PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/-greater-election-effect-in-telangana-is-good-for-the-peoplebf1be062-808d-4821-ad2d-72bcc3bd9301-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/-greater-election-effect-in-telangana-is-good-for-the-peoplebf1be062-808d-4821-ad2d-72bcc3bd9301-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో గ్రేటర్ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి.. వాటి ఫలితాలు, ఏ పార్టీ గెలిచింది అన్నది పక్కన పెడితే ఈ ఎన్నికల వల్ల ప్రజలకు ఎఫెక్ట్ బాగానే పడింది అని చెప్పొచ్చు.. గత పదిమాసాలుగా దేశంలో కరోనా ఎంతటి నిర్ణయాత్మకమైన మార్పులు తెచ్చిందో మనం చూశాం. లాక్ డౌన్, సోషల్ డిస్టెన్స్, మాస్క్ అనే కొత్త కొత్త పద్ధతుల్లో జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ని మనం చూస్తున్నాం.. ఇలాంటి సందర్భంలో దేశంలో తప్పక జరగాల్సిన కార్యక్రమాలు ఎంతో జాగ్రత్తగా జరిపించుకునే బాధ్యత మనపై ఉంది.. greater;hyderabad;telangana rashtra samithi trs;telangana;police;traffic police;local language;election commission;partyతెలంగాణ లో గ్రేటర్ ఎన్నికల ప్రభావం ప్రజలమీద బాగానే ఉంది..?తెలంగాణ లో గ్రేటర్ ఎన్నికల ప్రభావం ప్రజలమీద బాగానే ఉంది..?greater;hyderabad;telangana rashtra samithi trs;telangana;police;traffic police;local language;election commission;partyTue, 22 Dec 2020 19:30:00 GMTతెలంగాణ లో గ్రేటర్ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి.. వాటి ఫలితాలు, ఏ పార్టీ గెలిచింది అన్నది పక్కన పెడితే ఈ ఎన్నికల వల్ల ప్రజలకు ఎఫెక్ట్ బాగానే పడింది అని చెప్పొచ్చు.. గత పదిమాసాలుగా దేశంలో కరోనా ఎంతటి నిర్ణయాత్మకమైన మార్పులు తెచ్చిందో మనం చూశాం. లాక్ డౌన్, సోషల్ డిస్టెన్స్, మాస్క్ అనే కొత్త కొత్త పద్ధతుల్లో జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ని మనం చూస్తున్నాం.. ఇలాంటి సందర్భంలో దేశంలో తప్పక జరగాల్సిన కార్యక్రమాలు ఎంతో జాగ్రత్తగా జరిపించుకునే బాధ్యత మనపై ఉంది..

అలాంటిదే ఎన్నికలు.. దేశంలో చాలా చోట్ల ఎన్నికలు కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డాయి.. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతుండడంతో ప్రజలు తమ మాములు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ పరమైన కార్యకలాపాలు జరుపుతున్నాయి.. ఇటీవలే తెలంగాణ లో గ్రేటర్ ఎన్నికలను జరిపారు.. ఇక్కడ తెరాస పార్టీ గెలిచి మేయర్ పీఠాన్ని అధిష్టిస్తుండగా ఇప్పుడు ఓ సమస్య హైదరాబాద్ ప్రజలని పట్టిపీడిస్తోంది. అదే కరోనా.. గతంలో హైదరాబాద్ లో ప్రభావం చూపిన ఈ వ్యాధి గ్రేటర్ ఎన్నికలతో మళ్ళీ ప్రభలింది.

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల విధుల్లో పాల్గొన్న పోలీసుల్లో కొంత మంది క‌రోనా బారిన ప‌డ్డారు. సెంట్ర‌ల్ జోన్ ప‌రిధిలోని ఓ పోలీస్ స్టేష‌న్ లో 5గురు సిబ్బందికి వైరస్ సోకిన‌ట్లు ఇటీవ‌ల బ‌య‌ట‌ప‌డింది. వారిలో ముగ్గురికి రెండో సారి కావ‌డం మ‌రింత క‌ల‌క‌లం రేపుతోంది.హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగుల్లో కొంత మందికి క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డుతుండ‌డం క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది. ప్ర‌భుత్వం ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కొంద‌రు మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. ముఖ్యంగా పోలీసుల్లో ఎక్కువ మంది బాధితులు క‌నిపిస్తున్నారు. ఏపీలో కూడా స్థానిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఈసీ ఉత్సాహం చూపుతోంది. తెలంగాణ‌లో వెలుగులోకి వ‌స్తున్న కేసుల‌ను దృష్టిలో పెట్టుకుని పున‌రాలోచించాల‌ని ఉద్యోగ సంఘాలు కోరుతుండ‌డం గ‌మ‌నార్హం.


పవన్ దూరం...బ్రదర్స్ దగ్గర...?

అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీ

రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం

అవి పెంచుకునేందుకు సర్జరీ.. ఫెయిల్ కావడంతో..

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి? ఢిల్లీకి కోమటిరెడ్డి!

సంక్రాంతికి ఆ రెండు సినిమాలు రెడీ ?

రకుల్‌కు కరోనా.. మంచు లక్ష్మి రియాక్షన్ ఇదే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>