PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjp6f238a34-1478-4806-a87a-2a8712e79f83-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjp6f238a34-1478-4806-a87a-2a8712e79f83-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో బీజేపీ ప్రభంజనం అందరు గమనిస్తూనే ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలతో మొదలైన వారి ప్రభంజనం నిన్నటి గ్రేటర్ ఎన్నికల వరకు కొనసాగుతూ వచ్చింది. ఇకముందు ఆగదని వారి దూకుడు ను బట్టి తెలుస్తుంది.. తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ గెలిచినప్పటికీ బీజేపీ లో ఉత్సాహం నెలకొని ఉంది.. అనుకున్న సీట్లు కన్నా ఎక్కువగా రావడం, అధికార పార్టీ ని నిలువరించడం చూస్తుంటే బీజేపీ కి ఇదే పెద్ద సక్సెస్ లా భావించి సంబరాలు చేసుకుంటుంది.. bjp;kcr;hyderabad;bharatiya janata party;telangana;january;kanna lakshminarayana;bus;parliment;success;yatra;partyతెలుగు రాష్ట్రాల్లో బీజేపీ దూకుడు ని ఎవరు ఆపలేరా..?తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ దూకుడు ని ఎవరు ఆపలేరా..?bjp;kcr;hyderabad;bharatiya janata party;telangana;january;kanna lakshminarayana;bus;parliment;success;yatra;partyTue, 22 Dec 2020 17:08:21 GMTతెలంగాణ లో బీజేపీ ప్రభంజనం అందరు గమనిస్తూనే ఉన్నారు.  పార్లమెంట్ ఎన్నికలతో మొదలైన వారి ప్రభంజనం నిన్నటి గ్రేటర్ ఎన్నికల వరకు కొనసాగుతూ వచ్చింది. ఇకముందు ఆగదని వారి దూకుడు ను బట్టి తెలుస్తుంది.. తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ గెలిచినప్పటికీ బీజేపీ లో ఉత్సాహం నెలకొని ఉంది.. అనుకున్న సీట్లు కన్నా ఎక్కువగా రావడం, అధికార పార్టీ ని నిలువరించడం చూస్తుంటే బీజేపీ కి ఇదే పెద్ద సక్సెస్ లా భావించి సంబరాలు చేసుకుంటుంది..

క్రమక్రమంగా వారి బలం రాష్ట్రంలో పుంజుకుంటూ వచ్చి గెలిచేంతవరకు వచ్చింది బీజేపీ పార్టీ..  కేసీఆర్ లాంటి నాయకుడిని బీజేపీ కంగు తినిపించింది అంటే పార్టీ లో నాయకత్వం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు..ఇక పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ నగర పర్యటనలో ఇటీవల పార్టీ ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో పాగా వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రధానంగా బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కేడర్‌ నిర్మాణం దిశగా అడుగులు వేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.

త్వరలోనే బస్సు యాత్ర చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. టీఆర్‌ఎస్‌ హయాంలో పేదలు, సామాన్యులు ఏం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో పేర్కొంటూ, ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని భావిస్తోంది. ఈ బస్సు యాత్ర అనంతరం రెండో దశలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేతల పాదయాత్రల అంశం చర్చకు వచ్చింది. అంతకన్నా ముందే బీజేపీ తరఫున బస్సు యాత్ర, ఆ వెంటనే సంజయ్‌ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందే సంజయ్‌ నగరంలో పాదయాత్ర చేయాలనుకున్నారు. కానీ, సమయాభావంతో ఆ అవకాశం దక్కలేదు. పార్టీ ముఖ్యనేతలు అందించిన వివరాల ప్రకారం జనవరి లేదా ఫిబ్రవరిలో సంజయ్‌ పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉండగా, అంతకన్నా ముందే బస్సుయాత్ర ఉండనుంది..




జమిలీ ఎన్నికల కి సిద్ధమంటున్న కేంద్ర ఎన్నికల సంఘం..?

గూగుల్, మైక్రోసాఫ్ట్‌ నుంచి కోట్ల నిధులు.. దూసుకుపోతున్న దేశీ టిక్‌టాక్.. జోష్

కొత్త కరోనా అలెర్ట్ : హైదరాబాద్‌కు 358 మంది ప్రయాణికులు!

కేసీఆర్ 30 కోట్లు ఇస్తే: కిషన్ రెడ్డి

కశ్మీర్ ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ.. దూసుకుపోతున్న ఫరూక్ అబ్దుల్లా కూటమి

జాగ్రత్తగా ఉండండి: అధికారులకు బండి సంజయ్ వార్నింగ్

ఎడిటోరియల్ : కేసీఆర్ ముందు చూపు కాస్త ఆలస్యం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>