Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akkineni-akhil-letest-movie-updates-03a5a40d-811d-468a-ae8d-338ef011c006-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akkineni-akhil-letest-movie-updates-03a5a40d-811d-468a-ae8d-338ef011c006-415x250-IndiaHerald.jpgఅఖిల్ అక్కినేని యూత్ నుంచి మాంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక మునుపే ఇంత క్రేజ్ ను పొందిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఈ అక్కినేని వారసుడనే చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీలోకి అక్కినేని వారసుడిగా అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మొదటి సినిమాతోనే భారీ హిట్ ను కొట్టి తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆశించాడు ఈ యువ హీరో. కాని అనుకున్నవన్నీ నిజం కాదుకదా.. అందుకే ఈ హీరో మొదటి సినిమాతోనే అట్టర్ ప్లాఫ్ ను తన ఖాతాలో వేసుకుని తన అభిమానుల ఆశలను అడియాశలను చేశాడు. సూakhil;beauty;kumaar;pooja hegde;vikram k kumar;vikram kumar;akhil akkineni;nageshwara rao akkineni;vikram;cinema;love;hero;heroine;yuva;hero heroine;hello;mister2021 కూడా అఖిల్ కు కలిసి రాదా?2021 కూడా అఖిల్ కు కలిసి రాదా?akhil;beauty;kumaar;pooja hegde;vikram k kumar;vikram kumar;akhil akkineni;nageshwara rao akkineni;vikram;cinema;love;hero;heroine;yuva;hero heroine;hello;misterSun, 20 Dec 2020 13:03:05 GMTఅఖిల్ అక్కినేని యూత్ నుంచి మాంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక మునుపే ఇంత క్రేజ్ ను పొందిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఈ అక్కినేని వారసుడనే చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీలోకి అక్కినేని వారసుడిగా అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మొదటి సినిమాతోనే భారీ హిట్ ను కొట్టి తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆశించాడు ఈ యువ హీరో. కాని అనుకున్నవన్నీ నిజం కాదుకదా.. అందుకే ఈ హీరో మొదటి సినిమాతోనే అట్టర్ ప్లాఫ్ ను తన ఖాతాలో వేసుకుని తన అభిమానుల ఆశలను అడియాశలను చేశాడు. సూపర్ డూపర్ గా నిలుస్తుందని ఆశించిన అఖిల్ మొదటి సినిమా ‘అఖిల్’ ప్రేక్షకుల ముందు నిలవలేకపోయింది. ఘన విజయం సాదిస్తుందని భావించిన ఈ సినిమా పట్ల అఖిల్ ఎంతో నిరాశచెందాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
మొదటిదే కదా లైట్ తీసుకుందాం.. బెటర్ లక్ నెక్ట్స్ టైం అంటూ మరో సరికొత్త కాన్సెప్ట్ లో రెండో సినిమా లో నటించాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ‘హలో’లో నటించాడు. ఈ సినిమానన్నా ప్రేక్షకుల ముందు నిలదొక్కుకుంటుదన్నకున్నారంతా. లవ్ స్టోరీతో తెరముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా యూత్ ను ఆకట్టుకోలేకపోయింది. హీరో హీరోయిన్ దూరంగా ఉండటం హీరోయిన్ కోసం ఎంతసేపు వెతకడమే పనిపెట్టుకున్న అఖిల్ పాత్రను ఆడియెన్స్ మెచ్చుకోలేదు. అందుకే మళ్లీ ఈ సినిమా కూడా ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. రెండో సినిమా కూడా ఫట్ మనడంతో ఇకనైనా కథల ఎంపికలో జాగ్రత్తలు వహించాలంటూ అఖిల్ ఆచీ తూచీ అడుగులు వేస్తున్నాడు.
 
అయితే ఈ రెండు సినిమాలు అట్టర్ ప్లాఫ్ గా నిలవడంతో జాగ్రత్తలు తీసుకుంటూ ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో నటించాడు. ఈ సినిమా కాన్సెప్ట్ అంతగా ఆకట్టుకోకపోవడంతో అఖిల్ మళ్లీ విజయాన్ని అందుకోలేక పోయాడు. దాంతో అఖిల్ ఈ సారి ఎలాగైనా విజయాన్ని సాదించాలంటూ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమా తీయడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు మొదటి నుంచే అడ్డంకులు ఏర్పడ్డాయి. సెట్స్ పైకి వెళ్లడానికి ఆలస్యం జరిగితే మరో వైపు కరోనా కారణంగా ఈ సినిమాకు మరింత బ్రేక్ పడింది. ఈ సినిమాలో అఖిల్ సరసన స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే నటించనుంది. ఈ సినిమాతో అఖిల్ ప్రేక్షకులను అలరించడానికి రానున్నాడు. అయితే ఇంతకు ముందులా సినిమా ప్లాఫ్ ల బాట పట్టకుండా ఈ సినిమా ఉండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సారైనా అఖిల్ కు విజయం అందాలని ఆశిస్తున్నారు అతని అభిమానులు. 


రవిశాస్త్రి వద్దు.. కోచ్ గా ఆయన్ను పెట్టండి..?

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని!

మోకాళ్లపై పవన్.. ఫ్యాన్స్ కోసం ఇలా చేసే హీరో పవర్ స్టార్ ఒక్కడే!

ఘోర ఓటమితో రవిశాస్త్రి, కోహ్లీలపై వేటు పడేనా..?

బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>