PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kim-jong-unn-south-korea-amerika-radio2f709d0b-ba12-4d3c-b6ad-5d1d5b09742d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kim-jong-unn-south-korea-amerika-radio2f709d0b-ba12-4d3c-b6ad-5d1d5b09742d-415x250-IndiaHerald.jpgనియంతృత్వానికి మారుపేరుగా ఉండే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎప్పుడూ ఏదో ఒక దుర్మార్గపు చర్యలతో వార్తల్లో ఉంటూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రూరమైన మనస్తత్వం ఉన్న దేశాధినేతగా కిమ్ పిలువబడుతున్నాడు. తాజాగా ఆయన ఓ దుశ్చర్యకు దిగడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. నిషేధిత రేడియో ప్రసారాలు విన్నందుకు ఓ బోట్ కెప్టెన్ ను బహిరంగంగా కాల్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో కిమ్ చర్యల పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఉత్తర కొరియాకు చెందిన చోయ్ అనే వ్యక్తికి 50 నౌకలు ఉన్నkim jong unn south korea amerika radio;ganga;ganges;korea, south;american samoa;police;television;capital;sea;v;kaliఓరి దుర్మార్గుడా ! రేడియో విన్నందుకు కిమ్ కు కాలింది ... బహిరంగంగా కాల్చివేత !ఓరి దుర్మార్గుడా ! రేడియో విన్నందుకు కిమ్ కు కాలింది ... బహిరంగంగా కాల్చివేత !kim jong unn south korea amerika radio;ganga;ganges;korea, south;american samoa;police;television;capital;sea;v;kaliTue, 22 Dec 2020 22:00:00 GMTకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎప్పుడూ ఏదో ఒక దుర్మార్గపు చర్యలతో వార్తల్లో ఉంటూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రూరమైన మనస్తత్వం ఉన్న దేశాధినేతగా కిమ్ పిలువబడుతున్నాడు. తాజాగా ఆయన ఓ దుశ్చర్యకు దిగడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. నిషేధిత రేడియో ప్రసారాలు విన్నందుకు ఓ బోట్ కెప్టెన్ ను బహిరంగంగా కాల్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో కిమ్ చర్యల పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఉత్తర కొరియాకు చెందిన చోయ్ అనే వ్యక్తికి 50 నౌకలు ఉన్నాయి. చాలాకాలంగా అతడు ఫిషింగ్ చేస్తున్నాడు. అంతకుముందే ఉత్తరకొరియా మిలటరీ లో రేడియో ఆపరేటర్ గా పని చేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. ఆ సమయంలోనే విదేశీ రేడియో ప్రచారాలు వినడం ఆయనకు బాగా అలవాటయింది.



మిలట్రీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ విధంగానే ప్రసారాలు వింటూ వస్తున్నారు. సముద్రంలో నౌకలపై దూరప్రాంతాలకు ప్రయాణం చేసే సమయంలోనూ విదేశీ రేడియో ప్రసారాలకు సంబంధించిన ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేసుకుని వార్తలు వినే వాడు. ఆ విధంగానే ఆర్ఎస్ఎస్ అనే సంస్థ రేడియో ప్రసారాలు చాలాకాలంగా వింటున్నాడు. ఈ వ్యవహారం ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్లడంతో అతడిని అరెస్టు చేసి విచారించారు. ఈ విచారణలో తాను 15 ఏళ్లుగా ప్రచారాలను వింటున్నట్టుగా అంగీకరించాడు. దీంతో ఈ వ్యవహారం కిమ్ వరకు వెళ్లడంతో దాదాపు వందమంది ఫిషింగ్ కెప్టెన్స్ మేనేజర్స్ సమక్షంలో పోలీసులు అతడిని బహిరంగంగా కాల్చి చంపారు.


చోయ్ వింటున్న ఆర్ ఎఫ్ ఐ స్టేషన్ కార్యాలయం  దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో ఉంది. ఆ సంస్థకు అమెరికా నుంచి నిధులు వస్తున్నట్టు సమాచారం. మామూలుగానే అమెరికా, దక్షిణ కొరియాపై ఎప్పుడూ ఒంటి కాలిపై లేచే కిమ్ ఆ రేడియో ప్రచారాలు విన్నందుకు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఉత్తర కొరియా ప్రభుత్వం అనుమతించిన మీడియాను మాత్రమే జనం వినాలి, చూడాలి. అలా కాకుండా విదేశీ టీవీ ప్రసారాలు ఎవరైనా వీక్షించినా, విదేశీ రేడియో ప్రసారాలను విన్నా వారికి కఠిన శిక్షలు విధిస్తూ ఉంటారు.

  


అభిజిత్ అందుకే హారికాని అంత బాగా చూసుకున్నాడట....

కొత్త వైరస్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

ఈ-కామర్స్ సంస్థలకు మరో షాకిచ్చిన నోకియా.. ఈ నెల 29 నుంచి...

అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీ

రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం

అవి పెంచుకునేందుకు సర్జరీ.. ఫెయిల్ కావడంతో..

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి? ఢిల్లీకి కోమటిరెడ్డి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>