MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/shoban-babuda476301-255e-45c6-9717-ffe2129eac49-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/shoban-babuda476301-255e-45c6-9717-ffe2129eac49-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సోగ్గాడుగా, మహానటుడిగా, మనసున్న మారాజుగా ఎనలేని కీర్తి గడించిన నాటభూషణ శోభన్ బాబు 200 లకు పైగా సినిమాల్లో నటించారు. చాలా మంది నటులు ఆయన సినిమాల ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. ప్రకాష్ రాజ్ గురించి శోభన్ బాబు ఏం చెప్పాడో తెలిస్తే అస్సలు నమ్మరుshoban babu;cbn;chiranjeevi;prakash raj;jeevitha rajaseskhar;kirti;raj;sobhan babu;tollywood;success;shoban babu;soggaduప్రకాష్ రాజ్ గురించి శోభన్ బాబు ఏం చెప్పాడో తెలిస్తే అస్సలు నమ్మరుప్రకాష్ రాజ్ గురించి శోభన్ బాబు ఏం చెప్పాడో తెలిస్తే అస్సలు నమ్మరుshoban babu;cbn;chiranjeevi;prakash raj;jeevitha rajaseskhar;kirti;raj;sobhan babu;tollywood;success;shoban babu;soggaduMon, 21 Dec 2020 19:14:00 GMTటాలీవుడ్ సోగ్గాడుగా, మహానటుడిగా, మనసున్న మారాజుగా ఎనలేని కీర్తి గడించిన నాటభూషణ శోభన్ బాబు 200 లకు పైగా సినిమాల్లో నటించారు. చాలా మంది నటులు ఆయన సినిమాల ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. అయితే శోభన్ బాబు, అప్పట్లో తన సినిమాల్లో నటించే వారి గురించి సలహాలు, సూచనలు ఇచ్చేవారు. అంతేకాకుండా ఒక నటుడి టాలెంట్ చూసి అతను ఎదుగుతారో లేదో కూడా చెప్పగల కెపాసిటీ శోభన్ బాబు సొంతం. తాజాగా ఇదే విషయాన్ని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ బయటపెట్టారు. శోభన్ బాబుతో కలిసి దొరబాబు అనే సినిమాలో ప్రకాష్ రాజ్ నటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రకాష్ రాజ్ గురించి, శోభన్ బాబు ఓ మాట అన్నారట. శోభన్ బాబు చెప్పింది చెప్పినట్టుగా తన జీవితంలో జరిగిందని ఓ వేడుకలో వెల్లడించారు.

అప్పుడే కొత్తగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన ప్రకాష్ రాజ్ ఉడుకురక్తంతో, ఉత్సాహంగా ఉండేవారట. యాక్షన్ సీన్స్ లో ప్రకాష్ రాజ్ ఆవేశం చూసి, ప్రకాష్...నటనే కదా, ఎందుకంత తొందర, కాస్త నిదానంగా చెయ్ అని శోభన్ బాబు అన్నారట. ఆ తర్వాత ఒకరోజు ప్రకాష్ రాజ్ ను శోభన్ బాబు దగ్గరకు పిలిచి, "నువ్వు రెండేళ్ల తర్వాత నన్ను మళ్ళీ కలువు" అని అన్నారట. దానికి ప్రకాష్ రాజ్, "రెండేళ్ల తర్వాత ప్రత్యేకించి మిమ్మల్ని కలవమని అడగడమేంటి గురువు గారు, తప్పకుండా కలుస్తా" అని అన్నారట. దానికి శోభన్ బాబు నవ్వుతూ, "నువ్వు కలవలేవోయ్, ఎందుకంటే అప్పుడు నువ్వు సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటావు" అని అన్నారట. ఆయన చెప్పినట్టుగానే రెండేళ్ల తర్వాత ప్రకాష్ రాజ్ బిజీ అయిపోయారట. సడన్ గా ఒకరోజు ఆయన ఎదురైనప్పుడు, గురువు గారు, మీరు చెప్పిందే నిజమైంది. మిమ్మల్ని కలవలేకపోయాను. అంత బిజీగా ఉన్నాను" అని ప్రకాష్ రాజ్ వివరించారట. దానికి శోభన్ బాబు, "నీలో ఆ టాలెంట్, సత్తా చూసే నువ్వు బిజీ ఆర్టిస్టవుతావని చెప్పానయ్య, నీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది. ఇంకా ఎత్తుకు ఎదుగుతావు " అని అన్నారట. అలా శోభన్ బాబు గారి ఆశీర్వాదంతోనే ఇంత సక్సెస్ అయ్యానని ప్రకాష్ రాజ్ గుర్తుచేసుకున్నారు. అప్పట్లో శోభన్ బాబు, చిరంజీవి, బాలక్రిష్ణ వంటి హీరోలని తన కుమారులుగా భావించి ఆశీర్వదించారు, ఆశీర్వదించాలని తన అభిమానులను కోరారు. అందుకే మంచి మనసున్న మారాజుగా శోభన్ బాబు కీర్తించబడుతున్నారు.

టైటిల్
ప్రకాష్ రాజ్ ఇలా అవుతారని శోభన్ బాబు ఆరోజే చెప్పారు?


బీజేపీలో జనతాదళ్ విలీనంపై మాజీ సీఎం కుమారస్వామి స్పందన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?

తెరాస ఎంపీకి కేంద్ర మంత్రి పదవి ఆఫర్...!

రేవంత్ రెడ్డికి పదవి ఇస్తే కాంగ్రెస్ ఖాళీ

స్కై ఈజ్ ద లిమిట్ అంటున్న పవన్ కొత్త సినిమా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>