PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ycp8c9841a7-f2c3-4539-8580-fef07ca46a75-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ycp8c9841a7-f2c3-4539-8580-fef07ca46a75-415x250-IndiaHerald.jpgవైసీపీలో వర్గ విభేదాలు తలనొప్పిగా మారాయి. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లితో వివాదానికి మరింత ఆజ్యం పోశారు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తన జోలికి వస్తే ఊరుకోను అంటూ బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. దర్శిలో జరిగిన సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో వైసీపీ నేత బూచేపల్లిపై ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. జగనన్న కోసమే దర్శిలో పోటీ చేశా అని వెల్లడించారు. ఆయన పిలుపుతోనే దర్శిలో పోటీ చేశా అని చెప్పుకొచ్చారు.maddisetti venugopal,ycp,ap;ganga;tiru;venu;ganges;budabukkala;korcha;jagan;maddisetty venugopal;mla;software;ycp;reddy;venu thottempudiరాజీకి వస్తే క్షమించి వదిలేస్తా, జగన్ చెప్తే పోటీ చేశా: వైసీపీ ఎమ్మెల్యేరాజీకి వస్తే క్షమించి వదిలేస్తా, జగన్ చెప్తే పోటీ చేశా: వైసీపీ ఎమ్మెల్యేmaddisetti venugopal,ycp,ap;ganga;tiru;venu;ganges;budabukkala;korcha;jagan;maddisetty venugopal;mla;software;ycp;reddy;venu thottempudiMon, 21 Dec 2020 16:30:00 GMTఎమ్మెల్యే బూచేపల్లితో వివాదానికి మరింత ఆజ్యం పోశారు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తన జోలికి వస్తే ఊరుకోను అంటూ బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. దర్శిలో జరిగిన సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో వైసీపీ నేత బూచేపల్లిపై ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. జగనన్న కోసమే దర్శిలో పోటీ చేశా అని వెల్లడించారు. ఆయన పిలుపుతోనే దర్శిలో పోటీ చేశా అని చెప్పుకొచ్చారు.

నేను ఎవరి సీటు లాక్కోలేదు అని చెప్పారు. పిలిచి పీఠం వేస్తే వచ్చి కూర్చున్నా అని చెప్పారు. జగనన్నకు అవసరమైనప్పుడు ఆయనకు బూచేపల్లి అండగా నిలబడలేదు అని, నేను ఎన్నికల్లో పోటీ చేయనని బూచేపల్లి చెప్పిన తర్వాతే నేను పోటీ చేశా అని పేర్కొన్నారు. సీఎం గా జగన్ పీఠం ఎక్కిన తర్వాత నాకు పెత్తనం కావాలి.. దర్శి నాది అని వస్తున్నాడు అని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలే కదా అని బూచేపల్లి అనుచరులకు కోట్ల రూపాయల పనులు ఇస్తే నాపైనే ఫ్లెక్సీలు వేస్తున్నారు అని విమర్శించారు. దొడ్డిదారి రాజాకీయాలు చేయొద్దు అన్నారు.

రాజీకి వస్తే క్షమించి వదిలేస్తా అని, మీ బుడబుక్కల బ్యాచ్ ను వేసుకుంటూ తిరుగుతూ నియోజకవర్గానికి పనికొచ్చే పనులు ఏమైనా చేశారా అని నిలదీశారు. ఇక్కడున్న బలగం నీ బలగం కాదు.. వైసీపీ బలగం.. అది గుర్తుంచు కోవాలి అని హెచ్చరించారు. ప్రతీసారి నాపై ఆబాండాలు వేస్తూనే ఉన్నారు.. అబాసు పాలవుతూనే ఉన్నారు అని మండిపడ్డారు. మీరు చేసిన తప్పులు ఇంక సహించను అని హెచ్చరించారు. నాపై బురద చల్లేందుకు వస్తే నేను చూస్తూ ఊరుకోను అన్నారు. ఈరోజు జరిగిన కార్యక్రమం నాంది మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి దాకా సాఫ్ట్ వేర్ వాడు సాఫ్ట్ గా ఉంటాడు అనుకున్నారు అని, ఆ పెద్ద మనిషికి ఎంత జరిగినా బుద్ది రాదు.. నీచ రాజకీయాల చేస్తున్నాడు అని మండిపడ్డారు.


రెండేళ్లు పూర్తి కెజియఫ్‌ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికోట్లు వచ్చాయో మీకు తెలుసా ?

వైసీపీలో గొడవ పడితే సస్పెండ్...?

ఆ సినిమా కోసం సర్జరీ చేయించుకున్న తాప్సి..?

మోడీ ని కలిసి కేసీఆర్ తన బలహీనత ను చాటుకున్నాడా..?

తెలంగాణాలో కీలక ప్రాజెక్ట్ లు ప్రారంభించిన కేంద్రం

వరల్డ్ ఫ్యామస్ లవర్ ను ఫాలో అవుతున్న నాని

కొడుకు ఫ్రెండ్ తో అఫైర్.. విషయం తెలిసిన భర్త ఏం చేశాడంటే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>