EducationSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/telangana-jobsaa3506a9-97b9-4fc1-a2ee-7abc09f32079-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/telangana-jobsaa3506a9-97b9-4fc1-a2ee-7abc09f32079-415x250-IndiaHerald.jpgతెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. కరోనా కారణంగా ఈ ఏడాది లో ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేక యువత అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కొంత మందికి ఉన్న ఉద్యోగాలు కూడా పోయి, కుటుంబ పోషణ చేసే మార్గాలు కనిపించక ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు సర్కార్ అలాంటి వారి కలలను సాకారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిరుద్యోగ సమస్యలను తీర్చడానికి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల పై దృష్టి సారించారు. ఈ మేరకు ఏయే శాఖలో ఏ పోస్ట్ భర్తీ చేయాలి అనే అంశాలను పరిగణించింది..telangana jobs;vidya;vishwa;telangana rashtra samithi trs;telangana;schoolతెలంగాణలో 45 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..తెలంగాణలో 45 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..telangana jobs;vidya;vishwa;telangana rashtra samithi trs;telangana;schoolTue, 22 Dec 2020 18:00:00 GMTతెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. కరోనా కారణంగా ఈ ఏడాది లో ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేక యువత అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కొంత మందికి ఉన్న ఉద్యోగాలు కూడా పోయి, కుటుంబ పోషణ చేసే మార్గాలు కనిపించక ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు సర్కార్ అలాంటి వారి కలలను సాకారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిరుద్యోగ సమస్యలను తీర్చడానికి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల  పై దృష్టి సారించారు.  ఈ మేరకు ఏయే శాఖలో ఏ పోస్ట్ భర్తీ చేయాలి అనే అంశాలను పరిగణించింది..



ఇందులో భాగంగా తెరాస ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉద్యోగ ఖాళీల వివరాలు సోమవారం రాత్రి ప్రభుత్వానికి చేరాయి. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో సుమారు 45 వేలు, సంస్థల్లో 20 వేలు భర్తీ చేయాల్సి ఉందని ముఖ్య కార్యదర్శులు ప్రభుత్వానికి నివే ధికను అందించారు..ఇందులో నాలుగో తరగతి ఉద్యోగుల వివరాలు ఉన్నట్టు తెలిపారు. ఒప్పంద మరియు పొరుగు సేవల ఉద్యోగుల సంఖ్యను విడిగా పొందుపరిచారు. ఆ ప్రకారం పోలీసు, విద్య, వైద్యఆరోగ్య శాఖలలో ఖాళీలు ఎక్కువగా ఉన్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు..



ఏయే సంస్థలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో పరిశీలిస్తే.. పాఠశాల విద్యాశాఖలో 9,600 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యా శాఖ ఉన్నతాధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఇందులో ప్రత్యేక గ్రేడ్‌ ఉపాధ్యాయులు 5,800, స్కూలు అసిస్టెంట్లు 2,500, భాషాపండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు 300, మోడల్‌ పాఠశాలల ఉపాధ్యాయుల పోస్టులు 1000 ఉన్నాయి. ఇవిగాక ఉన్నత విద్య, విశ్వ విద్యాలయాలు, సాంకేతిక విద్యాశాఖల పోస్టులు మరో మూడు వేల వరకు ఉన్నాయి. శాఖల వారిగా వచ్చిన వివరాలను ఆర్థిక శాఖ క్రోడీ కరిస్తోంది. మొత్తం పోస్టుల్లో నాలుగో తరగతివి మినహాయించి, మిగిలినవి ఖాళీగా చూపనున్నట్లు వెల్లడించింది. ఒకటి, రెండురోజుల్లో కచ్చితమైన సంఖ్యపై స్పష్టత వచ్చే వీలుందని సమాచారం..




కేసీఆర్ తెలంగాణాలో ఇది అమలు చేస్తే బెస్ట్...?

కోదండరాం కి ఇది అగ్ని పరీక్ష.. ఎవరి మద్దతు లేకుండా అంటే..?

జమిలీ ఎన్నికల కి సిద్ధమంటున్న కేంద్ర ఎన్నికల సంఘం..?

గూగుల్, మైక్రోసాఫ్ట్‌ నుంచి కోట్ల నిధులు.. దూసుకుపోతున్న దేశీ టిక్‌టాక్.. జోష్

కొత్త కరోనా అలెర్ట్ : హైదరాబాద్‌కు 358 మంది ప్రయాణికులు!

కేసీఆర్ 30 కోట్లు ఇస్తే: కిషన్ రెడ్డి

కశ్మీర్ ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ.. దూసుకుపోతున్న ఫరూక్ అబ్దుల్లా కూటమి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>