PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/janasenatho-ycp-potthuku-prayathnamf2ee134a-110e-45ed-b9e3-b25b0aedde80-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/janasenatho-ycp-potthuku-prayathnamf2ee134a-110e-45ed-b9e3-b25b0aedde80-415x250-IndiaHerald.jpgఅసెంబ్లీలో చెప్పిన నివర్ నష్టాలకు.. క్యాబినెట్ లెక్కలకీ పొంతన లేదు అని జనసేన పిఎసి కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. 4 లక్షల ఎకరాలు నష్టం తగ్గించి చూపారు అని ఆయన ఆరోపించారు. మద్యం ఆదాయం వదులుకోలేని ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వమా? అని ఆయన నిలదీశారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు పవన్ కల్యాణ్ గారు కోరిన పరిహారం హేతుబద్ధమైనదే అని ఆయన వివరించారు. రబీలో గోదావరి జిల్లాల రైతులకు నీటి కష్టాలు ప్రభుత్వ ప్రణాళిక లోపమే అని ఆయన మండిపడ్డారు. అధికారంలోకి వస్తే జగన్ రెడ్డి రైతు ప్రభుత్వాన్ని, సంక్షేnadendla;pawan;kalyan;pawan kalyan;prakruti;godavari river;jagan;nadendla manohar;janasena;government;cabinet;aqua;janasena party;reddy;mantraజగన్ ని టార్గెట్ చేసిన నాదెండ్లజగన్ ని టార్గెట్ చేసిన నాదెండ్లnadendla;pawan;kalyan;pawan kalyan;prakruti;godavari river;jagan;nadendla manohar;janasena;government;cabinet;aqua;janasena party;reddy;mantraMon, 21 Dec 2020 09:15:56 GMTక్యాబినెట్ లెక్కలకీ పొంతన లేదు అని జనసేన పిఎసి కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. 4 లక్షల ఎకరాలు నష్టం తగ్గించి చూపారు అని ఆయన ఆరోపించారు. మద్యం ఆదాయం వదులుకోలేని ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వమా? అని ఆయన నిలదీశారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు  పవన్ కల్యాణ్ గారు కోరిన పరిహారం హేతుబద్ధమైనదే అని ఆయన వివరించారు. రబీలో గోదావరి జిల్లాల రైతులకు నీటి కష్టాలు ప్రభుత్వ ప్రణాళిక లోపమే అని ఆయన మండిపడ్డారు.

అధికారంలోకి వస్తే జగన్ రెడ్డి రైతు ప్రభుత్వాన్ని,   సంక్షేమ పాలనను అందిస్తామన్నారు అని ఆయన పేర్కొన్నారు.  ఇవాళ హెలికాప్టర్ పర్యటనలకే పరిమితమవ్వడం విడ్డూరంగా ఉంది అని ఎద్దేవా చేసారు. రైతాంగం పడుతున్న బాధలు, వారి ఆవేదన తెలియాలంటే క్షేత్రస్థాయిలో పర్యటించాలి అని డిమాండ్ చేసారు. నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతాంగంలో భరోసా నింపాలన్న ఆలోచనే ప్రభుత్వంలో లేదు  అని ఆయన మండిపడ్డారు.  మంత్రులు కాకిలెక్కలు చెబుతూ ప్రజలు, రైతులను మభ్యపెడుతున్నారు అని ఆరోపించారు.

 శాసనసభలో  నివర్ తుపాన్ వల్ల 17 లక్షల 32 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రకటించారు అని ఆయన వివరించారు. వారం తిరగక ముందే నిన్న జరిగిన కేబినేట్ భేటీలో మంత్రులు లెక్కలను సవరించి ఆ నష్టాన్ని 13 లక్షలకు తగ్గించారు అని మండిపడ్డారు. దాదాపు 4 లక్షల ఎకరాలను నష్టపోయిన జాబితా నుంచి ప్రభుత్వం తప్పించి, వేలాదిమంది రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు అని ఆరోపించారు. నివర్ తుపాన్, ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులను, కౌలు రైతులను ఆదుకోవాలి అని డిమాండ్ చేసారు.  ఈ నెల 28న అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందిస్తాం అని అన్నారు. రైతులు, రైతు సంఘాలు, జనసైనికులతో పాటు పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అని చెప్పారు.


పవన్-రానా రీమేక్.. నేడే ముహూర్తం

మళ్లీ జనంలోకి జనసేనాని.. వాళ్ళ గుండెల్లో రైళ్లు!

హెరాల్డ్ సెటైర్ : జగన్ అంటే ఏమిటో ఎల్లోమీడియాకు ఇపుడు తెలిసొచ్చిందా ?

సీఎం జగన్ తో పాటు బర్త్ డే జరుపుకొంటున్న ఫేమస్ వ్యక్తులు వీళ్ళే!

అమిత్ షా స్పీచ్ లో తప్పులు.. టీఎంసీ ఫైర్!

‘సాహో’ మిస్టేక్ రిపీట్ అవుతుందా?.. ప్రభాస్ ఫ్యాన్స్ భయం!

అన్న ఇండియాను ముంచితే తమ్ముడు అమెరికానే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>