PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-news18d5b5e2-d707-4295-95d4-418d45ccc45e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-news18d5b5e2-d707-4295-95d4-418d45ccc45e-415x250-IndiaHerald.jpgవైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ పార్టీలో ఉండే లొసుగులు మరొకసారి బయటపడ్డాయి.వైసీపీ పార్టీకి చెందిన ఎం‌ఎల్‌ఏ మద్ది శెట్టి వేణుగోపాల్ మరియు మాజీ ఎం‌ఎల్‌ఏ బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి మద్య వివాదం మరొక సారి బయట పడింది.ఈ సంవత్సరం సీఎం జగన్మోహనరెడ్డి జన్మదిన వేడుకల కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి వైసీపీ పార్టీ పలు సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేకించి అన్నిచోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించమని పార్టీశ్రేణులను, ముఖ్యంగా నేతలకు ఆదేశాలిచ్చారు. ఒకేరోజు ఎక్కువ కేంద్రాల్లో అత్యధిlatest news;venu;mla;service;chirala;ycp;reddy;party;venu thottempudiవైసీపీ క్యాడర్ లో ముదురుతున్న వివాదాలు ..!!వైసీపీ క్యాడర్ లో ముదురుతున్న వివాదాలు ..!!latest news;venu;mla;service;chirala;ycp;reddy;party;venu thottempudiTue, 22 Dec 2020 19:00:00 GMTరెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ పార్టీలో ఉండే లొసుగులు మరొకసారి బయటపడ్డాయి.వైసీపీ పార్టీకి చెందిన ఎం‌ఎల్‌ఏ మద్ది శెట్టి వేణుగోపాల్ మరియు మాజీ ఎం‌ఎల్‌ఏ బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి మద్య వివాదం మరొక సారి బయట పడింది.ఈ సంవత్సరం సీఎం జగన్మోహనరెడ్డి జన్మదిన వేడుకల కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి వైసీపీ పార్టీ పలు సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేకించి అన్నిచోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించమని పార్టీశ్రేణులను, ముఖ్యంగా నేతలకు ఆదేశాలిచ్చారు. ఒకేరోజు ఎక్కువ కేంద్రాల్లో అత్యధికమంది రక్తదానం చేసిన కార్యక్రమంగా ఈ కార్యక్రమం గిన్ని్‌సబుక్‌లోకి ఎక్కాలని కూడా అధిష్ఠానం భావించినట్లు సమాచారం. అందువల్ల ఒంగోల్ జిల్లాలోని ఆ పార్టీశ్రేణులను కదిలించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు తీవ్రంగా పోటీపడ్డారు.

 ఇదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లోని నేతల మధ్య ఆధిపత్యపోరు మరొకసారి బహిర్గతం కావటం, దర్శిలాంటి చోట్ల వివాదం కాస్త రచ్చకెక్కి నేతలు సవాళ్లు విసురుకునే స్థాయికి పోవటంతో వైసీపీ పార్టీలోని ఆంతర్లీన కుమ్ములాటలు మరొక సారి బయటపడ్డాయి.దర్శి, చీరాల నియోజకవర్గాల్లో ఆపార్టీ నేతల ఆధిపత్య పోరు సాధారణ  ప్రజలను కూడా భయభ్రాంతులకు గురిచేసింది.వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రోడ్డి పుట్టినరోజు ఈ సందర్భంగా దర్శిలో ఇటు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ అటు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డిలు వేర్వేరుగా సేవ  కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. వీరి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు ఇటీవల చాలా సందర్బల్లో  బహిర్గతమైంది. జగన్‌ జన్మదిన వేడుకల సాక్షిగా ఇద్దరూ దర్శిలో మరొక సారి సవాళ్లు విసురుకున్నారు.

 ఇంతకాలం తెరవెనుక ఉండి అసమ్మతివాదులను ప్రోత్సహించిన బూచేపల్లి ఈ సారి ప్రత్యక్షంగా రంగంలోకి వచ్చి ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా కార్యక్రమ నిర్వహణకు శ్రీకారం చుట్టారు.దీంతో లీడింగ్ ఎం‌ఎల్‌ఏ వేణుగోపాల్ కూడా పట్టిబిగించి సేవ కార్యక్రమాలు నిర్వహించారు.ఎం‌ఎల్‌ఏ మద్దిసెట్టి మాట్లాడుతూ వైసీపీ క్యాడర్ ను గాలికి వదిలేసి పారిపోయిన వ్యక్తి ఇవాళ అధికారం కోసం ఆరాట పడుతున్నదంటూ బుచేపల్లి ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు.ఇంకా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ర్టానికి 30ఏళ్లపాటు జనగన్నే సీఎం, ఇక్కడ నేనే ఎమ్మెల్యే ..ఎదుర్కొనే వారు ఉంటే రండి’ అంటూ తీవ్రమైన పదజాలంతో హెచ్చరికలు జారీచేశారు.మరో వైపు మాజీ ఎం‌ఎల్‌ఏ బుచేపల్లి,ఆయన తల్లి సదరు ఎం‌ఎల్‌ఏ పై విమర్శలు చేశారు.దోచుకోటానికి, దాచుకోటానికి రాజకీయాల్లోకి రాలేదంటూనే ఎమ్మెల్యే, ఆయన అనుచరులు,అంతా చేసేస్తున్నారంటూ ఘాటు ఘాటు వ్యాఖ్యలు చేశాడు.దీంతో వీరిద్దరి మద్య వివాదం ముదురుతుండడంతో వైసీపీ క్యాడర్ లోని శ్రేణులు  పార్టీ పరువు తీస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరిద్దరిని అధిష్టానం పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.


జమిలి ఎన్నికలు వస్తే ముఖ్యమంత్రి అయ్యే చాన్స్ ?

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు కరోనా

తెలంగాణలో 45 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

కోదండరాం కి ఇది అగ్ని పరీక్ష.. ఎవరి మద్దతు లేకుండా అంటే..?

జమిలీ ఎన్నికల కి సిద్ధమంటున్న కేంద్ర ఎన్నికల సంఘం..?

గూగుల్, మైక్రోసాఫ్ట్‌ నుంచి కోట్ల నిధులు.. దూసుకుపోతున్న దేశీ టిక్‌టాక్.. జోష్

కొత్త కరోనా అలెర్ట్ : హైదరాబాద్‌కు 358 మంది ప్రయాణికులు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>