PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-jaganmohan-reddy-clapps-valenteers-96f2ccac-8c38-449b-bf1d-209442c2ad92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-jaganmohan-reddy-clapps-valenteers-96f2ccac-8c38-449b-bf1d-209442c2ad92-415x250-IndiaHerald.jpgవైఎస్ జగన్ ఏడాది పాలనలో సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నది వాలంటీర్ వ్యవస్థ. గ్రామ సచివాలయం. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్‌లను నియమించి ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకు తీసుకురాగలిగింది. ఈ వాలంటీర్ల సహాయంతో వృద్ధాప్య పెన్షన్లను రికార్డు స్థాయిలో లబ్ధిదారుల కాళ్ల దగ్గరకు ఒకటవ తేదీనే తీసుకురాగలిగారు. cm jagan;modi;jagan;andhra pradesh;narendra modi;government;prime minister;chief minister;central government;ycp;narendraవాలంటీర్లు కాదు, వారియర్స్! జయహో సచివాలయ సిస్టమ్వాలంటీర్లు కాదు, వారియర్స్! జయహో సచివాలయ సిస్టమ్cm jagan;modi;jagan;andhra pradesh;narendra modi;government;prime minister;chief minister;central government;ycp;narendraMon, 21 Dec 2020 09:20:37 GMTజగన్ ఏడాది పాలనలో సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నది వాలంటీర్ వ్యవస్థ. గ్రామ సచివాలయం. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్‌లను నియమించి ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకు తీసుకురాగలిగింది. ఈ వాలంటీర్ల సహాయంతో వృద్ధాప్య పెన్షన్లను రికార్డు స్థాయిలో లబ్ధిదారుల కాళ్ల దగ్గరకు ఒకటవ తేదీనే తీసుకురాగలిగారు. అంతకుమించి ప్రస్తుత కరోనా సంక్షోభంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలకు సైతం ఈ వాలంటీర్ వ్యవస్థ తోడ్పడుతోంది. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ ఉండటంతో… ఇంటింటిని జల్లెడ పట్టి వైరస్ సోకిన బాధితులను గుర్తించడానికి ప్రభుత్వానికి మార్గం సులువైంది. ఏ ఇంటికైనా బయట్నించి ఎవరైనా వచ్చారా ? లేదా ఏ ఇంట్లోనైనా కరోనా లక్షణాలున్న వ్యక్తి ఉన్నారా అనేది తెలుసుకోవడం ఏపీ ప్రభుత్వానికి చాలా సులభమైంది.
 
     మహాత్మగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్‌లో సాకారమైంది. సచివాలయ వ్యవస్థ దిగ్విజయంగా పని చేస్తోంది. ప్రభుత్వంతో ఏ పని ఉన్నా ఇంటి ముంగిట వచ్చి వాలే గ్రామ వలంటీర్లు సచివాలయ ఉద్యోగుల సహకారంతో అద్భుతంగా పనిచేస్తున్నారు.ముఖ్యమంత్రి జగన్‌ ఆలోచనల మేరకు రాష్ట్రంలో ఏడాది కిత్రం ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఇప్పుడు ఐఏఎస్‌ల శిక్షణలో ఒక పాఠ్యాంశం అయ్యేంతగా ప్రాచుర్యం పొందింది. ఈ వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోడీ సైతం కొనియాడారు. కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ కూడా అభినందించారు.  

వాలంటీర్లు కాదు, వారియర్స్ అంటూ  అభినందించారు జగన్. ప్రభుత్వ ఆకాంక్షల మేరకు ప్రజలకు వలంటీర్లు అద్భుతమైన సేవలందిస్తున్నారని కొనియాడారు. గ్రామ, సచివాలయాల్లో లాభాపేక్ష లేకుండా వాలంటీర్లు సేవలు చేస్తున్నారని సీఎం జగన్ అభినందించారు. ఇంటింటికి ప్రభుత్వ పథకాలు, గ్రామగ్రామానికి ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. వలంటీర్ల మెరుగైన పనితీరును చూసి గర్విస్తున్నానన్నారు జగన్.
 
ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఒకటో తేదీనే సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటికే వృద్ధులకి పెన్షన్‌ అందించగలుగుతున్నామని వైసీపీ నేతలు తెలిపారు. సచివాలయ వ్యవస్థ దేశంలోని ఇతర రాష్ట్రాలకి ఆదర్శమైంద్నారు. తన స్వచ్ఛమైన పరిపాలనతో సీఎం వైఎస్‌ జగన్‌ దేశంలో టాప్‌ ఫైవ్‌లో నిలిచారని కొనియాడారు. ప్రజల సంక్షేమానికి ఇంతటి మంచి వ్యవస్థ ప్రారంభించినందుకు సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు వైసీపీ నేతలు. గతంలో చాలా మంది ప్రజల వద్దకే పాలనంటూ ప్రగల్భాలు పలికి విఫలమయ్యారని గుర్తు చేశారు. కరోనా సమయంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో వాలంటీర్లు, ఉద్యోగులు పనితీరుపై ప్రధాని ప్రశంసలు సైతం దక్కాయని వైసీపీ నేతలు చెప్పారు.




పవన్-రానా రీమేక్.. నేడే ముహూర్తం

మళ్లీ జనంలోకి జనసేనాని.. వాళ్ళ గుండెల్లో రైళ్లు!

హెరాల్డ్ సెటైర్ : జగన్ అంటే ఏమిటో ఎల్లోమీడియాకు ఇపుడు తెలిసొచ్చిందా ?

సీఎం జగన్ తో పాటు బర్త్ డే జరుపుకొంటున్న ఫేమస్ వ్యక్తులు వీళ్ళే!

అమిత్ షా స్పీచ్ లో తప్పులు.. టీఎంసీ ఫైర్!

‘సాహో’ మిస్టేక్ రిపీట్ అవుతుందా?.. ప్రభాస్ ఫ్యాన్స్ భయం!

అన్న ఇండియాను ముంచితే తమ్ముడు అమెరికానే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>