PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/maharastrab38bc578-ab5c-4016-b5b2-8fca2a213edb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/maharastrab38bc578-ab5c-4016-b5b2-8fca2a213edb-415x250-IndiaHerald.jpgమాములుగా పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసుకొనే అధ్బుతమైన వేడుక.. అది కూడా ఒకరితోనే చేసుకోవాలి.. అయితే ఇక్కడ ఓ వ్యక్తి కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అది ఎలా అని అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. మీరు విన్నది నిజమే ఐదు రోజుల్లో రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు.. మొదటి పెళ్లి అయ్యాక రెండో రోజు వేరే పని ఉందని చెప్పి వెళ్లి మూడు రోజుల్లో రెండో పెళ్లి చేసుకున్నాడు..ఈ ఘటన మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ టెకీ కేవలం ఐదు రోజుల వ్యవధిలో ఇద్దరు అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడు. maharastra;jeevitha rajaseskhar;police;marriage;girlవీడి టాలెంట్ కు జోహార్.. ఐదురోజుల్లో ఇద్దరితోనా..?వీడి టాలెంట్ కు జోహార్.. ఐదురోజుల్లో ఇద్దరితోనా..?maharastra;jeevitha rajaseskhar;police;marriage;girlTue, 22 Dec 2020 10:00:00 GMTపెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసుకొనే అధ్బుతమైన వేడుక.. అది కూడా ఒకరితోనే చేసుకోవాలి.. అయితే ఇక్కడ ఓ వ్యక్తి కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అది ఎలా అని అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. మీరు విన్నది నిజమే ఐదు రోజుల్లో రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు.. మొదటి పెళ్లి అయ్యాక రెండో రోజు వేరే పని ఉందని చెప్పి వెళ్లి మూడు రోజుల్లో రెండో పెళ్లి చేసుకున్నాడు..ఈ ఘటన మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ టెకీ కేవలం ఐదు రోజుల వ్యవధిలో ఇద్దరు అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడు.



మొదటి అమ్మాయి మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకెళ్లిన ఆ యువకుడు.. మూడు రోజుల తర్వాత అత్యవసర పని ఉందని చెప్పి మరో చోటుకి వెళ్లి రెండో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.ఈ ఇద్దరికీ దగ్గర బంధువు అయిన ఓ అమ్మాయి ఆ పెళ్ళికి హాజరవ్వడంతో ఈ విషయం బట్ట బయలు అయ్యింది..మొదటి అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండో అమ్మాయిని కూడా వదిలేసి పారిపోయారు. అతనికి మొదటి అమ్మాయి వాళ్ళు కూడా భారీగా కట్న కానుకలు సమర్పించారు. 10 లక్షల నగదు, బంగారం కూడా పెట్టినట్లు తెలుస్తోంది.



బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు వెళ్ళే సరికే నిందితుడు పరారయ్యాడు. విచారణలో భాగంగా రెండో భార్యను ప్రశ్నించగా.. తమది పెద్దలు కుదిర్చిన వివాహమేనని.. బలవంతమేమీ లేదని చెప్పింది. 5 రోజుల వ్యవధిలో ఇద్దరు అమ్మాయిల కుటుంబాలను ఎలా మేనేజ్ చేయగలిగాడు? చిన్న అనుమానం కూడా రాకుండా ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకున్నాడు. మొదటి పెళ్లికి నిందితుడి తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు, కొంత మంది బంధువులు హాజరైనట్లు బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు వారిని గుర్తించి కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా ఇంకెంత మందిని మోసం చేశాడు అనేది తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..




హిట్ కొట్టినా నిధి కి అవకాశాలు రావడం లేదా..?

ఇకనైనా ఆపండి.. ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యా శాఖ మంత్రి..?

యూకే నుంచి హైదరాబాద్ కు రోజుకు 600 మంది!కరోనా స్ట్రెయిన్ తో టెన్షన్

కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>