PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covidbc01cdb7-cc7f-48fb-945c-5b0123d91746-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covidbc01cdb7-cc7f-48fb-945c-5b0123d91746-415x250-IndiaHerald.jpgదక్షిణ లండన్‌లో బయటపడ్డ కొత్త రకం వైరస్‌ ప్రపంచం మొత్తానికీ ప్రమాదమేనని, తగిన జాగ్రత్త చర్యలు పాటించకపోతే కరోనా వైరస్‌ మరింత వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా హెచ్చరించారు. అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో కేసులున్న భారత్‌లోనూ ఈ కొత్త వైరస్‌ వల్ల కేసులు గణనీయంగా పెరిగే అవకాశముందని చెప్పారు.covid;santoshi;american samoa;kanna lakshminarayana;letter;coronavirusసోకిన వారికే మళ్లీ! కరోనా కొత్త రూపంతో డేంజర్సోకిన వారికే మళ్లీ! కరోనా కొత్త రూపంతో డేంజర్covid;santoshi;american samoa;kanna lakshminarayana;letter;coronavirusTue, 22 Dec 2020 09:04:11 GMT
బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్‌ తీవ్ర భయోత్పాతం సృష్టిస్తోంది. పాజిటివ్‌ కేసులు సంఖ్య కేవలం రెండు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిపోయాయి. ఈ నెల 8న 12,282 కేసులు నమోదు కాగా, 21వ తేదీన 33,364 కేసులు నమోదయ్యాయి.  గత రూపాల కన్నా 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాపించగలదని అంచనా. అయితే వేరియంట్‌ వైరస్‌ కలిగించే వ్యాధి తీవ్రతలో పెద్దగా మార్పులేదని నిపుణులు చెబుతున్నారు.కరోనా నివారణకు కనుగొన్న వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లపై కూడా సమర్ధవంతంగా పనిచేస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. జనాభాలో 60 శాతం పైగా వ్యాక్సిన్‌ తీసుకుంటే వేరియంట్ల వ్యాప్తి అదుపులోకి వస్తుందంటున్నారు.

దక్షిణ లండన్‌లో బయటపడ్డ కొత్త రకం వైరస్‌ ప్రపంచం మొత్తానికీ ప్రమాదమేనని, తగిన జాగ్రత్త   చర్యలు పాటించకపోతే కరోనా వైరస్‌ మరింత వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ  డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా హెచ్చరించారు. అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో కేసులున్న భారత్‌లోనూ ఈ కొత్త వైరస్‌ వల్ల కేసులు గణనీయంగా పెరిగే అవకాశముందని చెప్పారు. గుండెజబ్బులతో పాటు మధుమేహం వంటి సమస్యలు ఉన్న వారిపై దీని ప్రభావం ఉంటుందని రాకేష్ మిశ్రా.  కొత్త వైరస్‌ వల్ల ఒకసారి వ్యాధి బారిన పడ్డవారు మరోసారి అదే వ్యాధి బారిన పడతారేమోనన్న అనుమానం తనకు ఉందని, అదే జరిగితే సమస్య చాలా తీవ్రమవుతుందని వివరించారు. బ్రిటన్‌తో పాటు అమెరికాలోనూ కొత్త రకం వైరస్‌పై పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఆ వివరాల ఆధారంగానే భారత్‌లో చర్యలపై నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాలు వైరస్‌లోని పలు భాగాలపై ఏక కాలంలో దాడి చేస్తాయని, అందువల్ల వైరస్‌లో జన్యుమార్పులు జరిగినా టీకా సామర్థ్యంలో తేడా ఉండదని వివరించారు.




కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?

తెరాస ఎంపీకి కేంద్ర మంత్రి పదవి ఆఫర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>