Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/shami1347d636-51ea-4a07-95cf-b9d15a0f5454-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/shami1347d636-51ea-4a07-95cf-b9d15a0f5454-415x250-IndiaHerald.jpgప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ. ఆటగాళ్లకు కోట్లలో జీతాలు. లగ్జరీ లైఫ్. కానీ నిన్న ఆసీస్‌తో జరిగిన డే అండ్ నైట్ టెస్ట్‌లో భారత స్టార్ బౌలర్ ఓ చిరిగిన షూతో బౌలింగ్ చేయడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. ‘ఇదేంటి..? అంతర్జాతీయ క్రికెటర్..shami;cricket;india;australia;bcci;international;adelaide;kali;paruguచిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!shami;cricket;india;australia;bcci;international;adelaide;kali;paruguSun, 20 Dec 2020 08:46:00 GMTక్రికెట్ బోర్డు బీసీసీఐ. ఆటగాళ్లకు కోట్లలో జీతాలు. లగ్జరీ లైఫ్. కానీ నిన్న ఆసీస్‌తో జరిగిన డే అండ్ నైట్ టెస్ట్‌లో భారత స్టార్ బౌలర్ ఓ చిరిగిన షూతో బౌలింగ్ చేయడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. ‘ఇదేంటి..? అంతర్జాతీయ క్రికెటర్ చిరిగిన షూస్ వేసుకోవడం ఏంటని అంతా షాక్ అయ్యారు. ’ అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

తొలి టెస్టు రెండో రోజైన శుక్రవారం ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ నేపథ్యంలో స్టార్ బౌలర్ మహ్మద్ షమి రంథ్రం పడిన షూ వేసుకుని మ్యాచ్ ఆడాడు. అతడి ఏడమ షూ ముందు భాగంలో బొటన వేలు వద్ద పెద్ద రంధ్రం చేసి.. ఆ షూ ధరించి బౌలింగ్ చేశాడు. ఇప్పుడు ఈ షూకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

నిజానికి షమి వేసుకున్న షూస్ పాడైపోయినవి, లేదా పాతపడినవి కాదు. అవి బ్రాండ్ న్యూ షూస్. అంతేకాదు ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. షమి తన షూకు కావాలనే రంధ్రం చేశాడట. అతడి షూస్‌ను జాగ్రత్తగా చూస్తే ఈ విషయం మనకు కూడా అర్థమవుతుంది. కావాలనే షూ ముందుభాగాన్ని కత్తితో కోసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. దీనిపై పలువురు క్రికెట్ నిపుణులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ దీనిపై మాట్లాడుతూ.. షమి తన బౌలింగ్ యాక్షన్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ విధంగా చేసి ఉంటాడని అంటున్నాడు. ‘షమి హై ఆర్మ్ యాక్షన్‌లో బౌలింగ్ చేస్తాడు. అలా చేసేటప్పుడు అతడి ఎడమ కాలుపై ఎక్కువ ప్రెజర్ పడుతుంది. ఆ సమయంలో షూస్‌లో బొటన వేలుకు మరింత స్పేస్ ఇవ్వడం కోసమే షమి అలా షూకు రంధ్రం చేసి ఉంటాడు’ అంటూ వార్న్ అభిప్రాయపడ్డాడు.

షమి నిర్ణయంపై కొందరు నెటిజన్లు వ్యతిరేకత కూడా వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్‌లో బంతి చాలా బలంగా ఉంటుందని, అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటేనే ప్రాణాలు కూడా పోతున్నాయని, అలాంటిది.. సున్నితమైన కాలి వేళ్లను ఇలా కవర్ చేయకుండా వదిలేయడం నిబంధనలకు విరుద్ధమేనని అభిప్రాయడుతున్నారు. ఒకవేళ ఆ వేలికి బంతి తగిలితే తీవ్రమైన గాయంగా మారుతుందని, అప్పుడు బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో భారత్ ఘోరంగా ఓడిపోయింది. ప్రధానంగా రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే కుప్పకూలి అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది.


పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?

గ్రేటర్ లో తెరాస ఓటమికి కొన్ని కారణాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>