Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/suresh-raina7bcaad9c-15f5-4055-ae02-06b22008b968-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/suresh-raina7bcaad9c-15f5-4055-ae02-06b22008b968-415x250-IndiaHerald.jpgటీంఇండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనా నిబంధనలను పాటించకుండా క్లబ్‌లో ఉన్న నేరం కింద అతడిని అరెస్టు చేశారు. అతడితో పాటు బాలీవుడ్ సింగర్ గురు రంధ్వానాను..suresh raina;suresh;ranina;yajamanya;mumbai;suresh raina;india;bollywood;police;chennai;arrest;international;dubai;adimulapu sureshముంబై క్లబ్‌లో క్రికెటర్ సురేష్ రైనా అరెస్ట్ముంబై క్లబ్‌లో క్రికెటర్ సురేష్ రైనా అరెస్ట్suresh raina;suresh;ranina;yajamanya;mumbai;suresh raina;india;bollywood;police;chennai;arrest;international;dubai;adimulapu sureshTue, 22 Dec 2020 13:08:00 GMTసురేశ్ రైనాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనా నిబంధనలను పాటించకుండా క్లబ్‌లో ఉన్న నేరం కింద అతడిని అరెస్టు చేశారు. అతడితో పాటు బాలీవుడ్ సింగర్ గురు రంధ్వానాను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ముంబై ఎయిర్‌పోర్టు దగ్గరలోని డ్రాగన్ ఫ్లై క్లబ్‌లో ఈ అరెస్టు జరిగింది. వీరితో పాటు క్లబ్‌కు చెందిన మరో 34 మందిని కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

 నిబంధనలకు విరుద్ధంగా నిర్దిష్ట సమయంకంటే ఎక్కువ సేపు క్లబ్ తెరిచి ఉండడంతో రైడ్ చేశామని, ఆ రైడ్‌లో అనేకమందిని అరెస్టు చేశామని, వారిలో క్రికెటర్ సురేశ్ రైనా, సింగర్ గురు రంధ్వానా కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అరెస్టైన వారిపై ఐపీసీ సెక్షన్ 188, 269, 34 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే అరెస్టు చేసిన కొద్ది సేపటికే సురేశ్ రైనా, గురు రంధ్వానాలను బెయిల్‌పై విడుదలైనట్లు చెప్పారు.

ఇదిలా ఉంటే సురేశ్ రైనా ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతానని చెప్పాడు. కానీ కుటుంబ కారణాల దష్ట్యా ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో ఆడకుండా భారత్ తిరిగి వచ్చేశాడు. దీంతో అతడిపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. జట్టులో నుంచి అతడి పేరు కూడా తొలగించింది. అర్ధాంతరంగా దుబాయ్ నుంచి భారత్ వచ్చేయడానికి గల కారణాన్ని సురేశ్ రైనా చెప్పలేదు.

కనీసం జట్టు యాజమాన్యం కూడా ఈ విషయంపై ఎక్కడా పెదవి విప్పలేదు. అయితే అతడికి కేటాయించిన గది నచ్చకపోవడం వల్లనే రైనా తిరిగి వచ్చేశాడని, ధోనీతో మనస్పర్థలు రావడం వల్లనే రైనా జట్టు వదిలి వచ్చేశాడని, ఇలాంటి మరికొన్ని పుకార్లు కూడా అప్పట్లో బయటకు వచ్చాయి. మరి వీటిలో నిజానిజాలు ఏంటనేది రైనా కానీ, సీఎస్‌కే జట్టు కానీ బయటపెడితే కానీ తెలియదు. అయితే వచ్చే ఏడాది ఐపీఎల్‌లో మాత్రం తాను కచ్చితంగా ఆడతానని రైనా ఇంతకు ముందే ప్రకటించాడు.


సంకాంత్రికి పాయల్ రాజ్ పుత్ మూవీ...!

తిరుమల లో పోలీసుల హల్ చల్

స్పొర్ట్స్ : ఒకే ఓవర్ లో 5 వికెట్లూ..సంచలన రికార్డ్ !!

తెలంగాణ లో కొత్త పార్టీ

దారుణం: 4 ఏళ్ల బాలికపై అత్యాచారం.. మరో చోట అత్యాచారం చేసి వీడియోలతో బెదిరింపు

మా ఇళ్ళు శ్రీ రాముడికే

ఛత్రపతి శివాజీ గెటప్లో అదరగొట్టిన బహుభాషా నటుడు మాధవన్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>