MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/that-is-why-abhijeet-stays-away-from-physical-tasks-8197edf1-36fa-4ed3-94b6-6db819177f03-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/that-is-why-abhijeet-stays-away-from-physical-tasks-8197edf1-36fa-4ed3-94b6-6db819177f03-415x250-IndiaHerald.jpgస్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న క్రేజీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 నిన్నటితో పూర్తయిన విషయం తెలిసిందే. గడిచిన మొదటి మూడు సీజన్స్ కంటే కూడా ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా సాగగండం తో పాటు భారీ స్థాయిలో రేటింగ్స్ కూడా దక్కించుకుంది. ఇక నిన్న జరిగినటువంటి ఈ సీజన్ యొక్క గ్రాండ్ ఫినాలే లో మొత్తం ఐదుగురు ఫైనల్ కంటెస్టెంట్స్ లో అభిజిత్ విన్నర్ గా నిలవగా అఖిల్ సార్థక్ రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఈ ప్రత్యేక ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా విచ్చేశారు. ఇప్పటికే షో ని ఎంతో ఆసక్తికరంగా ముందుకుabhijeet;bigg boss 4 telugu;chiranjeevi;nagarjuna akkineni;abhijith;akhil akkineni;bigboss;media;episode;event;winner;prize;reality show;winner1;star maa;houseవిన్నర్ అయినా అభిజీత్ కి అంత అన్యాయం జరిగిందా ......??విన్నర్ అయినా అభిజీత్ కి అంత అన్యాయం జరిగిందా ......??abhijeet;bigg boss 4 telugu;chiranjeevi;nagarjuna akkineni;abhijith;akhil akkineni;bigboss;media;episode;event;winner;prize;reality show;winner1;star maa;houseMon, 21 Dec 2020 01:00:00 GMTస్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న క్రేజీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 నిన్నటితో పూర్తయిన విషయం తెలిసిందే. గడిచిన మొదటి మూడు సీజన్స్ కంటే కూడా ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా సాగగండం తో పాటు భారీ స్థాయిలో రేటింగ్స్ కూడా దక్కించుకుంది. ఇక నిన్న జరిగినటువంటి ఈ సీజన్ యొక్క గ్రాండ్ ఫినాలే లో మొత్తం ఐదుగురు ఫైనల్ కంటెస్టెంట్స్ లో అభిజిత్ విన్నర్ గా నిలవగా అఖిల్ సార్థక్ రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఈ ప్రత్యేక ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా విచ్చేశారు. ఇప్పటికే షో ని ఎంతో ఆసక్తికరంగా ముందుకు నడిపిస్తున్న హోస్ట్ నాగార్జున నిన్నటి ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి మరింతగా సందడి చేసారు అనే చెప్పాలి.

ఇక ఫైనల్ గా విన్నర్ గా అభిజిత్ ఎనౌన్స్మెంట్ జరిగిన తర్వాత ఆయన అభిమానులు అలానే ప్రేక్షకుల్లో ఎంతో ఆనందం వెల్లివిరిసింది. అయితే అభిజిత్ విన్నర్ గా నిలిచినప్పటికి కూడా ఆయన ఫ్యాన్స్ లో ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు అనేది అందరికీ తెలిసిందేనని అయితే అందులో సగభాగాన్ని అంతకు ముందు సోహెల్ గెలుచుకున్న రూ.25 లక్షలతో కోత విధించడం ఎంతవరకు సబబు అనేది కొందరు ప్రేక్షకులు, అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల వేదికగా ప్రశ్నిస్తున్న మాట. నిజానికి ఒక కంటెస్టెంట్ హౌస్ లోకి అడుగు పెట్టినపుడు విన్నర్ గా మంచి పేరు దక్కించుకోవడంతో తోపాటు ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు గెలవాలి అని కోరుకుంటాడని కానీ బిగ్ బాస్ టీం వారు ఈ విధంగా విన్నర్ ప్రైజ్ మనీ కట్ చేసి వేరొకరికి దానిని షేర్ చేయటం కరెక్ట్ కాదని ఇకపై జరగబోయే టు సీజన్స్ లో ఇటువంటిది మరొకసారి రిపీట్ కాకుండా చూసుకుంటే బాగుంటుందని వారు కోరుతున్నారు.

ఒక రకంగా నిన్న విన్నర్ గా అభిజిత్ నిలిచినప్పటికీ కూడా అతనికి ప్రైజ్ మనీ పరంగా రూ. 25 లక్షలు నష్టం వాటిల్లడం ఆ విధంగా అతనికి తీరని అన్యాయం చేసినట్లే వారు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం పక్కన పెడితే తమ అభిమాన కంటెస్టెంట్ విజేతగా నిలవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ని అభిజిత్ అభిమానులు పండగ సంబరాల్లో మునిగి తేలుతున్నారు..... !!





చైనా కి ఊహించని షాక్ ఇచ్చిన మోడీ.. ఇది చెంపపెట్టు లాంటిదే.?

అమిత్ షా స్పీచ్ లో తప్పులు.. టీఎంసీ ఫైర్!

‘సాహో’ మిస్టేక్ రిపీట్ అవుతుందా?.. ప్రభాస్ ఫ్యాన్స్ భయం!

అన్న ఇండియాను ముంచితే తమ్ముడు అమెరికానే..

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. కరోనా వ్యాక్సినేషన్‌కు సిద్దమవ్వండి

అపర కుబేరుడికి అడుగు దూరంలో ఎలాన్ మాస్క్..

ఎట్టకేలకు కరోనా తగ్గుముఖం.. భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>