Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/nonvegcceeec29-b9b5-4b25-9107-29356a6ab1d6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/nonvegcceeec29-b9b5-4b25-9107-29356a6ab1d6-415x250-IndiaHerald.jpgచికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్.. ఈ పేర్లు చెప్పగానే నాన్ వెజ్ ప్రియులకు నోరూరిపోతుంది. ఇక భోజనంలో అవి ఉన్నాయంటే ఓ పట్టు పట్టేస్తారు. అయితే వెజిటేరియన్లకు మాత్రం వీటిని తినడం అసలు ఇష్టం ఉండదు. నాన్ వెజ్ వాసన వచ్చిందంటే..nonveg;technology;jeevitha rajaseskhar;tara;delhi;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;egg;chicken;vegetable market;professorనాన్ వెజ్ లాంటి వెజ్.. త్వరలో మార్కెట్ లోకి!నాన్ వెజ్ లాంటి వెజ్.. త్వరలో మార్కెట్ లోకి!nonveg;technology;jeevitha rajaseskhar;tara;delhi;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;egg;chicken;vegetable market;professorMon, 21 Dec 2020 12:07:10 GMTచికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్.. ఈ పేర్లు చెప్పగానే నాన్ వెజ్ ప్రియులకు నోరూరిపోతుంది. ఇక భోజనంలో అవి ఉన్నాయంటే ఓ పట్టు పట్టేస్తారు. అయితే వెజిటేరియన్లకు మాత్రం వీటిని తినడం అసలు ఇష్టం ఉండదు. నాన్ వెజ్ వాసన వచ్చిందంటే చాలు అంత దూరం పారిపోతారు. దీంతో వారి జీవితం మొత్తం పప్పు, దుంపలతోనే గడిచిపోతుంది. ఇలా శాకాహారంతోనే జీవించడం వల్ల వారికి అవసరమైన పోషకాలు లభించక దీర్ఘకాలంలో అనేక ఆనారోగ్య సమస్యలకు గురవుతారు. ఈ సమస్యను తీర్చేందుకు ఎన్నో రోజుల నుంచి వెజిటేరియన్ మీట్‌ను తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. ఎట్టకేలకు వారి ప్రయత్నం ఫలించాయి.


ఐఐటీ ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ కావ్యా దష్రా, అతని బృందం.. దాదాపు రెండేళ్లుగా ప్రోటీన్‌తో కూడిన పోషకాహార ఉత్పత్తులపై పరిశోధనలు సాగిస్తోంది. చిట్టచివరికి వారి పరిశోధనలు ఫలించాయి. పూర్తి శాకాహార ఉత్పత్తులతో మాసం, గుడ్లు తయారు చేసింది. దీనిని శాకాహారులు కూడా నిరభ్యంతరంగా ఆహారంగా తీసుకోవచ్చని, వీటిలో ఎలాంటి జంతు మాంసం కలవదని ఐఐటీ ఢిల్లీ శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ మాంసాన్ని ఐఐటీ ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ టెక్నాలజీ తయారు చేసింది. ఈ వెజిటేరియన్ మీట్ తింటే అచ్చమైన నాన్‌వెజ్ రుచినే ఇస్తాయట. అంతేకాదు దీని వాసన కూడా అసలైన మాంసంలానే ఉంటుందట.

ఈ తరహా పరిశోధనను విజయవంతంగా చేసినందుకుగానూ యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం(యూఎన్డీపీ) తరపున ప్రొఫెసర్ కావ్యకు మాక్ ఎగ్ ఇన్నోవేషన్‌ పురస్కారాన్ని లభించింది. ఈ నూతన ఉత్పత్తిని పరీక్షించేందుకు త్వరలో ఐక్యరాజ్యసమితి బృందం స్వయంగా ఐఐటీ ఢిల్లీకి రానుంది. అలాగే ఆ బృందంలోని శాస్త్రవేత్తలు ఐఐటీ ఢిల్లీ తయారు చేసిన వెజిటేషన్ గుడ్డును ఉడికించి కూడా పరీక్షిస్తారని తెలుస్తోంది. ఈ పరీక్షతో వారు సంతృప్తి చెందితే త్వరలో ఈ శాకాహార మాంసం మార్కెట్లలోకి కూడా దర్శనమిచ్చే అవకాశాలు లేకపోలేదు.

ఏది ఏమైనా మానవుడు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని మరోసారి నిరూపించారు ఐఐటీ ఢిల్లీ శాస్త్రవేత్తలు. వీరి పరిశోధన కొత్తగా ఉండడమే కాక దేశంలో పోషకాహార లోపాన్ని కూడా గొప్పగా తీర్చగలుగుతుంది.


అందరి మనసులు గెలుచుకున్న అభిజిత్ త‌ల్లి

బిజెపిని ఆపండి... వైసీపీ నేతలకు జగన్ ఆదేశాలు

అయ్యప్ప దర్శనానికి వెళ్తున్నారా.. అయితే ఇది తప్పనిసరి.?

జగన్ పై పోరాటం చేస్తా; బిజెపికి చెప్పనున్న పవన్

దటీజ్ చిరంజీవి : ఆ ముగ్గురు బిగ్ బాస్ కాంటెస్టంట్ లకి బంపర్ ఆఫర్

వెంకీమామ రూట్లో పవన్ కళ్యాణ్...?

2020 అనుభవాలను పంచుకున్న పూజా హెగ్డే




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>