Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/pattabipuram-latest-crime-news-2b48ca83-a8fd-4377-a8ae-dede0574a27a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/pattabipuram-latest-crime-news-2b48ca83-a8fd-4377-a8ae-dede0574a27a-415x250-IndiaHerald.jpgపట్టాభిపురం: ప్రేమ పేరుతో వేధిస్తున్న ఓ యువకుడికి చెప్పుదెబ్బతో బుద్ధి చెప్పాడు ఆ యువతి తండ్రి.. ఆ చెప్పు దెబ్బే ఓ యువకుడి ప్రాణం తీసింది. అవమాన భారంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కొరిటపాడు సమీపంలోని హనుమయ్యనగర్ కు చెందిన యువకుడు షేక్ పర్దిన్ వలి. ఇతను అక్కడే పెయింటింగ్ పని చేసుకుంటూ బతుకుతున్నాడు. అయితే అతను చదువుకునేటప్పుడు 8వ తరగతి లో అదే ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థినితో షేక్ వర్దిన్ వలికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం అలాగే కొనసాగుతూ వచ్చింది. crime;prema;police;love;degree;police station;traffic police;father;pettaప్రియురాలి చెప్పుదెబ్బే.. ఆ యువకుడి ప్రాణం తీసిందా ?ప్రియురాలి చెప్పుదెబ్బే.. ఆ యువకుడి ప్రాణం తీసిందా ?crime;prema;police;love;degree;police station;traffic police;father;pettaMon, 21 Dec 2020 16:04:45 GMTప్రేమ పేరుతో వేధిస్తున్న ఓ యువకుడికి చెప్పుదెబ్బతో బుద్ధి చెప్పాడు ఆ యువతి తండ్రి.. ఆ చెప్పు దెబ్బే ఓ యువకుడి ప్రాణం తీసింది. అవమాన భారంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కొరిటపాడు సమీపంలోని హనుమయ్యనగర్ కు చెందిన యువకుడు షేక్ పర్దిన్ వలి. ఇతను అక్కడే పెయింటింగ్ పని చేసుకుంటూ బతుకుతున్నాడు. అయితే అతను చదువుకునేటప్పుడు 8వ తరగతి లో అదే ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థినితో షేక్ వర్దిన్ వలికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం అలాగే కొనసాగుతూ వచ్చింది.

అయితే ఇటీవలె ఆ యువతి డిగ్రీ పూర్తి చేసింది. తాజాగా ఆ యువతి వ్యాయామానికి వెళ్లేటప్పుడు షేక్ వర్దిన్ వలి ఆమె  వెంటపడుతూ తీవ్ర వేధింపులకు గురి చేశాడు. దాంతో విసిగిపోయిన ఆ యువతి షేక్ వర్దిన్ గురించి అతని వేధింపుల గురించి తన తండ్రికి చెప్పింది. ఆ యువతి తండ్రి షేక్ పర్దిన్ వలిని నడిరోడ్డుపై ఆపి తన కూతురితో చెప్పుతో కొట్టించాడు. అదీ కాక మళ్లీ తన కూతురువైపు చూస్తే బాగుండదని బెదిరించి అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు షేక్ పర్దీన్ ను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. దాంతో ఆ యువకుడు అవమానంగా భావించాడు.

దాంతో తీవ్ర మనస్థాపానికి గురై  ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తో ఆ యువకుడి బంధువులు మృతదేహాన్ని అరండల్ పేట పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లి ఆందోళన చేశారు. మాకు న్యాయం జరగాలంటూ.. ఆ యువతితో పాటుగా ఆమె తండ్రిపై కేసు నమోదు చేసుకుని వారిని శిక్షించాలంటూ ఆందోళనకు దిగారు. దాంతో సీఐ శ్రీనివాసరావు కల్పించుకుని తండ్రీకూతురిపై కేసు నమోదు చేసుకుని శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పటల్ కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.


రమ్యకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ అయినా కూడా ఈ సినిమా చేయనంటే చేయనంది ఎందుకు..?

రెండేళ్లు పూర్తి కెజియఫ్‌ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికోట్లు వచ్చాయో మీకు తెలుసా ?

వైసీపీలో గొడవ పడితే సస్పెండ్...?

ఆ సినిమా కోసం సర్జరీ చేయించుకున్న తాప్సి..?

మోడీ ని కలిసి కేసీఆర్ తన బలహీనత ను చాటుకున్నాడా..?

తెలంగాణాలో కీలక ప్రాజెక్ట్ లు ప్రారంభించిన కేంద్రం

వరల్డ్ ఫ్యామస్ లవర్ ను ఫాలో అవుతున్న నాని




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>