MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/singer-shanmukha-priya15e75dd7-8a5e-4f17-a411-45c34ca57749-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/singer-shanmukha-priya15e75dd7-8a5e-4f17-a411-45c34ca57749-415x250-IndiaHerald.jpgశాస్త్రీయ సంగీతంలో షణ్ముఖప్రియ అనే రాగాన్ని తన పేరుగా పెట్టుకున్న షణ్ముఖప్రియ సరిగా మాటలు రాని వయసులోనే కూనిరాగాలు తీయడం మొదలుపెట్టింది. మాట రాకముందే షణ్ముఖ పాట పాడే ప్రయత్నం చేసింది. అలా తన తల్లిదండ్రుల దగ్గరే శాస్త్రీయ సంగీతం నేర్చుకుని నాలుగేళ్ల వయసు నుంచే పాటలు పాడడం స్టార్ట్ చేసిందిsinger shanmukha priya;priya;geetha;jr ntr;raaga;vijay;kerala;visakhapatnam;sony;india;bollywood;sangeetha;telugu;rajani kanth;vishakapatnam;tamil;karnataka 1;audience;music;girl;joseph vijay;singer;indian idol;international;indian;telugammayiతెలుగు వారు గర్వపడేలా చేస్తున్న షణ్ముఖ ప్రియా ప్రస్థానం..ఇంతకు ఏం సాధిస్తుందో తెలుసా..?తెలుగు వారు గర్వపడేలా చేస్తున్న షణ్ముఖ ప్రియా ప్రస్థానం..ఇంతకు ఏం సాధిస్తుందో తెలుసా..?singer shanmukha priya;priya;geetha;jr ntr;raaga;vijay;kerala;visakhapatnam;sony;india;bollywood;sangeetha;telugu;rajani kanth;vishakapatnam;tamil;karnataka 1;audience;music;girl;joseph vijay;singer;indian idol;international;indian;telugammayiTue, 22 Dec 2020 11:00:00 GMTబాలీవుడ్ టి‌వి ఛానల్ అయిన జీటి‌వి నిర్వహించిన సరిగమప లిటిల్ ఛాంప్స్ ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ చేసింది. తన పాటలతో ఆడియన్స్ తో పాటు జడ్జ్ లను కూడా ఆకట్టుకుంటూ టాప్ 10 లో చోటు దక్కించుకుంది. స్టార్ ప్లస్ లో "ది వాయిస్ ఇండియా కిడ్స్" షోలో కూడా పార్టిసిపేట్ చేసి జడ్జ్ లను ఔరా అనిపించింది. ఇక కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని చిన్నారులకు నిర్వహించిన జూనియర్ సూపర్ స్టార్ సింగర్ పోటీల్లో కూడా పాల్గొని విజేతగా నిలిచింది తెలుగోళ్ల సత్తా చాటింది. 2010 లో స్టార్ విజయ్ ఛానల్ లో నిర్వహించిన పాటల పోటీల్లో తమిళ జూనియర్ సూపర్ స్టార్ టైటిల్ ను దక్కించుకుంది. రాగమేదైనా, భాష ఏదైనా గాని ఒకసారి చూస్తే ఇట్టే పట్టేయగల టాలెంట్ షణ్ముఖ సొంతం. పుట్టుకతోనే షణ్ముఖ మీద సరస్వతి దేవి అనుగ్రహం ఉంది. అందుకే ఏ భాషలో అయినా, ఏ రాగం అయినా అలవోకగా పాడేస్తుంది. జడ్జ్ లు, గొప్ప గొప్ప సంగీత విధ్వాంసులు సైతం ఆశ్చర్యపోతారు. షణ్ముఖ నాలుక మీద సంగీత సరస్వతి నాట్యమాడుతుంది కాబోలు అందుకే ఈ చిన్నారి ఇలా అలవోకగా పాటలు పాడగలుగుతుంది అని కాంప్లిమెంట్స్ ఇస్తారు. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ స్టేజ్ ల మీద పాటలు పాడుతూ లక్షలాది అభిమానులను సంపాదించుకుంది.  ఇప్పుడు ఆ చిన్నారి పెద్దదయ్యింది. సోనీ ఎంటర్ టైన్ మెంట్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే "ఇండియన్ ఐడల్" సీజన్ 12 లో మన తెలుగమ్మాయి, వైజాగ్ అమ్మాయి పార్టిసిపేట్ చేయబోతుంది. గాయని కావాలనుకునే ప్రతీ ఒక్కరూ ఇండియన్ ఐడల్ లో పార్టిసిపేట్ చేసి టైటిల్ గెలుచుకోవాలని కలలు కంటూ ఉంటారు. ఎంతో మంది ప్రతిభావంతులని ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత ఈ ఇండియన్ ఐడల్ ది. సాధారణంగా తెలుగు వాళ్ళకి అంత తేలిగ్గా ఈ అవకాశం రాదు. చాలా తక్కువ మందికి మాత్రమే ఈ అవకాశం వరిస్తుంది. ఇప్పుడు ఆ వంతు మన షణ్ముఖ ప్రియకి వచ్చింది. మరి ఇండియన్ ఐడల్ సీజన్ 12 లో టైటిల్ గెలుచుకుని మరోసారి తెలుగోళ్ల సత్తా చాటలని కోరుకుందాం.




నాని సినిమా లో లుక్ అంత సీక్రెట్ గా ఉంచారేంటి..?

డబ్బుకోసం చెల్లిపై దారుణానికి ఒడిగట్టిన అక్క... అయ్యో పాపం..

ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగుల అంశంలో జస్టిస్ కీలక వ్యాఖ్యలు!

రెండు రోజుల్లో పెళ్లి.. కానీ అంతలో బ్యాగ్ ప్రాణం తీసింది..?

విశాఖకు రాజధాని ఖాయం..?

తెలంగాణా మంత్రుల మీద విచారణ...? కేసీఆర్ సంచలన నిర్ణయం

కరోనా ఎఫెక్ట్.. ఆ రాష్ట్రంలో కూడా న్యూ ఇయర్ వేడుకలు బ్యాన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>