MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi8db3763e-99ca-4867-9491-6a6e63fee432-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi8db3763e-99ca-4867-9491-6a6e63fee432-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లోని కంటెస్టెంట్స్ మిగతా సీజన్స్ లోని కంటెస్టెంట్స్ కంటే తాము ప్రత్యేకమని నిరూపించుకున్నారు. తమదైన స్టయిల్ లో ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేశారు. అలాగే, ఎటువంటి నెగటివిటీను మూటగట్టుకోలేదు. ఎలిమినేటైనా సరే "అయ్యో, వీరు కూడా హౌస్ లో కంటిన్యూ ఐతే బాగుండేది కదా.." అని ఆడియెన్స్ ఫీలయ్యేలా వీళ్ళ పెర్ఫామెన్స్ ఉండేది. chiranjeevi;chiranjeevi;surekha vani;bigboss;press;wife;house;mass;fidaa;rekha vedavyasఆ డైలాగ్ కోసం సోహెల్ పెర్మిషన్ తీసుకున్న చిరుఆ డైలాగ్ కోసం సోహెల్ పెర్మిషన్ తీసుకున్న చిరుchiranjeevi;chiranjeevi;surekha vani;bigboss;press;wife;house;mass;fidaa;rekha vedavyasMon, 21 Dec 2020 11:39:29 GMTబిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లోని కంటెస్టెంట్స్ మిగతా సీజన్స్ లోని కంటెస్టెంట్స్ కంటే తాము ప్రత్యేకమని నిరూపించుకున్నారు. తమదైన స్టయిల్ లో ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేశారు. అలాగే, ఎటువంటి నెగటివిటీను మూటగట్టుకోలేదు. ఎలిమినేటైనా సరే "అయ్యో, వీరు కూడా హౌస్ లో కంటిన్యూ ఐతే బాగుండేది కదా.." అని ఆడియెన్స్ ఫీలయ్యేలా వీళ్ళ పెర్ఫామెన్స్ ఉండేది.

ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టాప్ 5 లో ఉన్నవారందరూ విజేతలేనని ఆడియెన్స్ ఫిక్సయిపోయారు. "కథ వేరుంటది, కథ వేరుంటది" అని హౌస్ లో సందడి చేసిన సోహెల్ బిగ్ బాస్ అందించిన అక్షరాలా 25 లక్షల అఫర్ ను చేజిక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచి "ఇదే కథ" అని క్లారిటీ ఇచ్చాడు.  

తన మాస్ మ్యానరిజంతో జనాలను ఆకట్టుకున్న సోహెల్ చిరుని కూడా ఫిదా చేసేసాడు. మెగాస్టార్ చిరంజీవి ఈ మ్యానరిజాన్ని తన సినిమాలో ఉపయోగించుకుంటానంటూ బిగ్ బాస్ అభిమానుల సాక్షిగా సోహెల్ పర్మిషన్ తీసుకున్నాడు.

మెగాస్టార్ మూవీస్ ను గనక మనం గమనిస్తే కచ్చితంగా ఓ డైలాగ్ ను మెగాస్టార్ తన మాస్ ఆడియెన్స్ కోసం ఉపయోగించడాన్ని గమనించవచ్చు. "చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో, ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్న్ ఇచ్చుకో, బాక్స్ బద్దలైపోద్ధి" అంటూ మెగాస్టార్ తన మ్యానరిజంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు.

ఇప్పుడు మెగాస్టార్ కు ఓ మాస్ డైలాగ్ ను సోహెల్ అందించాడని అంటున్నారు విశ్లేషకులు. "కథ వేరుంటదీ" అనే ఈ డైలాగ్ మెగాస్టార్ నే ఇంప్రెస్ చేసేసింది. మొత్తానికి మెగాస్టార్ సోహెల్ దగ్గర ఈ డైలాగ్ ను వాడేందుకు పెర్మిషన్ తీసుకోవడం మాత్రం ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసేసింది.

మొత్తానికి, ఈ డైలాగ్ ను మెగాస్టార్ నోట విన్నప్పుడు సోహెల్ కళ్ళల్లో ఆనందాన్ని స్పష్టంగా గమనించవచ్చు. సోహెల్ కోసం మెగాస్టార్ తన భార్య సురేఖ వండిన బిర్యానీని తీసుకొచ్చిన విషయం కూడా అభిమానులను ఆకట్టుకుంది. 


2020 అనుభవాలను పంచుకున్న పూజా హెగ్డే

వణికిస్తున్న చలి... కరోనా భయం

కేరళ అప్డేట్ : తాజాగా మరో ఆరుగురిలో షింగెల్లా బ్యాక్టీరియా

నన్ను తన్నేందుకు చిరు ఒప్పకోలేదు : సోనుసూద్ ఆసక్తికర కామెంట్స్

జగన్ కు తెలంగాణా ఎంపీ చిన్న కండీషన్

తిరుపతిలో ఎలాగైనా గెలవాలని టీడీపీ ప్లాన్.. ఆయనను కూడా దింపేసిందిగా!

వైసీపీ నాయకులలో ఉత్సాహానికి కారణం అదేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>