PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ycp8c9841a7-f2c3-4539-8580-fef07ca46a75-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ycp8c9841a7-f2c3-4539-8580-fef07ca46a75-415x250-IndiaHerald.jpg2011లో యువత, శ్రామికులు మరియు రైతుల సంక్షేమమే తమ అజెండాగా వైఎస్ జగన్ 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ' (YSRCP)ని స్థాపించారు. తన తండ్రి ఆశయాలు, సంక్షేమ పాలనను అందించడమే లక్ష్యమంటూ ప్రజల్లోకి వెళ్లారు. కొద్ది రోజులకే కాంగ్రెస్, టీడీపీల నుంచి ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు.. జగన్‌కు అండగా నిలిచారు. విలువలకు ప్రాధాన్యమిస్తానంటూ.. వారితో పదవులకు రాజీనామా చేయించారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ కడప ఎంపీగా పోటీ చేసి 5 లక్షల 43 వేల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.ycp;dr rajasekhar;telangana rashtra samithi trs;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;mp;రాజీనామా;kadapa;rayalaseema;chief minister;mla;tdp;pulivendula;ycp;father;reddy;party2011లో 'వైసీపీ' స్థాపన ఆషామాషీగా జరగలేదు!2011లో 'వైసీపీ' స్థాపన ఆషామాషీగా జరగలేదు!ycp;dr rajasekhar;telangana rashtra samithi trs;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;mp;రాజీనామా;kadapa;rayalaseema;chief minister;mla;tdp;pulivendula;ycp;father;reddy;partyMon, 21 Dec 2020 09:00:00 GMTముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడిగా, రాజకీయ వారసుడిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. రాయలసీమ ప్రాంతంలోని కడప నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసి లక్షా 78వేల ఓట్లతో భారీ మెజార్టీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో రెండవసారి కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాగా.. రాజశేఖర్‌రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే తర్వాత దురదృష్టవశాత్తు 2009 సెప్టెంబర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చనిపోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని చూసి తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అభిమానులు, కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు జగన్. అయితే ఈ ఓదార్పు యాత్రకు అధిష్టానం అనుమతి ఇవ్వకపోవటం అలాగే ఇతరితర కారణాల కారణంగా కాంగ్రెస్ అధిష్టానంతో జగన్ విభేదించారు.. ఇక కాంగ్రెస్‌ పార్టీకి అలాగే తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు... ఇక అతని తల్లి విజయమ్మ కూడా బిడ్డతో పాటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.


ఇక 2011లో యువత, శ్రామికులు మరియు రైతుల సంక్షేమమే తమ అజెండాగా వైఎస్ జగన్ 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ' (YSRCP)ని స్థాపించారు. తన తండ్రి ఆశయాలు, సంక్షేమ పాలనను అందించడమే లక్ష్యమంటూ ప్రజల్లోకి వెళ్లారు. కొద్ది రోజులకే కాంగ్రెస్, టీడీపీల నుంచి ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు.. జగన్‌కు అండగా నిలిచారు. విలువలకు ప్రాధాన్యమిస్తానంటూ.. వారితో పదవులకు రాజీనామా చేయించారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ కడప ఎంపీగా పోటీ చేసి 5 లక్షల 43 వేల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక విజయమ్మ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయగా.. కాంగ్రెస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని బరిలోకి దింపింది. కానీ విజయమ్మ 85వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈవిధంగా మొత్తానికి వైఎస్ జగన్ పెద్ద పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ మరియు టీఆర్ఎస్ పార్టీల మద్య కొత్త పార్టీ ‘వైసీపీ’ని స్థాపించారు.


పవన్-రానా రీమేక్.. నేడే ముహూర్తం

మళ్లీ జనంలోకి జనసేనాని.. వాళ్ళ గుండెల్లో రైళ్లు!

హెరాల్డ్ సెటైర్ : జగన్ అంటే ఏమిటో ఎల్లోమీడియాకు ఇపుడు తెలిసొచ్చిందా ?

సీఎం జగన్ తో పాటు బర్త్ డే జరుపుకొంటున్న ఫేమస్ వ్యక్తులు వీళ్ళే!

అమిత్ షా స్పీచ్ లో తప్పులు.. టీఎంసీ ఫైర్!

‘సాహో’ మిస్టేక్ రిపీట్ అవుతుందా?.. ప్రభాస్ ఫ్యాన్స్ భయం!

అన్న ఇండియాను ముంచితే తమ్ముడు అమెరికానే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>