MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/-sandeep-vanga-movie-in-telugu-is-not-there-now56ca1031-95b7-4f19-a748-db2079c1a220-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/-sandeep-vanga-movie-in-telugu-is-not-there-now56ca1031-95b7-4f19-a748-db2079c1a220-415x250-IndiaHerald.jpgఅర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ లో ఎలాంటి ట్రెండ్ సృష్టించిందో అందరికి తెలిసిందే.. హీరో విజయ్ ని స్టార్ హీరో గా నిలబెట్టిన సినిమా..అలాగే డైరెక్టర్ సందీప్ వంగ రేంజ్ ని కూడా మార్చేసిన సినిమా.. ఇదే సినిమాను బాలీవుడ్ లో కూడా చేసి అంతకుమించి హిట్ కొట్టాడు. ఈ సినిమా తో ఒక్కసారిగా బాలీవుడ్ హీరోల మదిలో చోటు సంపాదించుకున్నాడు..ఈ సూపర్ డూపర్ హిట్ కొట్టి ఓ దశలో బాలీవుడ్ లో సెటిల్ అయిపోతాడు అన్న లెవెల్ లో పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు.. sandeep;cbn;mahesh;ranbir kapoor;salman khan;mahesh babu;sandeep;vijay;bollywood;tollywood;cinema;telugu;arjun reddy;sahid;director;hero;joseph vijay;arjun 1;kick;reddyతెలుగులో సందీప్ వంగ సినిమా ఇప్పట్లో లేనట్లేనా..?తెలుగులో సందీప్ వంగ సినిమా ఇప్పట్లో లేనట్లేనా..?sandeep;cbn;mahesh;ranbir kapoor;salman khan;mahesh babu;sandeep;vijay;bollywood;tollywood;cinema;telugu;arjun reddy;sahid;director;hero;joseph vijay;arjun 1;kick;reddyTue, 22 Dec 2020 08:00:00 GMTఅర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ లో ఎలాంటి ట్రెండ్ సృష్టించిందో అందరికి తెలిసిందే..  హీరో విజయ్ ని స్టార్ హీరో గా నిలబెట్టిన సినిమా..అలాగే డైరెక్టర్ సందీప్ వంగ రేంజ్ ని కూడా మార్చేసిన సినిమా.. ఇదే సినిమాను బాలీవుడ్ లో కూడా చేసి అంతకుమించి హిట్ కొట్టాడు. ఈ సినిమా తో ఒక్కసారిగా బాలీవుడ్ హీరోల మదిలో చోటు సంపాదించుకున్నాడు..ఈ సూపర్ డూపర్ హిట్ కొట్టి ఓ దశలో బాలీవుడ్ లో సెటిల్ అయిపోతాడు అన్న లెవెల్ లో పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు..

అన్నట్లుగానే సందీప్ రెడ్డి ప్రస్తుతం రణబీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు. డెవిల్ అనే టైటిల్ ప్రచారంలో ఉండగా ఇప్పుడు ఆ టైటిల్ ని మార్చారని తెలుస్తుంది.  సల్మాన్ నటిస్తున్న `కిక్`  సీక్వెల్ కి డెవిల్ టైటిల్ ని  ఉపయోగించాలనే ఆలోచనతో ఉన్నారు సాజిద్. దాంతో సందీప్ ఈ టైటిల్ ని తప్పక మార్చుతున్నాడట.మూవీ టైటిల్ ని `యానిమల్` అని మార్చారని తెలుస్తుంది.అయితే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రం ఇప్పటిదాకా ఇంకో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయనేలేదు. అదిగో ఇదిగో అంటూ అభిమానులు ఎదురు చూడటం తప్ప వాళ్ళ కోరిక నెరవేరలేదు.

మధ్యలో మహేష్ బాబుతో ఓ ప్రాజెక్ట్ చేయోచ్చనే టాక్ వచ్చింది కానీ కథ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎంత ఆలస్యమైనా అన్నీ సెట్ అయ్యాకే చేద్దామని నిర్ణయించుకుని దాన్ని వాయిదా వేశారు. తర్వాత రకరకాల పేర్లు, కాంబినేషన్లు వినిపించాయి అవేవి కార్యరూపం దాల్చలేదు.  చివరికి రణబీర్ కపూర్ తో సినిమా చేస్తున్నాడు. అసలే క్రియేటివిటీ తగ్గిపోయి తెలుగు సినిమా మూసలోకి వెళ్తున్న తరుణంలో ఇలాంటి యంగ్ టాలెంట్ వేగంగా ఉండాల్సిన అవసరం ఉంది. సందీప్ వంగ తెలుగు సినిమా కోసం అయన అభిమానులు వేచిచూస్తున్నారు.. మరి ఆ భాగ్యం ఎప్పటికి దక్కుతుందో చూడాలి.


పాపం లోకేష్...?

కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>