MoviesP Subhadra devieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/keerthy-suresh2ec9211f-5f86-4c18-adc3-845794e65e1a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/keerthy-suresh2ec9211f-5f86-4c18-adc3-845794e65e1a-415x250-IndiaHerald.jpg'నేను శైలజా' సినిమాలో రామ్ పోతినేని సరసన నటించి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. ఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ 'మహానటి'తో మాత్రం తెలుగు ప్రేక్షకుల దృష్టిని పూర్తిగా తనవైపు మళ్ళించుకొంది ఈ బ్యూటీ. ప్రిన్స్ మహేష్ తో జోడీ కట్టే అవకాశాన్ని దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది.keerthy suresh;beauty;mahesh;keerthi;suresh;keerthi suresh;kirti;prince;ram pothineni;india;tollywood;press;letter;heroine;mahanatiవెయిట్ పెరుగుతున్న మహానటి... మహేష్ కోసమేనా?వెయిట్ పెరుగుతున్న మహానటి... మహేష్ కోసమేనా?keerthy suresh;beauty;mahesh;keerthi;suresh;keerthi suresh;kirti;prince;ram pothineni;india;tollywood;press;letter;heroine;mahanatiTue, 22 Dec 2020 11:00:00 GMT'నేను శైలజా' సినిమాలో రామ్ పోతినేని సరసన నటించి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. ఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ 'మహానటి'తో మాత్రం తెలుగు ప్రేక్షకుల దృష్టిని పూర్తిగా తనవైపు మళ్ళించుకొంది ఈ బ్యూటీ. ప్రిన్స్ మహేష్ తో జోడీ కట్టే అవకాశాన్ని దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది.



ఈ మధ్య కీర్తి సురేష్ బరువు తగ్గింది. అయితే సన్నటి కీర్తి సురేష్ లుక్ ఫాన్స్ ను పెద్దగా ఇంప్రెస్ చేయలేదని తెలుస్తోంది. 'మిస్ ఇండియా', 'పెంగ్విన్' సినిమాలలోని తన సన్నటి లుక్స్ కు కీర్తి సురేష్ తన అభిమానుల నుంచి నెగటివ్ ఫీడ్ బ్యాక్ అందుకున్నట్టు సమాచారం. ఈ నెగటివ్ ఫీడ్ బ్యాక్ వలన 'సర్కారు వారి పాట' నుంచి కీర్తిని తొలగించడానికి సైతం చిత్ర బృందం ఆలోచించిందని వినికిడి. 



దాంతో కీర్తి ప్రస్తుతం బరువు పెరిగే పనిలో పడిందట. ఇటీవలి పిక్చర్లలో కీర్తి పెద్దగా సన్నగా కనిపించడం లేదు. తనని అందరూ ఎలా ఇష్టపడ్డారో మళ్ళీ ఆ లుక్ ని సంపాదించడం కోసం కీర్తి సురేష్ ప్రయత్నిస్తుందని తెలుస్తోంది. 'సర్కారు వారి పాట' సినిమాలో మళ్ళీ బొద్దుగా ఉండే కీర్తినే చూడవచ్చని ప్రేక్షకులు అంటున్నారు.



కీర్తి సురేష్ ఎంత మంచి నటో అందరికీ తెలిసిందే. అభిమానులు ఇష్టపడేటట్టు లుక్ ని మైంటైన్ చేయడం వలన అభిమానులకు కీర్తి సురేష్ ఇంకా దగ్గర అయ్యే అవకాశాలు ఉంటాయని ఫిల్మ్ క్రిటిక్స్ అంటున్నారు. ఇలా చేయడం వలన కీర్తి సురేష్ తోటి హీరోయిన్లకు గట్టి పోటీ ఇవ్వగలుగుతుందని అంటున్నారు వారు. 



అంతేకాకుండా పెద్ద పెద్ద హీరోల ప్రాజెక్టుల్లో హీరోయిన్ పాత్రలకు కీర్తీ పేరునే మొదట పరిశీలించే అవకాశాలు కూడా ఎక్కువే ఉంటాయని వారు అభిప్రాయపడుతున్నారు. సో, 'సర్కారు వారి పాట' సినిమాలో కీర్తిసురేష్ లుక్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మరి ఈ సినిమాతోనైనా కీర్తి మళ్ళీ ప్రేక్షకులకు చేరువవుతుందా అన్నది చూడాలి. 




నాని సినిమా లో లుక్ అంత సీక్రెట్ గా ఉంచారేంటి..?

డబ్బుకోసం చెల్లిపై దారుణానికి ఒడిగట్టిన అక్క... అయ్యో పాపం..

ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగుల అంశంలో జస్టిస్ కీలక వ్యాఖ్యలు!

రెండు రోజుల్లో పెళ్లి.. కానీ అంతలో బ్యాగ్ ప్రాణం తీసింది..?

విశాఖకు రాజధాని ఖాయం..?

తెలంగాణా మంత్రుల మీద విచారణ...? కేసీఆర్ సంచలన నిర్ణయం

కరోనా ఎఫెక్ట్.. ఆ రాష్ట్రంలో కూడా న్యూ ఇయర్ వేడుకలు బ్యాన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P Subhadra devi]]>