PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-newsb606b878-9e89-485d-ae47-1f00d9326ae9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-newsb606b878-9e89-485d-ae47-1f00d9326ae9-415x250-IndiaHerald.jpgఏపీ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.బి‌జే‌పి మిత్రపక్షం జనసేన పార్టీ బి‌జే‌పి రాష్ట్ర అద్యక్షుడు సోమూవీర్రాజు పైన అగ్గిమీద గుగ్గిలం అవుతుంది.ఇటీవల సోము వీర్రాజు ఓ సభలో మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికల్లో బి‌జే‌పి అభ్యర్థి పోటీ చేస్తాడని ప్రకటించాడు.దీంతో తమను ఏమాత్రం సంప్రదించకుండా అభ్యర్థి ని ఎలా ప్రకటిస్తారంటూ జనసేన పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు.దీంతో జనసేన పార్టీ కూడా తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని జనసైనికులు చెప్పడంతో, సోము వీర్రాజు తొందరపాటు ప్రకటన ద్వారా బి‌జే‌పికి జనసేనlatest news;chiranjeevi;tiru;bharatiya janata party;andhra pradesh;janasena;tirupati;husband;news;local language;international;janasena party;party"బలాబలాలు తేల్చుకుందాం" అంటున్న.. జనసేనాని !!"బలాబలాలు తేల్చుకుందాం" అంటున్న.. జనసేనాని !!latest news;chiranjeevi;tiru;bharatiya janata party;andhra pradesh;janasena;tirupati;husband;news;local language;international;janasena party;partyMon, 21 Dec 2020 09:05:00 GMTజనసేన పార్టీ బి‌జే‌పి రాష్ట్ర అద్యక్షుడు సోమూవీర్రాజు పైన అగ్గిమీద గుగ్గిలం అవుతుంది.ఇటీవల సోము వీర్రాజు ఓ సభలో మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికల్లో బి‌జే‌పి అభ్యర్థి పోటీ చేస్తాడని ప్రకటించాడు.దీంతో తమను ఏమాత్రం సంప్రదించకుండా అభ్యర్థి ని ఎలా ప్రకటిస్తారంటూ జనసేన పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు.దీంతో జనసేన పార్టీ కూడా తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని జనసైనికులు చెప్పడంతో, సోము వీర్రాజు తొందరపాటు ప్రకటన ద్వారా బి‌జే‌పికి జనసేన రూపంలో గట్టి దెబ్బ తగిలిందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. తాజా గా మిత్రపక్షం జనసేన ఇచ్చిన షాక్‌తో బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.

దీంతో సోము వీర్రాజు పట్ల పార్టీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం.సోము వీర్రాజు  ఒక వర్గానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఇప్పటికే వినిపిస్తున్నాయి.దీంతో సోము వీర్రాజు పై సొంత పార్టీ నేతలు డిల్లీకి పిర్యాదులు పంపుతున్నారని సమాచారం. ఈ సమయంలో తిరుపతిలో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారని ఆయన చేసిన ఏకపక్ష ప్రకటన జనసేనకు ఆగ్రహం తెప్పించింది. బీజేపీకి నోటా కంటే తక్కువ ఓ ట్లు వచ్చాయని.. అలాంటిది తమను కనీసం సంప్రదించకుండా అభ్యర్థిపై ఎలా ప్రకటన చేస్తారని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి సిద్దమైనట్టు తెలుస్తుంది .ఇప్పటికే తిరుపతి సీటుపై ఓ కమిటీని వేశారు.తిరుపతిలో బలమైన సామాజికవర్గం జనసేన కు మద్దతిచ్చే అవకాశం ఉందని జనసేన గట్టి నమ్మకం. అన్నిటికన్నా ముఖ్యంగా  తిరుపతిలో 2009లో చిరంజీవి ఎమ్మెల్యేగా గెలవడాన్ని ప్రస్తావించింది.

రాష్ట్రానికి హోదా గురించి బీజేపీ అక్కడే హామీ ఇచ్చి.. మాట మార్చడం, తిరుపతి అభివృద్ధి అంతా తామే చేశామని కమలనాథులు చెబుతున్నా తిరుపతికి ఒక్క అంతర్జాతీయ విమానం లేకపోవడం, ఐఐటీ ఇచ్చినా సొంత భవనాలకు నిధులు మంజూరు చేయకపోవడం లాంటివన్నీ జనసేన కమిటీ గుర్తించింది. బీజేపీ పోటీ చేసినా ప్రజలు ఆదరించే అవకాశం లేదని. జనసైనికులు భావిస్తున్నారు.అందువల్ల జనసేన అభ్యర్థిని బరిలో నిలుపే దిశగా జనసేనాని ఆలోచిస్తున్నారని తెసుస్తుంది.. గెలుపు సంగతి పక్కన బెట్టినా కేడర్‌లో ఊపు వస్తుందని జనసేన అంచనా వేసింది. కమిటీ ఇచ్చిన సమాచారంతో స్థానిక నేతలకు పవన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. జనసేన అభ్యర్థే బరిలో ఉంటారని అన్యాపదేశంగా తెలియజేశారు.మరి దీనిపై బి‌జే‌పి అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారింది.


పవన్-రానా రీమేక్.. నేడే ముహూర్తం

మళ్లీ జనంలోకి జనసేనాని.. వాళ్ళ గుండెల్లో రైళ్లు!

హెరాల్డ్ సెటైర్ : జగన్ అంటే ఏమిటో ఎల్లోమీడియాకు ఇపుడు తెలిసొచ్చిందా ?

సీఎం జగన్ తో పాటు బర్త్ డే జరుపుకొంటున్న ఫేమస్ వ్యక్తులు వీళ్ళే!

అమిత్ షా స్పీచ్ లో తప్పులు.. టీఎంసీ ఫైర్!

‘సాహో’ మిస్టేక్ రిపీట్ అవుతుందా?.. ప్రభాస్ ఫ్యాన్స్ భయం!

అన్న ఇండియాను ముంచితే తమ్ముడు అమెరికానే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>