PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/every-day-600-passengers-coming-hyderabad-from-uk7c53e3e4-6c7e-4d6f-bcb1-c676f370e0de-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/every-day-600-passengers-coming-hyderabad-from-uk7c53e3e4-6c7e-4d6f-bcb1-c676f370e0de-415x250-IndiaHerald.jpgబ్రిటన్ నుంచి రోజుకు రెండు విమానాలతోపాటు 11 వరకు కనెక్టడ్ విమానాలు హైదరాబాద్‌లో ల్యాండ్ అవుతున్నాయి. వీటి ద్వారా రోజుకు దాదాపు 600 మంది వరకు హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణ సర్కార్ ను కలవరపెడుతోంది. బ్రిటన్ లో కరోనా స్ట్రెయిన్ విజృంభిస్తుండటంతో అప్రమత్తమైన వైద్య శాఖ..పలు చర్యలు చేపట్టింది. విమానం దిగగానే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులోనే ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించనున్నారుcovid;hyderabad;telangana;central government;international;house;coronavirusయూకే నుంచి హైదరాబాద్ కు రోజుకు 600 మంది!కరోనా స్ట్రెయిన్ తో టెన్షన్యూకే నుంచి హైదరాబాద్ కు రోజుకు 600 మంది!కరోనా స్ట్రెయిన్ తో టెన్షన్covid;hyderabad;telangana;central government;international;house;coronavirusTue, 22 Dec 2020 09:16:03 GMTహైదరాబాద్ చేరుకుంటున్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణ సర్కార్ ను కలవరపెడుతోంది. బ్రిటన్ లో కరోనా స్ట్రెయిన్ విజృంభిస్తుండటంతో అప్రమత్తమైన వైద్య శాఖ..పలు చర్యలు చేపట్టింది.  విమానం దిగగానే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులోనే ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను, సర్వియలెన్స్ సిబ్బందిని నియమించారు. బ్రిటన్ నుంచి వచ్చేవారందరికీ టెస్టులు చేయడంతోపాటు పాజిటివ్ ఉంటే ప్రభుత్వ క్వారంటైన్‌కు, నెగెటివ్ ఉంటే హోమ్ క్వారంటైన్‌కు పంపేలా నిర్బంధ విధానాన్ని తీసుకొచ్చారు. కచ్చితంగా వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. గత రెండు వారాలలో బ్రిటన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చినవారి వివరాలను కూడా వైద్యారోగ్య శాఖ సిబ్బంది సేకరిస్తున్నారు.


  కొత్త కరోనా వైరస్ నేపథ్యంలో గత వారం రోజులుగా హైదరాబాద్ చేరుకున్న వారి వివరాలను విమానాశ్రయ వర్గాల ద్వారా సేకరించింది.  ఇప్పుడు వారిని ట్రాక్ చేసే పనిలో పడింది.ట్రాకింగ్‌లో దొరికిన వారి వివరాలను క్షేత్రస్థాయిలో చేరవేసి వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిందిగా అధికారులను ఆదేశించింది. అంతేకాదు బ్రిటన్ నుంచి వచ్చే వారి చుట్టుపక్కల నివసించే వారు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ఆరోగ్య శాఖ హెచ్చరించింది. కొత్త వైరస్ ముప్పు నేపథ్యంలో కొవిడ్ టెస్టులు విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించింది. విదేశాల నుంచి వచ్చేవారి పాస్‌పోర్టులో స్టాంపింగ్ ఆధారంగా గత కొన్ని రోజులుగా వారు ఏయే దేశాల్లో పర్యటించారో తెలుసుకుని, తదుపరి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.  

బ్రిటన్‌లో కరోనా వైరస్ కొత్త  స్ట్రెయిన్ శరవేగంగా విస్తరిస్తుండడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అంతర్జాతీయ విమానాల ద్వారా వచ్చే ప్రయాణికుల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే, వారంతా తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని కోరింది. పాజిటివ్‌గా తేలిన వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు పంపాలని, నెగటివ్ వచ్చిన వారిని ఇంటికి పంపించి వైద్య సిబ్బందితో పర్యవేక్షించాలని సూచించింది.


సోకిన వారికే మళ్లీ! కరోనా కొత్త రూపంతో డేంజర్

కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>