PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/false-allegations-on-pawan-kalyand88d651a-40a6-43dc-ab47-b2f4f6bc1b45-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/false-allegations-on-pawan-kalyand88d651a-40a6-43dc-ab47-b2f4f6bc1b45-415x250-IndiaHerald.jpgసీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా అందరూ ఆయనకు విషెస్ చెప్పారు, పవన్ కల్యాణ్ మాత్రం తన అహంభావం ప్రదర్శించారంటూ కొన్ని వెబ్ సైట్లు కథనాలు వండి వార్చాయి. జగన్ కు పవన్ విషెస్ చెప్పలేదని, జగన్ పై పవన్ కి ఉన్న జలసీకి అదే నిదర్శనమంటూ పెద్ద పెద్ద మాటలు అందులో కనిపించాయి. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే.. జనసేన తరపున పవన్ కల్యాణ్ పేరుతో సీఎం జగన్ కి పుట్టినరోజు విషెస్ చెబుతూ ఓ ప్రెస్ నోట్ విడుదలైంది. జనసేన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి పవన్ తన విషెస్ ని తెలిపారు. pawan;pawan;pawan kalyan;shatru;jagan;janasena;twitter;press;ycp;janasena party;partyపవన్ కల్యాణ్ పై అంత ఏడుపు ఎందుకు..?పవన్ కల్యాణ్ పై అంత ఏడుపు ఎందుకు..?pawan;pawan;pawan kalyan;shatru;jagan;janasena;twitter;press;ycp;janasena party;partyTue, 22 Dec 2020 08:00:00 GMTజగన్ పుట్టినరోజు సందర్భంగా అందరూ ఆయనకు విషెస్ చెప్పారు, పవన్ కల్యాణ్ మాత్రం తన అహంభావం ప్రదర్శించారంటూ కొన్ని వెబ్ సైట్లు కథనాలు వండి వార్చాయి. జగన్ కు పవన్ విషెస్ చెప్పలేదని, జగన్ పై పవన్ కి ఉన్న జలసీకి అదే నిదర్శనమంటూ పెద్ద పెద్ద మాటలు అందులో కనిపించాయి. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే.. జనసేన తరపున పవన్ కల్యాణ్ పేరుతో సీఎం జగన్ కి పుట్టినరోజు విషెస్ చెబుతూ ఓ ప్రెస్ నోట్ విడుదలైంది. జనసేన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి పవన్ తన విషెస్ ని తెలిపారు.
" draggable="true">

" draggable="true">
" draggable="true">
అయితే పవన్ తన వ్యక్తిగత అకౌంట్ నుంచి సీఎం జగన్ కి విషెస్ చెప్పలేదని సదరు వెబ్ సైట్ల రోదన కావొచ్చు. పవన్ తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాను ఇటీవల పెద్దగా వాడింది లేదు. కనీసం తన కుటుంబ సభ్యుల ఫంక్షన్ల ఫొటోలు కూడా ఆయన అందులో షేర్ చేయరు. ఇక మిగతా వ్యవహారాలకు ఆయన పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వరనేది బహిరంగ రహస్యమే.

జగన్ అంటే పవన్ కి జలసీ ఏమాత్రం కాదు. ముఖ్యమంత్రిగా ఆయనకు ఇవ్వాల్సిన గౌరవాన్ని పవన్ ఇస్తారు కూడా. కానీ రాజకీయ శతృత్వంతో కొన్నిసార్లు ఘాటు విమర్శలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. అయితే అదే స్థాయిలో వైసీపీ నేతలు, పవన్ వ్యక్తిగత జీవితాన్ని కూడా రాజకీయాల్లోకి లాక్కొచ్చారు. ఈ వివాదాలు ఎలా ఉన్నా కూడా పవన్ హుందాగా సీఎం జగన్ కి బర్త్ డే విషెస్ చెబుతూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. చివరకు దీన్ని కూడా రాజకీయం చేయాలని చూశాయి కొన్ని వెబ్ సైట్లు, పవన్ కి వ్యతిరేకంగా వార్తలు వండి వార్చాయి.

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదికంటే, రెండో ఏడాది సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు కనీ వినీ ఎరుగని రీతిలో జరిగాయి. ఊరూ వాడా సేవా కార్యక్రమాలతోపాటు.. రక్తదానాలు భారీ స్థాయిలో జరిగాయి. పార్టీ కార్యకర్తలే కాదు, సామాన్యులు కూడా జగన్ పై అభిమానంతో రక్తదాన శిబిరాల్లో పాల్గొన్నారు. ఆ స్థాయిలో పుట్టినరోజు వేడుకలు జరిగితే.. పవన్ కల్యాణ్ విషెస్ చెప్పలేదనే విషయాన్ని హైలెట్ చేయాలనుకోవడం ఎందుకు? పవన్ విషెస్ చెప్పినా చెప్పకపోయినా జగన్ కి వచ్చే నష్టమేమీ లేదు. అయినా కూడా పనిగట్టుకుని కొన్ని వెబ్ సైట్లు ఇలాంటి తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టాయి.


పాపం లోకేష్...?

కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>