PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kanna-lakshminarayana64ab89ad-4866-4edf-9265-f28b9337c4c8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kanna-lakshminarayana64ab89ad-4866-4edf-9265-f28b9337c4c8-415x250-IndiaHerald.jpgకన్నా లక్ష్మీనారాయణ....ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేత. దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో ముఖ్య పాత్ర పోషించిన నాయకుడు. రాష్ట్రం విడిపోక ముందు వరకు ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. అయితే రాష్ట్రం విడిపోయాక పరిస్థితులు ఎలా మారయో చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే స్థితికి వెళ్లింది. దీంతో నేతలంతా టీడీపీ, వైసీపీల్లోకి జంప్ కొట్టేశారు. ఇదే సమయంలో కన్నా సైతం వైసీపీలోకి వెళ్లాలని చూశారు. జగన్ పాదయాత్ర చేసే సమయంలో వైసీపీ కండువా కప్పేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. kanna lakshminarayana;cbn;bharatiya janata party;jagan;somu veerraju;andhra pradesh;congress;2019;government;kanna lakshminarayana;media;tdp;ycp;march;partyకన్నా రూట్ మారుస్తారా?కన్నా రూట్ మారుస్తారా?kanna lakshminarayana;cbn;bharatiya janata party;jagan;somu veerraju;andhra pradesh;congress;2019;government;kanna lakshminarayana;media;tdp;ycp;march;partyTue, 22 Dec 2020 03:00:00 GMTకన్నా లక్ష్మీనారాయణ....ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేత. దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో ముఖ్య పాత్ర పోషించిన నాయకుడు. రాష్ట్రం విడిపోక ముందు వరకు ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. అయితే రాష్ట్రం విడిపోయాక పరిస్థితులు ఎలా మారయో చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే స్థితికి వెళ్లింది. దీంతో నేతలంతా టీడీపీ, వైసీపీల్లోకి జంప్ కొట్టేశారు. ఇదే సమయంలో కన్నా సైతం వైసీపీలోకి వెళ్లాలని చూశారు. జగన్ పాదయాత్ర చేసే సమయంలో వైసీపీ కండువా కప్పేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి.

కానీ హఠాత్తుగా కన్నా రూట్ మారింది. ఆయన యూ టర్న్ తీసుకుని బీజేపీలోకి వచ్చారు. ఆ వెంటే ఏపీ అధ్యక్షుడు కూడా అయ్యారు. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా అప్పుడు అధికారంలో చంద్రబాబుపై ఏ విధంగా పోరాటం చేశారో తెలిసిందే. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడంతో కన్నా వర్షన్ మారింది. కన్నా, జగన్ ప్రభుత్వంపై విమర్శల బాణాలు ఎక్కిపెట్టారు.

ప్రతిపక్ష టీడీపీతో పోటీగా జగన్ ప్రభుత్వంపై పోరాటం చేశారు. ఒకానొక దశలో కన్నా, వైసీపీ నేతల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. అయితే ఏమైందో తెలియదు గానీ, ఒక్కసారిగా బీజేపీ అధిష్టానం రూట్ మార్చి కన్నాని సైడ్ చేసి, సోము వీర్రాజుకు ఏపీ పగ్గాలు అప్పగించారు. ఇక సోము వీర్రాజు వర్షన్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన అధికార పక్షంపై చేసిన పోరాటం తక్కువ, ప్రతిపక్షంపై చేసిన విమర్శలు ఎక్కువ.

సోముకు పగ్గాలు వచ్చాక కన్నా లక్ష్మీనారాయణ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అసలు మీడియా సమావేశాల్లో సైతం కనిపించడం లేదు. పైగా కన్నా అధ్యక్షుడు అయ్యాక, కన్నాకు అనుకూలంగా ఉన్న కొందరు బీజేపీ నేతలని సస్పెండ్ చేశారు. కన్నాకు కుడిభుజం లాంటి ఓవీ రమణను ఎలాంటి నోటీసు ఇవ్వకుండా బహిష్కరించారు. కన్నాకు కుడిభుజం లాంటి ఓవీ రమణను ఎలాంటి నోటీసు ఇవ్వకుండా బహిష్కరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కన్నా సైలెంట్ అయ్యారు. మరి సైలెంట్‌గా ఉంటూనే కన్నా రూట్ మారుస్తారా లేక బీజేపీలోనే కొనసాగుతారనేది చెప్పలేని పరిస్తితి.




కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?

తెరాస ఎంపీకి కేంద్ర మంత్రి పదవి ఆఫర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>