Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/latest-crime-news-article-fc28ea76-987c-449a-81d5-51bbe7380a7f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/latest-crime-news-article-fc28ea76-987c-449a-81d5-51bbe7380a7f-415x250-IndiaHerald.jpgభారీ కంటైనర్ ఢీ కుని ఇద్దరు కుమారులు ప్రాణం కోల్పోయారు. ఈ దారుణమైన ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆ ఇద్దరు కుమారులు తండ్రి చూస్తుండగానే ప్రాణం విడిచారు. పూర్తి వివరాల్లోకి వెళితే విశాఖ జిల్లా కోటవురట్లకు చెందిన వారు బర్రే వేణు, ఆయన భార్య లోవలక్ష్మి. ఈ దంపతులు పాయకరావుపేట మండలోని పాల్తేరులోని ఓ ఇటుకబట్టీలో కూలీలుగా పనిచేసేవారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. crime;deva;godavari river;district;vishakapatnam;bike;wife;tuni;father;payakaraopeta;pettaకంటైనర్ ఢీ కుని ఇద్దరు కుమారులు మృతికంటైనర్ ఢీ కుని ఇద్దరు కుమారులు మృతిcrime;deva;godavari river;district;vishakapatnam;bike;wife;tuni;father;payakaraopeta;pettaMon, 21 Dec 2020 16:08:00 GMTగోదావరి జిల్లా తుని పట్టణంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆ ఇద్దరు కుమారులు తండ్రి చూస్తుండగానే ప్రాణం విడిచారు. పూర్తి వివరాల్లోకి వెళితే విశాఖ జిల్లా కోటవురట్లకు చెందిన వారు బర్రే వేణు, ఆయన భార్య లోవలక్ష్మి.  ఈ దంపతులు పాయకరావుపేట మండలోని పాల్తేరులోని ఓ ఇటుకబట్టీలో కూలీలుగా పనిచేసేవారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

 పెద్ద కుమారుడు దుర్గాప్రసాద్(17), తాతాజీ(7) వారి సొంతూరైన కోటవురట్లలోనే చదువుకుంటున్నారు. అయితే వేణు తన కుమారులను తమ స్వగ్రామం నుంచి తీసుకురావడానికి అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలోనే వేణు తన కుమారులతో పాల్తేరుకు బయలుదేరారు. కాని మృత్యువు వారి వెంటే వస్తుందని ఆ తండ్రి గుర్తించలేకపోయాడు. వారు బైక్ పై తుని పట్టణానికి చేరుకున్నారు. అప్పుడే వారిని వెనక నుంచి ఎక్కడి నుంచో వచ్చిందో ఒక కంటైనర్ వారి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దాంతో కొడుకులిద్దరూ కంటైనర్ చక్రాల కిందపడి తండ్రి కళ్లెదుటే తుడి శ్వాస విడిచారు. తండ్రి మాత్రం ప్రాణాలను దక్కించుకున్నాడు.

ఎప్పుడూ తమకు దూరంగా ఉండే ఆ కొడుకులిద్దరినీ తమ దగ్గర కొన్ని రోజులైనా ఉంచుకుందామని ఆశపడ్డారు ఆ తల్లిదండ్రులు. కాని అనుకోని విధంగా వారి కన్న కొడుకులిద్దరినీ మృత్యువు దూరం చేసింది. దాంతో ఆ తల్లిదండ్రులిద్దరూ కన్నీరు మున్నీరయ్యారు. అయ్యో.. మేమేం తప్పు చేశామయ్యా అంటూ గుండెలు పగిలేలా రోదిస్తున్నారు ఆ తల్లిదండ్రులిద్దరూ. కాని నేటి సమాజంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. రోడ్డుపై ఎటువైపు నుంచి మృత్యువు దరిచేరుతుందో తెలిసే అవకాశమే లేకుండా పోయింది. మనం సేఫ్ గా డ్రైవ్ చేసినా అవతలి వారి వలన ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే అంటారు చావు ఎప్పుడు దరిచేరుతుందో ఆ దేవుడైనా చెప్పలేడని..


రెండేళ్లు పూర్తి కెజియఫ్‌ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికోట్లు వచ్చాయో మీకు తెలుసా ?

వైసీపీలో గొడవ పడితే సస్పెండ్...?

ఆ సినిమా కోసం సర్జరీ చేయించుకున్న తాప్సి..?

మోడీ ని కలిసి కేసీఆర్ తన బలహీనత ను చాటుకున్నాడా..?

తెలంగాణాలో కీలక ప్రాజెక్ట్ లు ప్రారంభించిన కేంద్రం

వరల్డ్ ఫ్యామస్ లవర్ ను ఫాలో అవుతున్న నాని

కొడుకు ఫ్రెండ్ తో అఫైర్.. విషయం తెలిసిన భర్త ఏం చేశాడంటే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>