PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/we-are-ready-for-that-election-are-you-readyb40c2d5c-3e00-4358-8f93-239e88e54b8e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/we-are-ready-for-that-election-are-you-readyb40c2d5c-3e00-4358-8f93-239e88e54b8e-415x250-IndiaHerald.jpgఒక దేశం- ఒక ఎన్నికకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా. జమిలీ ఎన్నికలపై ప్రధాని ప్రకటన చేసిన నెల రోజుల తర్వాత.. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేంద్రం చట్టాన్ని మారిస్తే... జమిలీ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి సమస్యలు లేవంటోంది కేంద్ర ఎన్నికల సంఘం. we are ready for that election are you ready;modi;sunil;narendra modi;prime minister;central governmentఆ ఎన్నికలకు మేం రెడీ.. మీరు రెడీయా..?ఆ ఎన్నికలకు మేం రెడీ.. మీరు రెడీయా..?we are ready for that election are you ready;modi;sunil;narendra modi;prime minister;central governmentMon, 21 Dec 2020 21:00:00 GMTకేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా. జమిలీ ఎన్నికలపై ప్రధాని ప్రకటన చేసిన నెల రోజుల తర్వాత.. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేంద్రం చట్టాన్ని మారిస్తే... జమిలీ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి సమస్యలు లేవంటోంది కేంద్ర ఎన్నికల సంఘం.

మీరు సరే అంటే... మేము కూడా సై అంటోంది కేంద్ర ఎన్నికల సంఘం. జమిలి ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం చట్టాలను సవరిస్తే... ఒక దేశం- ఒక ఎన్నిక సాధ్యమే అన్నారు కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా. జమిలీ ఎన్నికల గురించి ప్రధాని పదే పదే ప్రస్తావిస్తున్న తరుణంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ప్రకటన కీలకంగా మారింది.

నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జమిలీ ఎన్నికల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఏటా ఏదో ఒక రాష్ట్రంలో వస్తున్న ఎన్నికల వల్ల అభివృద్ధి ఆగిపోతోందని ప్రధాని మోడీ భావిస్తున్నారు. ఇలాంటి సమస్యలు లేకుండా.. ఐదేళ్లకోసారి కేంద్ర రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలనేది ఆయన ఆలోచన.

జమిలీ ఎన్నికల నిర్వహణ గురించి గతంలోనూ అనేక కమిటీలు సిఫార్సు చేశాయి. 2015లో ఏర్పాటైన ఈఎం నచియప్పన్ కమిటీ  జమిలీ ఎన్నికలకు సిఫార్స్ చేసింది. 2018లో లా కమిషన్ కూడా  ఒక ఏడాదిలోనే అన్ని ఎన్నికలు పూర్తి చేయాలనే సూచన చేసింది. ఒక దేశం- ఒక ఎన్నిక అనే ప్రతిపాదనను కాంగ్రెస్‌తో పాటు అనేక పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.

మొత్తానికి జమిలీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రతిపక్షాలు సైతం ఒకింత ఆసక్తిగా ఉన్నాయి. ఎందుకంటే అధికారంలోకి రావడానికి ఇదొక మార్గం అంటున్నాయి. ఎపుడు జమిలీ ఎన్నికలు వచ్చినా తాము పోటీకి సై అంటున్నాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టి గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదిపేందుకు సిద్ధమయ్యాయి.





వామ్మో .... 'సలార్' కోసం ప్రభాస్ అంత పెద్ద సాహసం  .....??

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?

తెరాస ఎంపీకి కేంద్ర మంత్రి పదవి ఆఫర్...!

రేవంత్ రెడ్డికి పదవి ఇస్తే కాంగ్రెస్ ఖాళీ

స్కై ఈజ్ ద లిమిట్ అంటున్న పవన్ కొత్త సినిమా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>