PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-party-josh1b57a2bd-ba84-4d4d-a146-13568608aabc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-party-josh1b57a2bd-ba84-4d4d-a146-13568608aabc-415x250-IndiaHerald.jpgఢిల్లీ పర్యటన నిజంగానే ఏపీ అధికార పార్టీ నేతలకు మంచి బూస్టప్ చేసిందని చెబుతున్నారు. ఇటు వైసిపి కార్యకర్తలు వ్యాఖ్యలు చూస్తుంటే ఆ వార్తలు నిజమే అనిపిస్తున్నాయి. ఇప్పుడు వైసీపీ పార్టీలో చేసుకున్న పరిణామాలు కూడా ఆ వ్యాఖ్యలకు బలం ఇచ్చేలా ఉన్నాయి. వైసిపి నేతల నోటి నుండి వచ్చే కామెంట్లు... వారిలోని ఉత్సాహం వీటన్నింటికీ అద్దంపడుతున్నాయి. ycp party josh;amit shah;delhi;jagan;andhra pradesh;mp;capital;chief minister;minister;polavaram project;central government;ycp;nijam;reddy;josh;party;mantraవైసీపీ నాయకులలో ఉత్సాహానికి కారణం అదేనా...?వైసీపీ నాయకులలో ఉత్సాహానికి కారణం అదేనా...?ycp party josh;amit shah;delhi;jagan;andhra pradesh;mp;capital;chief minister;minister;polavaram project;central government;ycp;nijam;reddy;josh;party;mantraMon, 21 Dec 2020 11:00:00 GMTజగన్ ఢిల్లీ పర్యటన బాగా కలిసొచ్చిందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఢిల్లీ పర్యటనకు ముందు... ఢిల్లీ పర్యటన తర్వాత అంటూ లెక్కలు వేస్తూ పార్టీలో పెను  మార్పులు వచ్చాయి అంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం కూడా ఉంది  అంటున్నారు రాజకీయ పెద్దలు. ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే... ఈ పర్యటనలో సీఎం జగన్... కేంద్ర హోంమంత్రి అమిత్ షాను, అలాగే కొందరు కేంద్ర మంత్రులను కలసి ఏపీ కి సంబంధించిన కొన్ని కీలక విషయాలను వారితో విన్నవించారు. ఈ భేటీలో ముఖ్యంగా ఏపీ మూడు రాజధానుల విషయం, పోలవరం ప్రాజెక్ట్ నిధులు, వరద సహాయక చర్యలు పై ఎలా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై.. దృష్టిసారించినట్లు... రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తెలియజేసి కేంద్రం నుండి సహాయక చర్యలు అందించాల్సిందిగా కోరినట్లు సమాచారం. కాగా ఢిల్లీ పర్యటన అనంతరం వైసిపి నేతల్లో ఫుల్ జోష్ కనబడుతోంది అంటున్నారు పరిశీలకులు.

ఢిల్లీ పర్యటన నిజంగానే ఏపీ అధికార పార్టీ నేతలకు మంచి బూస్టప్ చేసిందని చెబుతున్నారు. ఇటు వైసిపి కార్యకర్తలు వ్యాఖ్యలు చూస్తుంటే ఆ  వార్తలు నిజమే అనిపిస్తున్నాయి. ఇప్పుడు వైసీపీ పార్టీలో చేసుకున్న పరిణామాలు కూడా ఆ వ్యాఖ్యలకు బలం ఇచ్చేలా ఉన్నాయి. వైసిపి నేతల నోటి నుండి వచ్చే కామెంట్లు... వారిలోని ఉత్సాహం వీటన్నింటికీ అద్దంపడుతున్నాయి. ఢిల్లీ పర్యటన ముందువరకు అధికార పార్టీ నేతలు ఎవరూ రాజధాని వికేంద్రీకరణపై పెదవి విప్పింది లేదు... అలాంటిది ఢిల్లీ పర్యటన అనంతరం సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పార్టీ కీల‌క నేత‌, ఎంపీ విజ‌యసాయిరెడ్డి విశాఖ‌లో ఈ అంశంపై మాట్లాడుతూ ఈ మూడు రాజ‌ధానుల విష‌యంపై ఎవ‌రితో మాట్లాడాలో వారితోనే మాట్లాడామ‌ని.. ఎవ‌రితో చ‌ర్చించాలో మాకు తెలుసున‌ని, విశాఖే రాజ‌ధాని హోదాను దక్కించుకుంటుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వానికి అడ్డంకులు చెప్పిన హైకోర్టు ఈ విషయాన్ని అటుంచితే.. ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టే ప్రభుత్వానికి ఆసరాగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జ‌రిగిందో లేదో చూసి తీరుతామ‌న్న హైకోర్టు వైఖరికి ఫుల్ స్టాప్ పెట్టేలా సుప్రీంకోర్టు వ్యవహరిస్తోందని సమాచారం. ఈ నెల 25న పేద‌ల‌కు పాతిక ల‌క్ష‌ల ఇళ్ల స్థ‌లాల‌ను పంపిణీ చేసేందుకు సన్నాహాలు పూర్తి చేయడం కూడా ఢిల్లీ పర్యటన అనంతరం జరగడం విశేషం. పోల‌వ‌రం ప్రాజెక్టు అంచ‌నాల‌ను దాదాపుగా 55 వేల కోట్ల మొత్తానికి పెంచాల‌న్న ప్ర‌భుత్వ విజ్ఞప్తికి క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించేందుకు ప్రాజెక్టు అధారిటీ(పీపీఏ) సీఈవో బృందం ఏపీ లో ప‌ర్య‌టించ‌నుంది. కానీ సీఈవో నేరుగా రంగంలోకి దిగిన సంద‌ర్భం లేద‌ని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అంశంపై విజ్ఞప్తి చేసిన సీఎం జగన్ కు ఆమోదం తెలిపేందుకు కేంద్రం రెడీగా ఉందని.. అందుకే ఇలా సీఈవోను పంపుతున్నట్లు తెలుస్తోంది. ఇలా అన్ని విషయాలను పరిశీలిస్తే ఢిల్లీ పర్యటన మొత్తానికి ఏపీ అధికార పార్టీ వైసిపికి బాగా కలిసి వచ్చిందని అంటున్నారు. 


సాయి ధరం తేజ్ కోసం వస్తున్న రాజమౌళి..!

కేరళ అప్డేట్ : తాజాగా మరో ఆరుగురిలో షింగెల్లా బ్యాక్టీరియా

నన్ను తన్నేందుకు చిరు ఒప్పకోలేదు : సోనుసూద్ ఆసక్తికర కామెంట్స్

జగన్ కు తెలంగాణా ఎంపీ చిన్న కండీషన్

తిరుపతిలో ఎలాగైనా గెలవాలని టీడీపీ ప్లాన్.. ఆయనను కూడా దింపేసిందిగా!

99.99% మంది ఒకే అన్నారు.. కానీ వాళ్లే ఉద్యమం చేస్తున్నారు..?

జగన్ అందుకే పుట్టారు: ఏపీ మంత్రి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>