MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/niharika-marraige-influence-on-hyderabad-marraigesdda76bc3-d893-4fe8-a678-705a0ed3d4c1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/niharika-marraige-influence-on-hyderabad-marraigesdda76bc3-d893-4fe8-a678-705a0ed3d4c1-415x250-IndiaHerald.jpgసెలెబ్రెటీల వ్యక్తిగత విషయాలను వారి ఫ్యాషన్ విషయాలను ప్రజలు బాగా పరిశీలిస్తూ ఉంటారు. ముఖ్యంగా సెలెబ్రెటీల పెళ్ళిళ్ళల్లో వారు వేసుకునే బట్టలు వారు చేసుకునే అలంకరణలను కూడ చాలామంది అనుసరిస్తూ ఉంటారు. ఈమధ్యనే జరిగిన నిహారిక పెళ్ళి వేడుకల ప్రభావంతో భాగ్యనగరంలో పెళ్ళి చేసుకున్న ఒక కొత్త యువ జంట నిహారిక పెళ్ళి ట్రెండ్ ను పూర్తిగా అనుసరించింది.నిహారిక చైతన్యల పెళ్ళి సందర్భంగా ఆ కొత్త జంట తమ ఇద్దరి పేర్లలోని కొన్ని అక్షరాలను చేర్చి ‘నిశ్చయ్’ జంటగా పాపులర్ అయ్యారు. జీవిత భాగస్వామిని భర్త శరీరంలో అర్థ భniharika;pawan;jeevitha rajaseskhar;kalyan;niharika konidela;prasanth;praveen;hyderabad;godavari river;husband;hero;yuva;fashion;prashant kishor: భాగ్యనగం పెళ్ళిళ్ళల్లో నిహారిక పెళ్ళి ఛాయలు !: భాగ్యనగం పెళ్ళిళ్ళల్లో నిహారిక పెళ్ళి ఛాయలు !niharika;pawan;jeevitha rajaseskhar;kalyan;niharika konidela;prasanth;praveen;hyderabad;godavari river;husband;hero;yuva;fashion;prashant kishorTue, 22 Dec 2020 12:00:00 GMTసెలెబ్రెటీల వ్యక్తిగత విషయాలను వారి ఫ్యాషన్ విషయాలను ప్రజలు బాగా పరిశీలిస్తూ ఉంటారు. ముఖ్యంగా సెలెబ్రెటీల పెళ్ళిళ్ళల్లో వారు వేసుకునే బట్టలు వారు చేసుకునే అలంకరణలను కూడ చాలామంది అనుసరిస్తూ ఉంటారు. ఈమధ్యనే జరిగిన నిహారిక పెళ్ళి వేడుకల ప్రభావంతో భాగ్యనగరంలో పెళ్ళి చేసుకున్న ఒక కొత్త యువ జంట నిహారిక పెళ్ళి ట్రెండ్ ను పూర్తిగా అనుసరించింది.


నిహారిక చైతన్యల పెళ్ళి సందర్భంగా ఆ కొత్త జంట తమ ఇద్దరి పేర్లలోని కొన్ని అక్షరాలను చేర్చి ‘నిశ్చయ్’ జంటగా పాపులర్ అయ్యారు. జీవిత భాగస్వామిని భర్త శరీరంలో అర్థ భాగంతో పోలుస్తారు. ఇప్పటి యువత జీవితంలోను తామిద్దరం ఒక్కటి మాత్రమే అని తెలియచేస్తూ భాగ్యనగరంలోని ఒక కొత్త జంట పెళ్ళి కొడుకు ప్రశాంత్ పెళ్ళి కూతురు రితీష్ పేర్లను ఒకటిగా చేసి తమ పేర్లను ‘ప్రతీష’ గా మార్చుకున్నారు.


ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా భాగ్యనగరం కుకట్ పల్లిలో ఉంటున్న ప్రవీణ్ సృజన లు తమ పెళ్ళి సందర్భంగా తమ పేర్లలోని అక్షరాలను కలుపుకుని ‘ప్రజన’ గా తమ పెళ్ళి వేడుకలలో సందడి చేసారు. దీనితో కొత్త తరం వారు తమ పెళ్ళిళ్ళల్లో తమ పేర్లలోని అక్షరాలను కలుపుకుని ముద్దు పేరుగా మార్చుకోవడంలో నిహారిక చైతన్యల పెళ్ళి ప్రభావం ఉంది అంటూ ఒక ప్రముఖ దినపత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.


ఆమధ్య తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఒక వ్యక్తి తన పెళ్ళికి తానా అభిమాన హీరో పవన్ వచ్చినట్లుగా భావిస్తూ తన పెళ్ళి మండపంలో ఒక ఎత్తైన స్టేజ్ ని డెకరేట్ చేసి ఆ స్టేజ్ పై ఒక సింహాసనం చైర్ వేసి ఆ చైర్ లో పవన్ ఫోటోను పెట్టి తన వీరాభిమానాన్ని చాటుకున్నాడు. ఇలా సెలెబ్రెటీల పై ఉన్న అభిమానంతో పెళ్ళిళ్ళలోని పద్ధతులను కూడ మార్చుకుంటూ అది ట్రెండింగ్ లా ఫీల్ అవుతున్నారు..  




అందరికి తమన్ కావాలంటే ఎలా..?

మా ఇళ్ళు శ్రీ రాముడికే

ఛత్రపతి శివాజీ గెటప్లో అదరగొట్టిన బహుభాషా నటుడు మాధవన్!

ఫోన్ కొనేవరకు పెళ్లి చేసుకోనన్న వ్యక్తి.. కంపెనీ బంపర్ గిఫ్ట్

ప్రజల్లో భయాన్ని పోగొట్టేందుకు.. ఫైజర్ టీకా వేయించుకున్న జో బైడెన్

కారు కొనుగోలుపై లక్ష రూపాయల వరకూ తగ్గింపు...కేవలం వారం రోజులే ఆఫర్!

ఎట్టకేలకు కరోనా వైరస్ వ్యాప్తి కారకాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>