MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil292211e2-1e00-4170-bfc7-b5dd99c50bf2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil292211e2-1e00-4170-bfc7-b5dd99c50bf2-415x250-IndiaHerald.jpgఅక్కినేని అఖిల్... అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎప్పుడెప్పుడు వస్తాడా అని ప్రేక్షకులు ఎదురు చూసిన హీరో.. వివి వినాయక్ దర్శకత్వంలో "అఖిల్" అనే భారీ బడ్జెట్ మూవీతోనే ఎంట్రీ ఇచ్చాడు.కాని ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కుప్ప కూలిపోయింది. తరువాత వరుసగా రెండు ప్లాపులని ఎదుర్కున్నాడు.అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇప్పటివరకు సరైన హిట్ అందుకోలేకపోయారు. అయినప్పటికీ అఖిల్ సినిమాల బడ్జెట్ మాత్రం పెరిగిపోతూనే ఉంది. ప్రస్తుతం అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా akhil-akkineni;akhil akkineni;anil sunkara;nageshwara rao akkineni;rashmika mandanna;surender reddy;india;cinema;sunkara ramabrahmam;producer;hindi;producer1;box office;hero;vegetable market;letter;heroine;reddyఅఖిల్ ని నమ్మి అంత పెద్ద రిస్క్ చేస్తున్న సురేందర్ రెడ్డి....అఖిల్ ని నమ్మి అంత పెద్ద రిస్క్ చేస్తున్న సురేందర్ రెడ్డి....akhil-akkineni;akhil akkineni;anil sunkara;nageshwara rao akkineni;rashmika mandanna;surender reddy;india;cinema;sunkara ramabrahmam;producer;hindi;producer1;box office;hero;vegetable market;letter;heroine;reddyMon, 21 Dec 2020 20:00:00 GMTఅక్కినేని అఖిల్... అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎప్పుడెప్పుడు వస్తాడా అని ప్రేక్షకులు ఎదురు చూసిన హీరో.. వివి వినాయక్ దర్శకత్వంలో "అఖిల్" అనే  భారీ బడ్జెట్ మూవీతోనే ఎంట్రీ ఇచ్చాడు.కాని ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కుప్ప కూలిపోయింది. తరువాత వరుసగా రెండు ప్లాపులని ఎదుర్కున్నాడు.అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇప్పటివరకు సరైన హిట్ అందుకోలేకపోయారు. అయినప్పటికీ అఖిల్ సినిమాల బడ్జెట్ మాత్రం పెరిగిపోతూనే ఉంది. ప్రస్తుతం అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటిస్తున్నాడు.

సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే ఇరవై శాతం ఎక్కువ ఖర్చయిందని చెబుతున్నారు. ఈ విషయం పక్కన పెడితే అఖిల్ వచ్చే నెలలో తన కొత్త సినిమాను మొదలుపెట్టవుతున్నాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందిస్తోన్న ఈ సినిమాని 40 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారట.

అఖిల్ లాంటి హీరో మీద ఇంత బడ్జెట్ పెడితే వర్కవుట్ అవుతుందా..? అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. పెట్టిన బడ్జెట్ కి మించి అఖిల్ సినిమా వసూళ్లు రాబట్టగలదా..? అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. డిజిటల్, శాటిలైట్, థియేట్రికల్, హిందీ డబ్బింగ్ ఇలా అన్నీ కలుపుకొని చూసుకుంటే అఖిల్ మార్కెట్ పాతిక కోట్లు కూడా లేదు. ఇవన్నీ లెక్కలేసుకొనే అఖిల్ మీద ఇంత బడ్జెట్ పెట్టడానికి రెడీ అవుతున్నాడు అనీల్ సుంకర.ఈ విషయం తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఫైనాన్షియర్లు కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. ఇన్ని ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ నిర్మాత అనీల్ సుంకర మాత్రం ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాడట.

సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడుతున్నాడట. బాగా జిమ్ చేసి బాడీ పెంచబోతున్నాడట. అలాగే గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటున్నాడట. ఈ సినిమాని ఒక రేంజ్ లో తెరకెక్కించాలని సురేందర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడట. కాగా ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


డిమాండ్‌లో ఎలాంటి మార్పు లేదు...!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?

తెరాస ఎంపీకి కేంద్ర మంత్రి పదవి ఆఫర్...!

రేవంత్ రెడ్డికి పదవి ఇస్తే కాంగ్రెస్ ఖాళీ

స్కై ఈజ్ ద లిమిట్ అంటున్న పవన్ కొత్త సినిమా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>