PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/teachers-proteste82794ba-4184-4024-8468-fdaf89083dcd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/teachers-proteste82794ba-4184-4024-8468-fdaf89083dcd-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఆందోళన ఉధృతం చేస్తున్నారు టీచర్లు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 29న మహా ధర్నాకు పిలుపినిచ్చింది ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి జాక్టో, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీస్టీరింగ్ కమిటీ.ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర జరిగే ధర్నాలో వేలాది మంది ఉపాధ్యాయులు పాల్గొనబోతున్నారని ప్రకటించింది.teachers protest;mumtaz;mumtaj;venkat;yajamanya;hyderabad;indira gandhi;government;school;taj mahal;vemuri radhakrishna;maha;nayakఈనెల 29న ఉపాధ్యాయుల మహా ధర్నా!ఈనెల 29న ఉపాధ్యాయుల మహా ధర్నా!teachers protest;mumtaz;mumtaj;venkat;yajamanya;hyderabad;indira gandhi;government;school;taj mahal;vemuri radhakrishna;maha;nayakMon, 21 Dec 2020 19:42:56 GMTమహా ధర్నాకు పిలుపునిచ్చింది ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి  జాక్టో,  ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీస్టీరింగ్ కమిటీ.ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర జరిగే ధర్నాలో వేలాది మంది
ఉపాధ్యాయులు పాల్గొనబోతున్నారని ప్రకటించింది.

తమ పెండింగ్ సమస్యల పరిష్కారంతో పాటు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని కోరుతూ గత నెల రోజుల నుండి ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు. అయినా రాష్ట్ర విద్యాశాఖ స్పందించకపోవడంతో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని టీచర్లు నియమించారు. సమస్యల పరిష్కారంపై ఏమాత్రం చలనం లేదని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈనెల 29న హైదరాబాద్ ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహించనున్నట్లు జాక్టో,  ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీస్టీరింగ్ కమిటీ తెలిపింది.జాక్టో, యుయస్పీసీ స్టీరింగ్ కమిటీ సమావేశం సోమవారం సమావేశమై ఇప్పటి వరకు జరిగిన రెండు దశల పోరాట కార్యక్రమాలను సమీక్షించారు.

ఆర్థిక భారం లేనటువంటి ఆరేళ్ళుగా నిలిచిపోయిన పదోన్నతులు, బదిలీల పై కూడా ప్రభుత్వం నుండి ఏమాత్రం స్పందన లేనందున ఉపాధ్యాయుల ఐక్య పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని సమావేశం నిర్ణయించింది.ఖాళీగా ఉన్న హైస్కూల్ హెచ్చెం, స్కూల్ అసిస్టెంట్స్ తోపాటు అప్గ్రేడెడ్ పండిట్ పిఈటి పోస్టులకు యాజమాన్యం వారీ, పాత పది జిల్లాల ప్రాతిపదికన పదోన్నతులు కల్పించాలని, అంతర్జిల్లా, సాధారణ బదిలీలు నిర్వహించాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, పదోన్నతుల అనంతరం విద్యాశాఖ లో ఏర్పడే ఖాళీలన్నింటిలో నూతన ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని సమావేశం డిమాండ్ చేసింది.ఈ సమావేశంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు జి సదానందంగౌడ్, కె జంగయ్య, మైస శ్రీనివాసులు, ఎం రాధాకృష్ణ, టి లింగారెడ్డి, విజయసాగర్, బి. కొండయ్య, డివి రావు, యాదగిరి, ముంతాజ్, వెంకట్ నాయక్ తదితరులు పాల్గొన్నారు


ఇంతకీ పవన్ .... ఆ సినిమాలు ఎందుకు ప్రక్కన పెట్టినట్టు .....??

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?

తెరాస ఎంపీకి కేంద్ర మంత్రి పదవి ఆఫర్...!

రేవంత్ రెడ్డికి పదవి ఇస్తే కాంగ్రెస్ ఖాళీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>