PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mega441d7818-77eb-4135-b3d1-fbd3189d3395-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mega441d7818-77eb-4135-b3d1-fbd3189d3395-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ సినిమా నటుడు. అలాగే జనసేన పార్టీ అధినేత. ఆయనది రెండు రకాలైన బాధ్యతలుగా చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి జన్మ దినం సందర్భంగా ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఒకే ఒక్కరు మాత్రం చెప్ప‌లేదు. ఆయనే పవన్ కళ్యాణ్. పవన్ జగన్ కి విషెస్ చెప్పకపోవడాన్ని కూడా కొందరు తప్పుపడుతూంటే మరి కొందరు సమర్ధించుకుంటున్నారు. mega;pawan;chiranjeevi;modi;kcr;kalyan;jagan;andhra pradesh;janasena;cinema;prime minister;tdp;janasena party;party;anandamపవన్ దూరం...బ్రదర్స్ దగ్గర...?పవన్ దూరం...బ్రదర్స్ దగ్గర...?mega;pawan;chiranjeevi;modi;kcr;kalyan;jagan;andhra pradesh;janasena;cinema;prime minister;tdp;janasena party;party;anandamTue, 22 Dec 2020 21:00:00 GMTపవన్ కళ్యాణ్ సినిమా నటుడు. అలాగే జనసేన పార్టీ అధినేత. ఆయనది రెండు రకాలైన బాధ్యతలుగా చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి జన్మ దినం సందర్భంగా ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఒకే ఒక్కరు మాత్రం చెప్ప‌లేదు. ఆయనే పవన్ కళ్యాణ్. పవన్ జగన్ కి విషెస్ చెప్పకపోవడాన్ని కూడా కొందరు తప్పుపడుతూంటే మరి కొందరు సమర్ధించుకుంటున్నారు.

ఇక చిత్రమేంటంటే రాజకీయాల్లో జగన్ అంటే ఏ మాత్రం పొసగని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జగన్ కి విషెస్ తెలియచేశారు. జగన్ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని బాబు మన‌సారా కోరుకున్నారు. ఇక దేశ ప్రధాని మోడీ సైతం జగన్ కి విషేష్ చెబితే తెలంగాణా సీఎం కేసీయార్ కూడా జగన్ కి శుభాకాంక్షలు చెప్పారు.

పవన్ ఎందుకో చెప్పకపోయినా మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్ చెప్పడం మాత్రం అందరినీ ఆకట్టుకుంది. జగన్ గట్టి పట్టుదల కలిగిన నాయకుడని, సంకల్ప బలం కలిగిన  నేత అంటూ కితాబు ఇచ్చారు. ఇక మరో వైపు ఏపీలో సినీ పరిశ్రమకు జగన్ ఇచ్చిన రాయితీల పట్ల కూడా మెగా బ్రదర్స్ జగన్ కి ధన్యవాదాలు తెలిపారు. ఆలా చెప్పిన వారిలో చిరంజీవి ఉంటే మెగా బ్రదర్ నాగబాబు కూడా జగన్ తీసుకున్న చర్యలు మంచివంటూ అభినందించారు.

ఇదే ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది. ముగ్గురు మెగా బ్రదర్స్ లో చిరంజీవి, నాగబాబు మంచి విషయాలను మెచ్చుకుంటూ జగన్ ని పొగడడం జనసైనికులకు అసలు ఇష్టం లేదు అంటున్నారు.  దీని మీద వారి అభిప్రాయాలను కూడా చెప్పేస్తున్నారు. పవన్ కి రాజకీయంగా ఈ చర్యలు చేటు తెస్తున్నాయని కూడా అంటున్నారుట. అయితే మెగా బ్రదర్స్ చేసిన దాంట్లో ఎలాంటి తప్పూ లేదని అంతా అంటున్నారు. రాజకీయాల్లో మంచి విమర్శలు ఉండాలి. అలాగే మంచి పనులు చేస్తే కూడా అభినందించాలి. పవన్ జనసేన పెట్టిన కొత్తల్లో ఇదే చెప్పారు. కానీ జనసైనికులకు మాత్రం జగన్ ని మెగా బ్రదర్స్ పొగడడం అసలు ఇష్టం లేదు అంటున్నారు. ఇక పవన్ అయితే జగన్ కి ఏ విధంగానూ ఎపుడూ విషేస్ చెప్పిన దాఖలాలు లేవు. మరి చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో.




ఈ-కామర్స్ సంస్థలకు మరో షాకిచ్చిన నోకియా.. ఈ నెల 29 నుంచి...

అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీ

రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం

అవి పెంచుకునేందుకు సర్జరీ.. ఫెయిల్ కావడంతో..

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి? ఢిల్లీకి కోమటిరెడ్డి!

సంక్రాంతికి ఆ రెండు సినిమాలు రెడీ ?

రకుల్‌కు కరోనా.. మంచు లక్ష్మి రియాక్షన్ ఇదే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>