MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/srinuvaitla96c15568-39fc-462e-b1d5-ace9bbec904f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/srinuvaitla96c15568-39fc-462e-b1d5-ace9bbec904f-415x250-IndiaHerald.jpgవరుస ఫ్లాప్ లతో సతమతమవుతన్న శ్రీనువైట్ల చాల గ్యాప్ తర్వాత తన కొత్త సినిమా ని అనౌన్స్ చేశాడు.. మంచు విష్ణు హీరో గా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఢీ సినిమా కి కొనసాగింపుగా ఢీ & ఢీ అనే సినిమా ని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.. సరిగ్గా 13 సంవత్సరాలక్రితం వీరి కాంబో వచ్చిన ఢీ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. మళ్ళీ ఈ సినిమా ని టచ్ చేయడం గొప్ప విశేషం అని చెప్పాలి.. srinuvaitla;venkatesh;amar;srinu vytla;vishnu;cinema;comedy;hero;yuva;misterశ్రీను వైట్ల కి ఈ ఇయర్ అయినా కలిసొచ్చేనా..?శ్రీను వైట్ల కి ఈ ఇయర్ అయినా కలిసొచ్చేనా..?srinuvaitla;venkatesh;amar;srinu vytla;vishnu;cinema;comedy;hero;yuva;misterMon, 21 Dec 2020 23:58:39 GMTసినిమా ని అనౌన్స్ చేశాడు.. మంచు విష్ణు హీరో గా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఢీ సినిమా కి కొనసాగింపుగా ఢీ & ఢీ అనే సినిమా ని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.. సరిగ్గా 13 సంవత్సరాలక్రితం వీరి కాంబో వచ్చిన ఢీ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. మళ్ళీ ఈ సినిమా ని టచ్ చేయడం గొప్ప విశేషం అని చెప్పాలి..

గత కొన్ని సినిమా లుగా శ్రీనువైట్ల సినిమాలు అన్ని ఫ్లాప్ లుగా నిలిచాయి. శ్రీనువైట్ల విజయాలకు ఆగడు సినిమా బ్రేక్ వేసింది.. ఆ తర్వాత అయన చేసిన సినిమాలు ఒక్కటి కూడా హిట్ కాలేదు.. బ్రుస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంథోనీ సినిమాలు అట్టర్ ఫ్లాప్ లుగా మిగిలాయి.. దాంతో చాల గ్యాప్ తీసుకుని మరీ ఈ సినిమా చేస్తున్నాడు.. అటు విష్ణు గ్రాఫ్ కూడా ఏమంత బాగాలేదు. విష్ణుకి 2016లో వచ్చిన ఆడో రకం ఈడో రకం ఆఖరి హిట్టు. ఆ తర్వాత అంతకు ముందు చాలా ఫ్లాపులు పలకరించాయి.  దాంతో ఈ ఇద్దరు ఢీ & ఢీ పైనే హోప్స్ పెట్టుకున్నారు.

ఒకానొక టైం లో శ్రీను వైట్ల పేరు వినగానే ఆయన సినిమాల్లోని కామెడీ ఎపిసోడ్స్  ప్రేక్షకులకు గుర్తొస్తాయి. అవి థియేటర్లో నవ్వులు పూయించడమే కాదు అప్పుడప్పుడు గుర్తుకొచ్చి మరీ నవ్విస్తుంటాయి. అందుకు ఉదాహరణగా 'ఆనందం' .. 'వెంకీ' .. 'ఢీ' .. 'రెఢీ' .. 'నమో వెంకటేశ' .. 'దూకుడు' సినిమాలు కనిపిస్తాయి. ఈ సినిమాలు టీవీల్లో ఎన్ని మార్లు ప్రసారమైన మంచి రేటింగ్ రావడానికి కారణం శ్రీను వైట్లకి కామెడీ పై గల పట్టు. కెరియర్ ను ఆరంభించిన చాలా తక్కువ సమయంలోనే ఆయన తనదైన మార్క్ చూపిస్తూ సీనియర్ స్టార్ హీరోలతోను .. యువ కథానాయకులతోను హిట్లు అందుకున్నాడు. మరి ఇదే తరహా వినోదం ఇప్పుడు చేయబోయే సినిమాలో చూపించి మంచి హిట్ కొడతాడా చూడాలి.


గ్రేటర్ విశాఖ ఎన్నికలు: వైసీపీ గెలుపు సులువేనా?

కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>