PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan8fc1572a-6205-49df-a36a-c0d516746c2e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan8fc1572a-6205-49df-a36a-c0d516746c2e-415x250-IndiaHerald.jpgఉత్తరాది దక్షిణాది అన్న తేడా జాతీయ రాజకీయాల్లో ఎపుడూ ఉంది. ఉత్తరాదిలో ఉన్న రాష్ట్రాలలో లోక్ సభ సీట్లు ఎక్కువ. పైగా ఢిల్లీ వారికి బాగా దగ్గర. అందువల్ల రాజకీయంగా కాస్తా రాణిస్తే చాలు జాతీయ నాయకుడు అయిపోవడం చాలా సులువు. అదే దక్షిణాదికి చెందిన వారి ఢిలీలో గళం విప్పాలంటే ఎంతో చేయాలి. ఎన్నో దాటుకుని ముందుకు రావాలి. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత దక్షిణాదికి చెందిన వారు ప్రధానులుగా అయిన వారిని చూసే ఒకరు మాజీ ప్రధాని దివంగత నేత పీవీ నరసింహారావు కనిపిస్తారు. మరొకరు కర్నాటకకు చెందిన హెచ్ డీ దేవేగౌడ కనjagan;ntr;bhumika chawla;jeevitha rajaseskhar;delhi;jagan;2019;kadapa;prime minister;central government;pulivendula;yuvaజాతీయ రాజకీయాల వైపు జగన్ చూపు ?జాతీయ రాజకీయాల వైపు జగన్ చూపు ?jagan;ntr;bhumika chawla;jeevitha rajaseskhar;delhi;jagan;2019;kadapa;prime minister;central government;pulivendula;yuvaMon, 21 Dec 2020 20:00:00 GMTఢిల్లీ వారికి బాగా దగ్గర. అందువల్ల రాజకీయంగా కాస్తా రాణిస్తే చాలు జాతీయ నాయకుడు అయిపోవడం చాలా సులువు. అదే దక్షిణాదికి చెందిన వారి ఢిలీలో గళం విప్పాలంటే ఎంతో చేయాలి. ఎన్నో దాటుకుని ముందుకు రావాలి. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత దక్షిణాదికి చెందిన వారు ప్రధానులుగా అయిన వారిని చూసే ఒకరు మాజీ ప్రధాని దివంగత నేత పీవీ నరసింహారావు కనిపిస్తారు. మరొకరు కర్నాటకకు చెందిన హెచ్ డీ దేవేగౌడ కనిపిస్తారు.

ఇక జాతీయ స్థాయిలో ఎన్టీయార్, చంద్రబాబు వంటి వారు చక్రం తిప్పినా ఆ ఉన్నత పదవి మాత్రం అందుకోలేకపోయారు. ఇక చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఇప్పటిదాకా ఎంపీగా పోటీ చేయలేదు. ఎమ్మెల్యేగానే ఆయన ప్రస్థానం అంతా సాగింది. జగన్ విషయానికి వస్తే ఎంపీగానే అరంగేట్రం చేశారు. రెండు సార్లు ఎంపీగా కడప నుంచి పొలిటికల్ సౌండ్ చేశారు. ఎమ్మెల్యేగా పులివెందుల నుంచి రెండు సార్లు గెలిచారు. ప్రతిపక్ష నాయకుడిగా అయిదేళ్ల పాటు కొనసాగిన జగన్ యువ ముఖ్యమంత్రిగా ఇపుడు కొనసాగుతున్నారు.

జగన్ వయసు ఈ పుట్టిన రోజు వేళకు 47 ఏళ్ళు మాత్రమే. అంటే రాజకీయాల్లో జగన్ యువ నేతగానే ఉన్నారు. ఇంకా మూడు దశాబ్దాలకు పైగా ముఖ్యమంత్రిగా ఉంటానని గట్టిగా చెప్పిన జగన్ పట్టుదలను చూసినపుడు అదే నిజం అనిపిస్తుంది కూడా. జగన్ కి 2019 ఎన్నికల్లో 22 మంది ఎంపీలు వచ్చారు. అయితే కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది కాబట్టి ఆయన ఎంపీల అవసరం లేకపోయింది. అదే అక్కడ సంకీర్ణ రాజకీయాలు కనుక మొదలైతే మాత్రం జగన్ ఎంపీలతో  జాతీయంగా కూడా వెలుగు వెలిగేవారు.

2024లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదు అని అంటున్నారు. అదే కనుక జరిగితే దేశ రాజకీయాల్లో జగన్ అతి ముఖ్యమైన భూమిక పోషించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏది ఏమైనా యువ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కి రేపటి రోజున జాతీయ స్థాయిలో  పోటీగా వచ్చే వారు  ఎవరూ పెద్దగా లేరు అన్నది వాస్తవం.  ఇదే దూకుడు కొనసాగిస్తే మాత్రం జాతీయ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసుకోవడమే కాదు, ఏదొ ఒక రోజు  దేశానికి ప్రధాని అయ్యే చాన్స్ కూడా జగన్ దక్కించుకుంటారు అనడంలో సందేహమే లేదు.





బీజేపీలో జనతాదళ్ విలీనంపై మాజీ సీఎం కుమారస్వామి స్పందన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?

తెరాస ఎంపీకి కేంద్ర మంత్రి పదవి ఆఫర్...!

రేవంత్ రెడ్డికి పదవి ఇస్తే కాంగ్రెస్ ఖాళీ

స్కై ఈజ్ ద లిమిట్ అంటున్న పవన్ కొత్త సినిమా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>