Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/samutharakani-to-play-father-of-rana-dhaggupati-in-malayalam-remake-movie-942bb8d0-7719-4c97-a37b-14594f9877ba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/samutharakani-to-play-father-of-rana-dhaggupati-in-malayalam-remake-movie-942bb8d0-7719-4c97-a37b-14594f9877ba-415x250-IndiaHerald.jpgకరోనా కారణంగా టాలీవుడ్ హడావుడి పూర్తిగా తగ్గిపోయింది. అయితే కరోనా కొద్దిగా తగ్గిందే ఆలస్యం టాలీవుడ్ ఇండస్ట్రీ మళ్లీ పుంజుకోవడానికి సంసిద్దమవుతోంది. స్టార్స్ ను తెరముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అందులోనూ థియేటర్లు తెరచుకొని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనే వార్తలు కూడా వస్తున్నాయి. అందుకే డైరెక్టర్లు తమ పనులను వేగవంతం చేస్తున్నారు. చిన్నా.. పెద్ద హీరోలు తమ తమ సినిమాల్లో బిజీ బిజీగా ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన బల్లాల దేవ గురించే. ఈ ఆరడుగుల అందగాడికి సినిranaa dhaggupati;pawan;rana;chinna;deva;kalyan;kranthi;kranti;makar sakranti;tollywood;industries;cinema;telugu;sankranthi;ala venkatapuram lo;tamil;2020;industry;air;hero;traffic police;father;ala vaikunthapurramloo;ala vaikuntapuramloబల్లాల దేవ తండ్రిగా అతడా?బల్లాల దేవ తండ్రిగా అతడా?ranaa dhaggupati;pawan;rana;chinna;deva;kalyan;kranthi;kranti;makar sakranti;tollywood;industries;cinema;telugu;sankranthi;ala venkatapuram lo;tamil;2020;industry;air;hero;traffic police;father;ala vaikunthapurramloo;ala vaikuntapuramloMon, 21 Dec 2020 14:30:00 GMTటాలీవుడ్ హడావుడి పూర్తిగా తగ్గిపోయింది. అయితే కరోనా కొద్దిగా తగ్గిందే ఆలస్యం టాలీవుడ్ ఇండస్ట్రీ మళ్లీ పుంజుకోవడానికి సంసిద్దమవుతోంది. స్టార్స్ ను తెరముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అందులోనూ థియేటర్లు తెరచుకొని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనే వార్తలు కూడా వస్తున్నాయి. అందుకే డైరెక్టర్లు తమ పనులను వేగవంతం చేస్తున్నారు. చిన్నా.. పెద్ద హీరోలు తమ తమ సినిమాల్లో బిజీ బిజీగా ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన బల్లాల దేవ గురించే. ఈ ఆరడుగుల అందగాడికి సినిమా అవకాశాలు బాగానే వస్తున్నాయి. అందులోనూ అరణ్యం సినిమా సంక్రాంతి కానుకగా తెరముందుకు వెళ్లేందుకు సన్నద్ధం అవుతోంది.

కాగా మరో సినిమాలో ఒక ప్రముఖ పాత్రలో కనిపించడానికి సిద్ధమయ్యాడు ఈ బల్లాల దేవ. 2020 సంవత్సరంలో మలయాళంలో సూపర్ డూపర్ గా హిట్ కొట్టిన సినిమా ‘అయ్యాప్పనుమ్ కోషియం’. ఈ మూవీని తెలుగులోకి రీమెక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.  దీనిపై ఎవరు ఈ మూవీకి దర్శకుడెవరు, నిర్మాతెవరు, హీరోలెవరూ అంటూ వార్తలు పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పలానా హీరో నటిస్తున్నాడని వార్తలు బాగానే వినిపించాయి. కాని అందరి ఆలోచనలు తలకిందులుగా మారాయనపించింది. ఎందుకంటే ఈ సినిమాలో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. అతడే ఫైనల్ అంటూ అధికారిక ప్రకటన కూడా చేసింది ఆచిత్ర యూనిట్.

ఆ తర్వాత పవన్ కు ధీటుగా ఉంటే ఇంకో క్యారెక్టర్ లో రానా దగ్గుపాటి కూడా నటిస్తున్నాడని వార్తలు వినిపించాయి. ఈ మెయిన్ క్యారెక్టర్లు ఫిక్స్ అయిన తర్వాత మిగతా నటీ నటుల కోసం గాలింపు చర్యలు మొదలయ్యాయనే చెప్పుకోవచ్చు.  అయితే ఈ సినిమాలో పవన్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ప్రముఖ పాత్రలో రానా నటించబోతున్నాడు. అయితే ఇందులో రానా తండ్రి క్యారెక్టర్ ఎవరికియ్యాలబ్బా అంటూ చర్చలు కూడా జరిగాయి. చివరికి ఈ మూవీలో రానా తండ్రిగా ప్రముఖ తమిళ నటుడు సముద్ర కని నటించబోతున్నట్టు తెలస్తోంది. ఇది ఒక చాలా పవర్ ఫుల్ క్యారెక్టరే అంటూ సమాచారం. ఈ నటుడు ఇంతకుముందు అల వైకుంఠపురములో కూడా నటించి మెప్పించాడు. ఇప్పుడు రానా, పవన్ కాంబినేషన్ లో రాబోతున్న  ఈ మల్టీస్టారర్ సినిమాలో కనిపించనున్నాడు. 


సీఎం జగన్‌కు చంద్రబాబు ట్వీట్.. ఏమన్నారంటే?

నువ్వా.. నేనా అనే విధంగా పవన్, రానా ల పరిస్థితి

పసిడి ప్రియులకు భారీ షాక్ .. ఒకే రోజు భారీగా పెరిగిన ధర..!!

జగన్ బెస్ట్ ఫ్రెండ్ ఒక టాలీవుడ్ హీరో.. ఎవరో తెలుసా ?

ఎట్టకేలకు తిరుపతి బరిలో జనసేనాని.. విజయం సాధించేనా..?

బీజేపీ ఆ ఫీట్ సాధిస్తే నేను ట్విటర్ వదిలేస్తా.. పీకే ఛాలెంజ్

కేంద్రంతో కేసీఆర్ స్నేహమే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>