ViralKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/we-have-the-drug-for-the-corona-virus-that-is-trading-in-europe6b53859b-cfb7-4f94-8b31-511dce39197a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/we-have-the-drug-for-the-corona-virus-that-is-trading-in-europe6b53859b-cfb7-4f94-8b31-511dce39197a-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా తో ప్రపంచం అతలాకుతలం అవుతుంది.ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో కేసులు నమోదు అవుతున్నాయి.ఇదిలా ఉండగా కరోనా వైరస్ కొత్త రూపం సంతరించుకొని మరో కొత్త వైరస్ కు జీవం పోసింది.ఈ కొత్త కరోనా వైరస్ యూరప్‌ దేశాలలో మరింత తీవ్రంగా విజృంభిస్తోంది. viral news;russia;minister;letter;europe countries;96;v;coronavirusయూరప్ ను వణికిస్తున్న కరోనా వైరస్ కు ..మందు మావద్ద వుంది..!!యూరప్ ను వణికిస్తున్న కరోనా వైరస్ కు ..మందు మావద్ద వుంది..!!viral news;russia;minister;letter;europe countries;96;v;coronavirusMon, 21 Dec 2020 21:00:00 GMT ప్రస్తుతం కరోనా తో ప్రపంచం అతలాకుతలం అవుతుంది.ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో కేసులు నమోదు అవుతున్నాయి.ఇదిలా ఉండగా కరోనా వైరస్ కొత్త రూపం సంతరించుకొని మరో కొత్త వైరస్ కు జీవం పోసింది.ఈ కొత్త కరోనా వైరస్ యూరప్‌ దేశాలలో మరింత తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ వైరస్‌ కొత్త రూపం ప్రస్తుతం ఉన్న కోవిడ్ వైరస్ కంటే 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందంటూ యూరప్ ధేశాలు చెబుతున్నాయి. బ్రిటన్‌ ప్రభుత్వం ఆదివారం నుంచి కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. ఈ వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వచ్చే వరకు, కొన్ని నెలలపాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆ దేశ ఆరోగ్య మంత్రి ప్రకటించారు.

ఇదిలా ఉండగా ఈ కొత్త రకం కరోనా వైరస్ కు మందు తమ వద్ద ఉంది అంటూ రష్యన్ సైంటిస్టులు ప్రకటించారు.  తాము అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ఈ కొత్తరకం కరోనా వైరస్ ను ఎదుర్కొనగలదని (ఆర్‌డీఐఎఫ్) సీఈవో కిరిల్ డిమిట్రీవ్ ధీమా వ్యక్తం చేశారు. తమకున్న సమాచారం ప్రకారం యూరప్‌లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా స్ట్రైన్‌పై స్పుత్నిక్‌-వి ప్రభావంతంగా పనిచేస్తుందని చెప్పారు.కొవిడ్-19 కొత్త మ్యుటేషన్ స్ట్రైన్‌ను ఎదుర్కొనేందుకు ఆస్ట్రాజెనెకాతోపాటు మరో వ్యాక్సిన్ తయారీ కంపెనీతో కలిసి పనిచేస్తున్నట్టు డిమిట్రీవ్ పేర్కొన్నారు.

 స్పుత్నిక్-వి టీకా 95 శాతానికి పైగా ప్రభావంతంగా పనిచేస్తున్నట్టు గత వారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఈ టీకా 96-97 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని ఆరోగ్య నిపుణులను కూడా దృవీకరిస్తున్నారని రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా పేర్కొంది. ఆగస్టు 11న స్పుత్నిక్-వి టీకాను రష్యా రిజిస్టర్ చేసింది. ఫలితంగా కరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్ చేసిన ప్రపంచంలోనే తొలి దేశంగా రష్యా రికార్డులకెక్కింది.మరి ఈ టీకా ప్రపంచ దేశాలకు ఎప్పుడు సరఫరా అవుతుందో చూడాలి.


ఇంతకీ పవన్ .... ఆ సినిమాలు ఎందుకు ప్రక్కన పెట్టినట్టు .....??

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?

తెరాస ఎంపీకి కేంద్ర మంత్రి పదవి ఆఫర్...!

రేవంత్ రెడ్డికి పదవి ఇస్తే కాంగ్రెస్ ఖాళీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>