PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/yediyurappa11aad01b-a2c2-4076-bc06-9769ad240957-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/yediyurappa11aad01b-a2c2-4076-bc06-9769ad240957-415x250-IndiaHerald.jpgబీజేపీ ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసులను ఉపసంహరిస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా 61 మంది బీజేపీ ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు ఇటీవలే యడ్యూరప్ప సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. కేసుల ఉపసంహరణను వ్యతిరేకిస్తూ పౌర హక్కుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన హైకోర్టు.. సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు షాక్ ఇచ్చింది. yediyurappa;amala akkineni;hari;hari music;bharatiya janata party;karnataka - bengaluru;high court;january;chief minister;mantra;criminalకర్ణాటక ముఖ్యమంత్రికి హైకోర్టు షాక్కర్ణాటక ముఖ్యమంత్రికి హైకోర్టు షాక్yediyurappa;amala akkineni;hari;hari music;bharatiya janata party;karnataka - bengaluru;high court;january;chief minister;mantra;criminalMon, 21 Dec 2020 21:26:30 GMTబీజేపీ ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసులను ఉపసంహరిస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా 61 మంది బీజేపీ ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు ఇటీవలే యడ్యూరప్ప సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. కేసుల ఉపసంహరణను వ్యతిరేకిస్తూ పౌర హక్కుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన హైకోర్టు ధర్మాసనం.. సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు షాక్ ఇచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా 61 మంది బీజేపీ ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

 రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టింది ధర్మాసనం. ఆ నిర్ణయాన్ని అమలు చేయొద్దంటూ స్టే విధించింది. ఈ వ్యవహారంలో కోర్టు తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే దీనిపై 2021, జనవరి 22వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను 2021, జనవరి 29వ తేదీకి వాయిదా వేసింది కర్ణాటక హైకోర్టు.

           సెక్షన్ 321 క్రిమినల్ చట్టం 1973 ప్రకారం.. బీజేపీ ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు గత నెల ఆగస్టు 31న కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్ష నేతలు సహా, ప్రజాసంఘాలు తీవ్రంగా తప్పుపట్టాయి. ఈ నేపథ్యంలో పౌర హక్కుల సంఘం నేతలు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు ధర్మాసనం. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్పూర్తిగా మంచిది కాదని కామెంట్ చేసింది. హైకోర్టు స్టే ఇవ్వడంతో 61 మంది బీజేపీ ప్రజా ప్రతినిధులపై కేసులను ఎత్తివేస్తూ యడియూరప్ప ఇచ్చిన జీవో చెల్లకుండా పోయింది.







చలి చంపేస్తున్నా రైతుల నోట అదే మాట..!

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?

తెరాస ఎంపీకి కేంద్ర మంత్రి పదవి ఆఫర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>