MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/brahmanandam-son4f676fac-c33d-45d7-9127-176d8caeaad9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/brahmanandam-son4f676fac-c33d-45d7-9127-176d8caeaad9-415x250-IndiaHerald.jpgకంటెంట్ ఉన్న వాళ్ళకి కటౌట్ ఉంటే సరిపోద్ది అన్న మాట, బ్రహ్మానందంకి కరెక్ట్ గా సరిపోద్ది. ఆయన ఏమీ చేయనక్కర్లేదు. జస్ట్ నిలబడి కెమెరాకి ఫోజిస్తే చాలు. మాట మాట్లాడే పని లేదు. పంచ్ డైలాగ్ వేయాల్సిన పని అంతకంటే లేదు. జస్ట్ ఆయన ముఖం కనబడితే చాలు. brahmanandam son;venkatesh;nani;nagarjuna akkineni;brahmanandam;gautham new;gautham;krishna;rani;siddhartha;vijay;vijay deverakonda;india;telangana;tollywood;cinema;comedy;joseph vijay;father;devarakondaబ్రహ్మానందం చిన్న కొడుకు గురించి ఎవరికి తెలియని విషయాలుబ్రహ్మానందం చిన్న కొడుకు గురించి ఎవరికి తెలియని విషయాలుbrahmanandam son;venkatesh;nani;nagarjuna akkineni;brahmanandam;gautham new;gautham;krishna;rani;siddhartha;vijay;vijay deverakonda;india;telangana;tollywood;cinema;comedy;joseph vijay;father;devarakondaMon, 21 Dec 2020 16:00:00 GMTతెలంగాణ, యావత్తు దునియాలో తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా పడి పడి నవ్వుకుంటారు. అందుకే ఆయన్ని ఆనంద బ్రహ్మ, హాస్య బ్రహ్మ అంటారు. పని ఒత్తిడిలో పడి టెన్షన్ పడుతున్న వాళ్ళు మానసిక ప్రశాంతత కోసం ఇప్పటికీ బ్రహ్మానందం గారి కామెడీ సీన్లు చూసి కడుపు నిండా నవ్వుకుంటారు. కడుపు నిండా అన్నం తిన్నా నిద్ర పడుతుందో లేదో గాని, కడుపు నిండా బ్రహ్మానందం గారి హాస్యం రుచించకపోతే హాస్యప్రియులకి నిద్ర పట్టదు. సినిమాల్లో ఎంత ఎగిరినా, హాస్యనటుడిగా, నటుడిగా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం, హుందాగా వ్యవహరించడం ఆయన నైజం. సినిమా ఫంక్షన్స్ లో గాని, ప్రైవేట్ ఫంక్షన్స్ లో గాని ఆయన అద్భుతంగా స్పీచ్ లిస్తుంటారు. సినిమాల్లో కామెడీ చేసే ఈయనేనా, ఇంత గొప్పగా మాట్లాడుతున్నారనిపిస్తుంది.


అలాంటి బ్రహ్మానందం గారు ఫ్యామిలి విషయానికి వచ్చేసరికి లో ప్రొఫైల్ ని మెయిన్ టెయిన్ చేస్తుంటారు. బ్రహ్మానందం గారికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు గౌతమ్ హీరోగా కొన్ని సినిమాల్లో నటించారు. పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన గౌతమ్ ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకోలేకపోయారు. ఇక మరో కొడుకు, సిద్దార్థ, విదేశాల్లో చదువుకుని ఇటీవలే ఇండియా వచ్చారు. సిద్దార్థని హీరోగా పరిచయం చేయాలని బ్రహ్మానందం అభిప్రాయపడుతున్నారట. కానీ సిద్దార్థ మాత్రం బిజినెస్ చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. బిజినెస్ మేన్ గా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. దీని గురించి డిస్కషన్ జరుగుతున్నట్లు సమాచారం. తాను నడిచిన దారి బాగుంటే ఆ దారిలో తన కొడుకులు వెళ్లాలని ప్రతీ తండ్రి కోరుకుంటారు. అయితే అన్ని రంగాలు ఒక ఎత్తు అయితే, సినిమా రంగం మరొక ఎత్తు. ఇది పోటీ ప్రపంచం. కొంత ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉండాలి. అలా అని ఫ్యామిలీ సపోర్ట్ తో హీరోగా కొనసాగచ్చు అనుకుంటే పొరపాటే. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి, నాగార్జున, వెంకీ, కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. దర్శకులకి ఉండే మొదట ఛాయిస్ నాని, శర్వానంద్, విజయ్ దేవరకొండ వంటి యంగ్ స్టార్లే. ఆ తర్వాత మిగతా హీరోల గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఈ విషయంలో సిద్దార్థ వ్యాపార రంగంలో అడుగుపెట్టడం సరైనదే అని కొందరు బ్రహ్మానందానికి సూచిస్తున్నారట. మరి బ్రహ్మానందం ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 


రెండేళ్లు పూర్తి కెజియఫ్‌ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికోట్లు వచ్చాయో మీకు తెలుసా ?

వైసీపీలో గొడవ పడితే సస్పెండ్...?

ఆ సినిమా కోసం సర్జరీ చేయించుకున్న తాప్సి..?

మోడీ ని కలిసి కేసీఆర్ తన బలహీనత ను చాటుకున్నాడా..?

తెలంగాణాలో కీలక ప్రాజెక్ట్ లు ప్రారంభించిన కేంద్రం

వరల్డ్ ఫ్యామస్ లవర్ ను ఫాలో అవుతున్న నాని

కొడుకు ఫ్రెండ్ తో అఫైర్.. విషయం తెలిసిన భర్త ఏం చేశాడంటే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>