియా.. ఈ నెల 29 నుంచి...ఈ-కామర్స్ సంస్థలకు మరో షాకిచ్చిన నోకియా.. ఈ నెల 29 నుంచి...nokia;nokia;india;microsoftTue, 22 Dec 2020 21:03:46 GMTనోకియా సంస్థను మైక్రోసాఫ్ట్ సంస్థ కొనుగోలో చేసింది. దీంతో నోకియా సంస్థను ప్రపంచం మర్చిపోవాల్సి వచ్చింది. అయితే కొద్ది సంవత్సరాల తర్వాత మళ్లీ నోకియా సంస్థ అదే పేరుతో ఆండ్రాయిడ్ ఫోన్లతో మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఈ గ్యాప్‌లోనే అనేక సంస్థలు మార్కెట్‌ను తమ ఆధీనంలోకి తీసేసుకున్నాయి. అయినప్పటికి నోకియా ఆయా సంస్థలకు గట్టి పోటీనిస్తూ దూసుకెళ్తోంది. ఇక ఫోన్లతో పాటుగా ఎలక్ట్రానిక్ వస్తువులపై కూడా నోకియా ఆసక్తి చూపుతోంది. ఇందులో భాగంగా నోకియా సంస్థ తాజాగా ఎయిర్ కండీషనర్లను మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.

నోకియాతో కలిసి సంయుక్తంగా ‘మేడిన్ ఇండియా’ నోకియా ఎయిర్‌ కండిషనర్స్‌ను తాజాగా ఆవిష్కరించింది. నోకియా బ్రాండింగ్‌తో కూడిన ఈ ఏసీలు ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఫీచర్ ఫోన్ల మార్కెట్లో అగ్రగామిగా ఓ వెలుగు వెలిగిన నోకియా స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో వెనుకబడిన సంగతి విధితమే. అయితే.. మార్కెట్లోకి కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ నోకియా ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇప్పటికే నోకియా సంస్థ ల్యాప్‌టాప్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. గతేడాది నోకియా టీవీలు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు నోకియా ఆవిష్కరించిన ఎయిర్‌ కండీషనర్స్‌ సరికొత్త సాంకేతికతతో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఫ్లిప్‌కార్ట్‌కు సంస్థకు చెందిన ప్రతినిధి తెలిపారు.

స్మార్ట్‌ఫోన్లతో కూడా ఈ ఏసీలను ఆపరేట్ చేయొచ్చని నోకియా చెబుతోంది. ఈ నెల 29 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో 30,999 రూపాయల నుంచి నోకియా ఏసీలు విక్రయించనున్నట్టు పేర్కొంది. అడ్జస్ట్‌బుల్ ఇన్వర్టర్ మోడ్, ఎన్విరాన్‌మెంట్-ఫ్రెండ్లీ ఆర్-32 రిఫ్రిజ్‌రంట్, ఇంటలిజంట్ మోషన్ సెన్సార్స్, వైఫై కనెక్టెడ్ స్మార్ట్ క్లైమాట్ కంట్రోల్ ఫీచర్లతో నోకియా ఏసీలు వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. 


అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీ

రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం

అవి పెంచుకునేందుకు సర్జరీ.. ఫెయిల్ కావడంతో..

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి? ఢిల్లీకి కోమటిరెడ్డి!

సంక్రాంతికి ఆ రెండు సినిమాలు రెడీ ?

రకుల్‌కు కరోనా.. మంచు లక్ష్మి రియాక్షన్ ఇదే!

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు కరోనా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>