Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-brings-election-special-enalyst-robin-sharma508bd1c0-bfb1-4c8c-83f0-8ca4c23440da-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-brings-election-special-enalyst-robin-sharma508bd1c0-bfb1-4c8c-83f0-8ca4c23440da-415x250-IndiaHerald.jpgతిరుపతి ఎన్నిక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఆ స్థానంలో ఎలాగైనా పాగా వేయాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. అందుకోసం అన్నిరకాలుగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే సరికొత్తగా వ్యూహకర్త రాబిన్ శర్మను.. elections;view;cbn;bhumika chawla;prasanth;tiru;andhra pradesh;2019;mp;tirupati;2020;husband;tdp;ycp;prashant kishor;master;partyతిరుపతిలో ఎలాగైనా గెలవాలని టీడీపీ ప్లాన్.. ఆయనను కూడా దింపేసిందిగా!తిరుపతిలో ఎలాగైనా గెలవాలని టీడీపీ ప్లాన్.. ఆయనను కూడా దింపేసిందిగా!elections;view;cbn;bhumika chawla;prasanth;tiru;andhra pradesh;2019;mp;tirupati;2020;husband;tdp;ycp;prashant kishor;master;partyMon, 21 Dec 2020 11:04:00 GMTతిరుపతి ఎన్నిక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఆ స్థానంలో ఎలాగైనా పాగా వేయాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. అందుకోసం అన్నిరకాలుగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే సరికొత్తగా వ్యూహకర్త రాబిన్ శర్మను రంగంలోకి దించింది. ఆయన తొలిసారిగా ఆంధ్రాకు రావడమే కాక ఏకంగా తిరుపతిలోనే పాగా వేశారు. దీంతో తిరుపతి ఉపఎన్నిక వాతావరణం వేడెక్కింది.

తిరుపతి లోక్‌సభ‌ స్థానానికి 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాదరావు ఘన విజయం సాధించారు. అయితే 2020 సెప్టెంబరు 16న అనారోగ్య కారణాలతో ఆయన మరణించారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఉపఎన్నిక జరిపేందుకు ఎన్నికల కమిషన్ నోటిపికేషన్ విడుదల చేసింది. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీ.. ఇక్కడి ఉప ఎన్నికలో అయినా గెలిచి సత్తా చాటాలని అనుకుంటోంది. అందుకోసం రాజకీయ వ్యూహకర్త రాబిన్‌ శర్మను తీసుకొచ్చింది.

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, దుర్మార్గపు పాలనను ఎండగట్టి.. ప్రభుత్వ అహంకారాన్ని దెబ్బతీయాలని, అందులో తమకు తోడుండాలని కోరడమే టీడీపీ ప్రధాన ప్రచారాస్త్రంగా తెలుస్తోంది. ఈ ఉప ఎన్నికలో గెలిచి తమ పార్టీ కేడర్‌లో నూతన ఉత్తేజం నింపాలని, ఎంపీ స్థానాన్ని సైతం కైవసం చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. తెలంగాణలో టీఆర్‌ఎస్ అహంకారానికి ప్రజలు దుబ్బాక ఎన్నికతో ఎలా బుద్ధి చెప్పారో ఇక్కడ కూడా వైసీపీకి అలాంటి పరాభవమే ఎదురవుతుందని టీడీపీ ధీమాగా ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తమ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కొద్ది రోజుల క్రితం పనబాక లక్షిని ప్రకటించారు.

ఇదిలా ఉంటే రాబిన్‌ శర్మ గతంలో ప్రశాంత్‌ కిశోర్‌(పీకే) బృందంలో కీలక భూమిక పోషించారు. ఆ తర్వాత బయటికొచ్చి ‘షోటైమ్‌ కన్సల్టింగ్‌’ పేరుతో ప్రత్యేకంగా సంస్థ పెట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్ స్వయంగా వ్యూహకర్తగా ఉన్నారు. ఆయన బృందంలోని వ్యక్తినే ఎన్నికల వ్యూహకర్తగా ఎన్నుకోవడం టీడీపీ మాస్టర్ ప్లాన్‌గా తెలుస్తోంది.

దీంతో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన రాబిన్ శర్మ తిరుపతికి వెళ్లి పలు విషయాలపై అక్కడి నేతలతో చర్చలు జరుపుతున్నారు. గెలుపు కోసం అవసరమైన విషయాలపై మంతనాలు జరుపుతున్నారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు తాను తిరుపతిలోనే ఉంటానని, పార్టీ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని ఇప్పటికే ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.


సాయి ధరం తేజ్ కోసం వస్తున్న రాజమౌళి..!

కేరళ అప్డేట్ : తాజాగా మరో ఆరుగురిలో షింగెల్లా బ్యాక్టీరియా

నన్ను తన్నేందుకు చిరు ఒప్పకోలేదు : సోనుసూద్ ఆసక్తికర కామెంట్స్

జగన్ కు తెలంగాణా ఎంపీ చిన్న కండీషన్

వైసీపీ నాయకులలో ఉత్సాహానికి కారణం అదేనా...?

99.99% మంది ఒకే అన్నారు.. కానీ వాళ్లే ఉద్యమం చేస్తున్నారు..?

జగన్ అందుకే పుట్టారు: ఏపీ మంత్రి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>