BeautyNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/beauty/sagittarius_sagittarius/clear-skin-vitamin-a432628dd-dc48-4c63-b32a-ed6c828cb8cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/beauty/sagittarius_sagittarius/clear-skin-vitamin-a432628dd-dc48-4c63-b32a-ed6c828cb8cb-415x250-IndiaHerald.jpgమనం డైట్ ను ప్లాన్ చేసేటప్పుడు సాధారణంగా శరీరం యొక్క హెల్త్ నే దృష్టిలో పెట్టుకుంటాం. స్కిన్ హెల్త్ ను మాత్రం పట్టించుకోము. మన స్కిన్ హెల్త్ పై మనం తినే ఆహారం ప్రభావం చూపుతుందన్న విషయాన్ని మనమెప్పుడూ గుర్తుంచుకోవాలి. స్కిన్ పై పూసే ఆయింట్మెంట్స్ కంటే మన డైట్ అనేది అత్యంత ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి, స్కిన్ హెల్త్ ను సంరక్షించే పోషకాలని ముఖ్యంగా విటమిన్స్ ని మనం స్కిన్ కేర్ కోసం డైట్ లో తీసుకోవాలి. విటమిన్ ఏ సరిగ్గా అటువంటి స్కిన్ కేర్ విటమిన్ అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఇది స్కిన్ కclear skin,vitamin a;health;soundarya;pasta;vitamin a;vitamin;vegetable market;spinachవిటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ తో క్లియర్ స్కిన్ లభిస్తుందా...?విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ తో క్లియర్ స్కిన్ లభిస్తుందా...?clear skin,vitamin a;health;soundarya;pasta;vitamin a;vitamin;vegetable market;spinachMon, 21 Dec 2020 22:06:00 GMT హెల్త్ నే దృష్టిలో పెట్టుకుంటాం. స్కిన్  హెల్త్ ను మాత్రం పట్టించుకోము. మన స్కిన్ హెల్త్ పై మనం తినే ఆహారం ప్రభావం చూపుతుందన్న విషయాన్ని మనమెప్పుడూ గుర్తుంచుకోవాలి. స్కిన్ పై పూసే ఆయింట్మెంట్స్ కంటే మన డైట్ అనేది అత్యంత ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి, స్కిన్ హెల్త్ ను సంరక్షించే పోషకాలని ముఖ్యంగా విటమిన్స్ ని మనం స్కిన్ కేర్ కోసం డైట్ లో తీసుకోవాలి. విటమిన్ ఏ సరిగ్గా అటువంటి స్కిన్ కేర్ విటమిన్ అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఇది స్కిన్ కు తగినంత పోషణను ఇస్తుంది.

విటమిన్ ఏలో బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కొలాజిన్ ను బ్రేక్ చేసేటటువంటి ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. దాంతో ప్రీమెచ్యూర్ సైన్స్ వంటి సమస్యల బారిన పడే రిస్క్ తగ్గుతుంది. అంతేకాదు, విటమిన్ ఏ అనేది హానికర సూర్యకిరణాల నుంచి స్కిన్ కు ప్రొటెక్షన్ ను అందిస్తుంది.

విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం:

1. టమాటోలు: 
అదృష్టవశాత్తు, చాలామంది టమాటోలను విరివిగా వాడటం జరుగుతోంది. స్కిన్ కేర్ కు తోడ్పడే ఈ టమాటోలలో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది.

2. క్యారట్స్:
క్యారట్స్ కూడా మార్కెట్ లో విరివిగా అందుబాటులో ఉంటాయి. ఇవి కూడా స్కిన్ హెల్త్ కు ఎంతో ఉపయోగపడతాయి.

3. ఆకుకూరలు:
పాలకూర అలాగే మెంతి కూరలో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. వీటిని రెగ్యులర్ డైట్ లో భాగంగా చేసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తాయి. అలాగే, క్లియర్ స్కిన్ లభిస్తుంది.

4. గుడ్డు పచ్చసొన:
ఇందులో విటమిన్ డి తో పాటు విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. ఇది స్కిన్ కు ఎంతో మంచి చేస్తుంది. వీటిని మితంగా తీసుకుంటే ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం కూడా లభిస్తుంది.

5. గుమ్మడికాయ:
గుమ్మడికాయలో ఒకరకమైన కెరోటినాయిడ్ లభిస్తుంది. ఇది శరీరం చేత విటమిన్ ఏ గా కన్వర్ట్ చేయబడుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం, వంద గ్రాముల గుమ్మడికాయలో దాదాపు 2100 మైక్రోగ్రాముల విటమిన్ ఏ లభ్యమవుతుంది.
 
6. బ్రొకోలీ:
ఈ క్రూసిఫెరస్ వెజిటబుల్ లో వివిధ విటమిన్లతో పాటు మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా, విటమిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది. సలాడ్, పాస్తా అలాగే కర్రీస్ లో దీన్ని జోడించడం ద్వారా క్లియర్ స్కిన్ ను  పొందవచ్చు. 


ఉదయకిరణ్ ఆలా చేస్తాడని ఉహించలేదు షాకింగ్ నిజాలు చెప్పిన వియన్ ఆదిత్య

కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>