PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajasingh91d7dbdb-cce8-44e0-8627-b41667a219f0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajasingh91d7dbdb-cce8-44e0-8627-b41667a219f0-415x250-IndiaHerald.jpgతెలంగాణలో బీజేపీ నేతలు ఈ మధ్య కాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. యువతను ఆకట్టుకోవడానికి ఇప్పుడు కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారు. రాజకీయంగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి ఇప్పుడు ఎక్కువగా హిందుత్వ వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లే విధంగా ప్రత్యేక ప్రణాళిక తీసుకుని ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. మరి కొంతమంది నేతలు పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాజకీయంగా తెలంగాణలో భారతీయ జనతాపార్టీ అవకాశాలు తక్కువగా ఉన్నా సరే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుrajasingh,bjp,ts;dharma;raja;bharatiya janata party;telangana rashtra samithi trs;indira gandhi;రాజీనామా;mla;cow slaughter;hindus;partyఅడ్డొస్తే సొంత పార్టీని అయినా తోక్కేస్తా: రాజా సింగ్ సంచలనంఅడ్డొస్తే సొంత పార్టీని అయినా తోక్కేస్తా: రాజా సింగ్ సంచలనంrajasingh,bjp,ts;dharma;raja;bharatiya janata party;telangana rashtra samithi trs;indira gandhi;రాజీనామా;mla;cow slaughter;hindus;partyMon, 21 Dec 2020 16:00:00 GMTబీజేపీ నేతలు ఈ మధ్య కాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. యువతను ఆకట్టుకోవడానికి ఇప్పుడు కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారు. రాజకీయంగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి ఇప్పుడు ఎక్కువగా హిందుత్వ వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లే విధంగా ప్రత్యేక ప్రణాళిక తీసుకుని ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. మరి కొంతమంది నేతలు పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాజకీయంగా తెలంగాణలో భారతీయ జనతాపార్టీ అవకాశాలు తక్కువగా ఉన్నా సరే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

మరి ప్రయత్నాలు ఫలిస్తాయా ఏంటి అనేది తెలియదు కానీ తాజాగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయ వర్గాల్లో సంచలనం గా మారాయి. మరోసారి బీజేపీ శాసనసభా పక్షనేతగా ఉన్న ఆయన ఇందిరా పార్క్ వద్ద మాట్లాడారు. గో రక్షణ కార్యాలయంలో పాల్గొన్న రాజసింగ్... గోరక్షణలో తమకు అడ్డు వస్తే సొంత పార్టీనైనా తొక్కేస్తానన్న రాజసింగ్...  గోరక్షణ కోసం గతంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటే పార్టీ ఒప్పుకోలేదు అని పేర్కొన్నారు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే రాజీనామా చేస్తే కష్ణమని పార్టీ పెద్దలు బ్రతిమలాడారు అని ఆయన పేర్కొన్నారు.

గోమాత నా తల్లి..  గోరక్షణ నాధర్మం.. నా కర్తవ్యం అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు. ప్రతి ఒక్క ఆవును హిందువులు కాపాడుకోవాలి అని ఆయన పేర్కొన్నారు. హిందూ ధర్మం.. గోరక్షణ కోసం ఎంత వరకైనా వెళ్తా అని ఆయన స్పష్టం చేసారు. పార్టీనైనా.. పదవినైనా గోరక్షణ కోసం కాళ్ళకింద తొక్కేస్తాం అని హెచ్చరించారు. ఆవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి అని డిమాండ్ చేసారు. పదవులు నాకు లెక్క కాదు అని, ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బిజేపిలో కూడా హాట్ టాపిక్ అయ్యాయి.


రెండేళ్లు పూర్తి కెజియఫ్‌ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికోట్లు వచ్చాయో మీకు తెలుసా ?

వైసీపీలో గొడవ పడితే సస్పెండ్...?

ఆ సినిమా కోసం సర్జరీ చేయించుకున్న తాప్సి..?

మోడీ ని కలిసి కేసీఆర్ తన బలహీనత ను చాటుకున్నాడా..?

తెలంగాణాలో కీలక ప్రాజెక్ట్ లు ప్రారంభించిన కేంద్రం

వరల్డ్ ఫ్యామస్ లవర్ ను ఫాలో అవుతున్న నాని

కొడుకు ఫ్రెండ్ తో అఫైర్.. విషయం తెలిసిన భర్త ఏం చేశాడంటే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>