PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/tdp-ysrcp-ap-jagan-valanteerd422dd0a-8285-43b2-9a65-951e8216cb00-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/tdp-ysrcp-ap-jagan-valanteerd422dd0a-8285-43b2-9a65-951e8216cb00-415x250-IndiaHerald.jpgఏపీలో బిజెపి నిజంగా బలం పెంచుకుందో లేక కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉండడంతో ఆ దర్పాన్ని ఇక్కడ ప్రదర్శిస్తుందో తెలియదు కానీ, తన మిత్రపక్షమైన జనసేనను సైతం పెద్దగా లెక్క చేయనట్టుగానే వ్యవహరిస్తూ, టిడిపి, వైసిపి లపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, ఆ పార్టీలను రాజకీయంగా అణగదొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కొద్ది రోజులుగా ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహారావు వంటి వారి వ్యవహారాలు చూస్తే, స్పష్టంగా ఈ విషయం అర్థమవుతుంది. ఒక్కసారిగా వైసీపీ, టీడీపీలపై విరtdp ysrcp ap jagan bjp;tiru;vishnu;bharatiya janata party;godavari river;koshta;jagan;andhra pradesh;tirupati;uttarandhra;rayalaseema;husband;cheque;tdp;central government;ycp;nijam;reddy;dookudu;partyబీజేపీ రూటే సెపరేటు ! వైసీపీ టీడీపీ లకు పొగ పెట్టేస్తోందిగా ?బీజేపీ రూటే సెపరేటు ! వైసీపీ టీడీపీ లకు పొగ పెట్టేస్తోందిగా ?tdp ysrcp ap jagan bjp;tiru;vishnu;bharatiya janata party;godavari river;koshta;jagan;andhra pradesh;tirupati;uttarandhra;rayalaseema;husband;cheque;tdp;central government;ycp;nijam;reddy;dookudu;partyMon, 21 Dec 2020 02:00:00 GMTబిజెపి నిజంగా బలం పెంచుకుందో లేక కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉండడంతో ఆ దర్పాన్ని ఇక్కడ ప్రదర్శిస్తుందో తెలియదు కానీ, తన మిత్రపక్షమైన జనసేనను సైతం పెద్దగా లెక్క చేయనట్టుగానే వ్యవహరిస్తూ, టిడిపి, వైసిపి లపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, ఆ పార్టీలను రాజకీయంగా అణగదొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కొద్ది రోజులుగా ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు,  విష్ణువర్ధన్ రెడ్డి,  జీవీఎల్ నరసింహారావు వంటి వారి వ్యవహారాలు చూస్తే,  స్పష్టంగా ఈ విషయం అర్థమవుతుంది. ఒక్కసారిగా వైసీపీ,  టీడీపీలపై విరుచుకుపడుతున్న తీరు అనేక సందేహాలకు తావిస్తోంది. వైసిపికి రాయలసీమ జిల్లాలలో పట్టు ఎక్కువగా ఉంది. టిడిపికి ఉత్తరాంధ్ర జిల్లాలలో పట్టు ఉంది.



అయితే టీడీపీకి రాయలసీమలో ఉన్న కాస్తో కూస్తో పట్టు కూడా ఈ మధ్య కాలంలో బాగా తగ్గిపోయింది. పూర్తిగా ఆ పార్టీ వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకతను పెంచడంపైనే దృష్టి పెట్టింది. ఈ ప్రాంతంలో బాబు సామాజికవర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండడంతో, ఎప్పటికైనా వారు తమను ఆదరిస్తారని బాబు డిసైడ్ అయిపోయారు. 2014 ఎన్నికల్లోనూ ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లోనే టీడీపీకి ఎక్కువ సీట్లు లభించాయి. బీజేపీకి గోదావరి జిల్లాలతో పాటు విశాఖలో కాస్త పట్టు ఉన్నట్లుగా కనిపిస్తోంది. అటు టిడిపి ఇటు వైసీపీలను దెబ్బ తీయాలంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భాగా బలపడాలని బిజెపి ఒక అభిప్రాయానికి వచ్చేసింది.


అందుకే ముందుగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో సత్తా చాటు కోవడం ద్వారా, రాయలసీమలో పట్టు పెంచుకోవాలని చూస్తోంది. దీని కోసం హిందూ కార్డు బయటకు తీసేందుకు ప్రయత్నిస్తోంది. దాని ద్వారానే జగన్ కు చెక్ పెట్టాలని చూస్తోంది. బలమైన రెడ్డి సామాజిక వర్గంలో చీలిక తీసుకువచ్చి, వైసిపి బలం తగ్గించి బిజెపి బలపడాలని చూస్తోంది. గోదావరి జిల్లాల్లో కాపులను, ఉత్తరాంధ్ర జిల్లాల్లో బీసీలను, టిడిపి వైసిపి లకు దూరం చేయడం ద్వారా, ఆ స్థానాన్ని ఆక్రమించాలి అనే లక్ష్యంతో బిజెపి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున బలమైన నాయకులను తమ పార్టీలో చేర్చుకోవాలనే విషయంపై బీజేపీ దృష్టి పెట్టింది. నియోజకవర్గ స్థాయి నాయకులను , మండలస్థాయి నాయకులను బిజెపిలో చేర్చుకునే  కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తుంది. బిజెపి దూకుడుతో ముందు ముందు వైసిపి టిడిపి లో కాస్త ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడేటట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.








ఒక్క చాన్స్ ప్లీజ్.. అందరిని ఆలోచనలో పడేసిన అమిత్ షా..?

అమిత్ షా స్పీచ్ లో తప్పులు.. టీఎంసీ ఫైర్!

‘సాహో’ మిస్టేక్ రిపీట్ అవుతుందా?.. ప్రభాస్ ఫ్యాన్స్ భయం!

అన్న ఇండియాను ముంచితే తమ్ముడు అమెరికానే..

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. కరోనా వ్యాక్సినేషన్‌కు సిద్దమవ్వండి

అపర కుబేరుడికి అడుగు దూరంలో ఎలాన్ మాస్క్..

ఎట్టకేలకు కరోనా తగ్గుముఖం.. భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>