PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/disturbance-around-the-world-with-the-new-virus32ab94ba-a07d-4bc1-80cc-2765f4f20b14-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/disturbance-around-the-world-with-the-new-virus32ab94ba-a07d-4bc1-80cc-2765f4f20b14-415x250-IndiaHerald.jpgకరోనా వచ్చిన కొత్తలో చైనాను చూసి గడగడలాడిన దేశాలు.. ఇప్పుడు బ్రిటన్‌ను చూసి వణికిపోతున్నాయి. బ్రిటన్‌లో కొత్త కరోనా వైరస్‌ వెలుగు చూసి.. వేగంగా వ్యాప్తి చెందుతుండటమే దీనికి కారణం. కోవిడ్‌ వల్ల ఎదురైన ఇబ్బందులను రుచి చూసిన దేశాలు.. వెంటనే తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాయి. వైరస్‌ సోకిన వారు తమ దేశాల్లోకి రాకుండా... బ్రిటన్‌తో ప్రయాణ సంబంధాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి. ఈ జాబితాలో భారత్‌ సహా 40 దేశాలు ఉన్నాయంటే.. కొత్త వైరస్‌ ఏ స్థాయిలో కలవర పెడుతోందో అర్థం చేసుకోవచ్చు. disturbance around the world with the new virus;india;turkey;south africa;canada;bulgaria;american samoa;january;central government;aaviriకొత్త వైరస్ తో‌ ప్రపంచ దేశాల్లో కలవరం !కొత్త వైరస్ తో‌ ప్రపంచ దేశాల్లో కలవరం !disturbance around the world with the new virus;india;turkey;south africa;canada;bulgaria;american samoa;january;central government;aaviriTue, 22 Dec 2020 21:30:00 GMT
యూరప్‌లో కీలక దేశం బ్రిటన్‌. కరోనాకు విలవిల్లాడిన  ఖండం కూడా యూరపే. ఇప్పుడు బ్రిటన్‌లో కొత్త వైరస్‌ వెలుగు చూడటంతో బ్రిటన్‌తో సరిహద్దు కలిగిన దేశాలతోపాటు యూరప్‌లోని ఇతర దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు పెట్టాయి.  కొన్ని దేశాలు రెండు రోజులు.. మరికొన్ని దేశాలు ఈ నెలాఖరు వరకు ట్రావెల్‌ బ్యాన్‌ విధించాయి. బల్గేరియా అయితే ఏకంగా జనవరి 31 వరకు బ్రిటన్‌ నుంచి రాకపోకల్ని ఆపేసింది.

కరోనా వల్ల గల్ఫ్‌ దేశాలు కూడా చాలా ఇబ్బంది పడ్డాయి. ఇప్పుడు కొత్త వైరస్‌తో బ్రిటన్‌లో ప్రమాద ఘంటికలు మోగిన వెంటనే  పాసింజర్‌ ఫ్లయిట్స్‌తోపాటు కార్గో విమానాలపైనా బ్యాన్‌ విధించాయి. బ్రిటన్‌తోపాటు డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌, సౌతాఫ్రికా నుంచి వచ్చే విమానాలను నిరవధికంగా ఆపేసింది టర్కీ.

బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్త వైరస్‌ సౌతాఫ్రికాలోనూ అలజడి రేపుతోంది. దీంతో ఆఫ్రికా దేశాలన్నీ భయం గుప్పిట్లో ఉన్నాయి. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు బ్రిటన్‌ నుంచి వచ్చే ప్రయాణాలపై నిషేధం పెట్టాయి.

సౌత్‌, నార్త్‌ అమెరికా దేశాలకు కంటిపై కునుకు లేకుండా పోయింది. కెనడా నిరవధింగా బ్రిటన్‌ విమానాలపై నిషేధం పెడితే.. అమెరికా కూడా కఠిన ఆంక్షలు దిశగా అడుగులు వేస్తోంది. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకల కోసం  సిద్ధమవుతున్న దేశాల్లో బ్రిటన్‌ కొత్త వైరస్‌ బాంబు వారి ఆశలను ఆవిరి చేసింది.

భారత్‌ ఈ నెలాఖరు వరకు బ్రిటన్‌ నుంచి విమానాల రాకపోకలను ఆపేసినా.. ఇప్పటికే ఇండియా చేరుకున్న వారి గురించి ఆరా తీస్తోంది. ఇలా వచ్చిన వారిలో కొందరిలో వైరస్‌ లక్షణాలు బయటపడటంతో మరింత అప్రమత్తమైంది కేంద్రం. విదేశాల నుంచి వచ్చే వారికి  కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పని సరి చేసింది. ఒకవేళ నెగిటివ్‌ వచ్చినా 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని స్పష్టం చేస్తోంది.




విజయం మీదే: మీ జీవితం తాత్కాలికం...సత్యాన్ని గ్రహించండి...!

కొత్త వైరస్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

ఈ-కామర్స్ సంస్థలకు మరో షాకిచ్చిన నోకియా.. ఈ నెల 29 నుంచి...

అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీ

రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం

అవి పెంచుకునేందుకు సర్జరీ.. ఫెయిల్ కావడంతో..

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి? ఢిల్లీకి కోమటిరెడ్డి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>