PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy245d1e82-bfda-471b-bf43-b9276dd7e24b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy245d1e82-bfda-471b-bf43-b9276dd7e24b-415x250-IndiaHerald.jpgతెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్ష ఎన్నిక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. 20 రోజుల కసరత్తు తర్వాత టీపీపీసీ నియామకాన్ని హైకమాండ్ ఖరారు చేసిందని చెబుతున్నారు. పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో పీసీసీ చీఫ్ పై త్వరలోనే ప్రకటన రాబోతుందని చెబుతున్నారు. అయితే కోమటిరెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో గాంధీభవన్ లో జోరుగా చర్చలు జరుగుతున్నాయిrevanth reddy;revanth;sridhar;telangana;revanth reddy;congress;mp;రాజీనామా;mallu bhatti vikramarka;jagga reddy;reddy;partyపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి? ఢిల్లీకి కోమటిరెడ్డి!పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి? ఢిల్లీకి కోమటిరెడ్డి!revanth reddy;revanth;sridhar;telangana;revanth reddy;congress;mp;రాజీనామా;mallu bhatti vikramarka;jagga reddy;reddy;partyTue, 22 Dec 2020 19:34:33 GMTతెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్ష ఎన్నిక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. 20 రోజుల కసరత్తు తర్వాత టీపీపీసీ నియామకాన్ని  హైకమాండ్ ఖరారు చేసిందని చెబుతున్నారు. పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో పీసీసీ చీఫ్ పై  త్వరలోనే ప్రకటన రాబోతుందని చెబుతున్నారు. అయితే కోమటిరెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో గాంధీభవన్ లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కోమటిరెడ్డిపై పీసీసీ పగ్గాలు ఖాయమయ్యాయని కొందరు చెబుతుండగా.. అతన్ని బుజ్జగించేందుకు హైకమాండ్ పిలుపిస్తోందని, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డినే పీసీసీ బాస్ గా నియమించబోతున్నారని మరికొందరు చెబుతున్నారు. పార్టీ సీనియర్లు మాత్రం రేవంత్ రెడ్డి పేరు ఖాయమైందని తమ అనుచరులతో చెప్పారని తెలుస్తోంది.

                 పీసీసీ పీఠం కోసం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి నిలిచినప్పటికి... చివరికి పోటీ మాత్రం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి మధ్యనే సాగిందని తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ నాలుగు రోజుల పాటు గాంధీభవన్ లో ఉండి సేకరించిన అభిప్రాయ సేకరణలో... మెజార్టీ నేతలు రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపారని చెబుతున్నారు. ఎక్కువ మంది డీసీసీలు కూడా రేవంత్ నే కోరుకున్నారట. అయితే పార్టీ సీనియర్లు మాత్రం కోమటిరెడ్డికి ఇవ్వాలని చెప్పారని టాక్. పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతకే పీసీసీ పగ్గాలు ఇవ్వాలని, కొంతగా వచ్చిన వారికి ఇస్తే సమస్యలు వస్తాయని కొందరు సీనియర్లు సూచించారని చెబుతున్నారు. అందువల్లే పీసీసీ ఎంపిక ఆలస్యం అయిందంటున్నారు.
 
            మాణిక్కం ఠాగూర్ ఇచ్చిన నివేదకతో పాటు ఇతరత్రా మార్గాల ద్వారా ఆరా తీసిన కాంగ్రెస్ హైకమాండ్.. రేవంత్ రెడ్డికే పీసీసీ పగ్గాలు ఖాయం చేశారని తెలుస్తోంది. పదవి కోసం చివరి వరకు ప్రయత్నించిన కోమటిరెడ్డిని బుజ్జగించేందుకే ఢిల్లీకి పిలిపించారని భావిస్తున్నారు. పీసీసీ పదవి రాకపోతే కోమటిరెడ్డి పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అందుకే కోమటిరెడ్డిని పిలిచిందని, పార్టీలోనే ఉండాలని, భవిష్యత్ లో మంచి అవకాశాలు వస్తాయని హైకమాండ్ నచ్చచెప్పే ప్రయత్నం చేయవచ్చని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.




రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం

అవి పెంచుకునేందుకు సర్జరీ.. ఫెయిల్ కావడంతో..

సంక్రాంతికి ఆ రెండు సినిమాలు రెడీ ?

రకుల్‌కు కరోనా.. మంచు లక్ష్మి రియాక్షన్ ఇదే!

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు కరోనా

తెలంగాణలో 45 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

కోదండరాం కి ఇది అగ్ని పరీక్ష.. ఎవరి మద్దతు లేకుండా అంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>