Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/electionse448d851-6c8c-44c4-9880-4f89456c5dc7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/electionse448d851-6c8c-44c4-9880-4f89456c5dc7-415x250-IndiaHerald.jpgదేశం జమిలి ఎన్నికలకు దేశం సిద్ధమవుతోంది. నిన్న, మొన్నటి వరకు జమిలి ఎన్నికలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు మాత్రమే మాట్లాడేవారు. ఈ మధ్యనే ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై మళ్లీ మాట్లాడారు. ఈ మధ్యనే దీనిపై మళ్లీ మోదీ మాట్లాడారు. అయితే ప్రధాని మాట్లాడిన కొన్ని రోజులకే సునీల్‌ అరోడా ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట ఎన్నికలు ఉండడం వల్ల ఎన్నికల కోడ్ ఉంటోందని, దానివల్ల అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని...elections;nithya new;sunil;delhi;bharatiya janata party;west bengal - kolkata;narendra modi;prime minister;parliment;assembly;interview;central government;party;narendraజమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!elections;nithya new;sunil;delhi;bharatiya janata party;west bengal - kolkata;narendra modi;prime minister;parliment;assembly;interview;central government;party;narendraMon, 21 Dec 2020 20:43:24 GMTన్యూఢిల్లీ: దేశం జమిలి ఎన్నికలకు దేశం సిద్ధమవుతోంది. నిన్న, మొన్నటి వరకు జమిలి ఎన్నికలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు మాత్రమే మాట్లాడేవారు. ఈ మధ్యనే ప్రధాని నరేంద్ర మోదీ  దీనిపై మళ్లీ మాట్లాడారు. ఈ మధ్యనే దీనిపై మళ్లీ మోదీ మాట్లాడారు. అయితే ప్రధాని మాట్లాడిన కొన్ని రోజులకే సునీల్‌ అరోడా ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట ఎన్నికలు ఉండడం వల్ల ఎన్నికల కోడ్ ఉంటోందని, దానివల్ల అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని మోదీ చెప్పుకొచ్చారు. ఎన్నికల ఖర్చు కూడా పెరుగుతోందని, అన్నింటికీ ఒకే ఓటర్ల జాబితా ఉండాలని ప్రధాని మోదీ కోరారు. అయితే ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోడా కూడా ఈ విషయంపై నోరువిప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధమేనని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా అన్నారు. ప్రస్తుతం ఈ విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. జమిలి ఎన్నికల గురించి దేశం మొత్తం మాట్లాడేలా చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తాము జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు పూర్తిగా సిద్ధమని ప్రకటించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే చట్టాలకు కొన్ని సవరణలు చేయాల్సి ఉందని, అయితే దీనిపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని, నిర్ణయాధికారం మొత్తం కేంద్రం, పార్లమెంట్ చేతిలో ఉందని చెప్పారు. ఒకవేళ కేంద్రం అలాంటి నిర్ణయం తీసుకుంటే తాము కచ్చితంగా సిద్ధమేనని అరోడా చెప్పారు.

ఇదిలా ఉంటే జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే దేశంలోని అనేక రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలను ముందుకు, వెనక్కి మార్చాల్సి ఉంటుంది. ఇప్పటికే దాదాపు 12 రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అయితే తమిళనాడు, బెంగాల్ వంటి అనేక పెద్ద రాష్ట్రాల్లో మాత్రం వేరు వేరు సమయాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే వీటన్నింటినీ మార్చడం సాధ్యమేనా అనే అనుమానమే ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో నెలకొంది. మరి దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మోతీలాల్ వోరా మృతి

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?

తెరాస ఎంపీకి కేంద్ర మంత్రి పదవి ఆఫర్...!

రేవంత్ రెడ్డికి పదవి ఇస్తే కాంగ్రెస్ ఖాళీ

స్కై ఈజ్ ద లిమిట్ అంటున్న పవన్ కొత్త సినిమా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>