MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lakshmi-parvathi076531d1-88fb-4853-8123-576978bf72d6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lakshmi-parvathi076531d1-88fb-4853-8123-576978bf72d6-415x250-IndiaHerald.jpgనందమూరి తారకరామారావు గారి భార్యగా ల‌క్ష్మీపార్వ‌తి అందరికి సుపరిచితురాలే. ఎన్టీఆర్ భార్య అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఎన్టీఆర్ మొదట భార్య బసవతారకమ్మ స్వర్గస్తురాలయిన తరువాత లక్ష్మి పార్వతిని రామారావు గారు రెండవ వివాహం చేసుకున్నారు. lakshmi parvathi;ntr;lakshmi;parvathi;srinivas;telugu desam party;y. s. rajasekhara reddy;tollywood;cinema;telugu;heart;wife;lakshmi devi;tdp;nandamuri taraka rama rao;nijam;vemuri radhakrishna;reddy;partyసినీ రంగ ప్రవేశం చేస్తున్న లక్ష్మి పార్వతి..ఆమె ఎవరి పాత్రలో నటిస్తుందో తెలిస్తే గుండె గుబేల్సినీ రంగ ప్రవేశం చేస్తున్న లక్ష్మి పార్వతి..ఆమె ఎవరి పాత్రలో నటిస్తుందో తెలిస్తే గుండె గుబేల్lakshmi parvathi;ntr;lakshmi;parvathi;srinivas;telugu desam party;y. s. rajasekhara reddy;tollywood;cinema;telugu;heart;wife;lakshmi devi;tdp;nandamuri taraka rama rao;nijam;vemuri radhakrishna;reddy;partySun, 20 Dec 2020 14:00:00 GMTనందమూరి తారకరామారావు గారి భార్యగా ల‌క్ష్మీపార్వ‌తి అందరికి సుపరిచితురాలే. ఎన్టీఆర్ భార్య అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఎన్టీఆర్ మొదట భార్య బసవతారకమ్మ స్వర్గస్తురాలయిన తరువాత లక్ష్మి పార్వతిని రామారావు గారు రెండవ వివాహం చేసుకున్నారు. ఎన్టీఆర్ చనిపోయిన త‌ర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత‌గా చంద్ర‌బాబు నాయుడు కొనసాగారు. తరువాత టీడీపీ పార్టీ తరుపున పోటీ చేసి  ముఖ్య‌మంత్రిగా అధికారంలోకి వచ్చారు.  త‌ర్వాత ల‌క్ష్మీ పార్వ‌తి అన్న తెలుగు దేశం పార్టీని స్థాపించినా గాని  రాజ‌కీయాల్లో స‌క్సెస్ కాలేక‌పోయారు. త‌ర్వాత సమయానుకూలంగా,  ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మారి  సైలెంట్‌గా ఉండిపోయారు. అయితే ఎప్పుడు అవకాశం వస్తుందా చంద్రబాబు నాయుడిని ఎప్పుడు విమర్శల పాలు చేద్దామా అని ఆలోచిస్తుంది. అందుకనే అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా చంద్ర‌బాబు నాయుడుని అప్పుడు, ఇప్పుడు  విమ‌ర్శిస్తూనే ఉన్నారు.


అయితే  గ‌త ఎన్నిక‌ల ముందు ల‌క్ష్మీ పార్వ‌తి చుట్టూ అప్ప‌ట్లో జ‌రిగిన రాజ‌కీయ పరిస్థితులను ఆధ‌రాంగా చేసుకుని మన టాలీవుడ్ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ల‌క్ష్మీ స్ ఎన్టీఆర్ అనే సినిమాను కూడా తెర‌కెక్కించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పోటీగా ఉన్న  వైఎస్ఆర్ పార్టీలో కొన‌సాగుతున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు కేవలం  రాజ‌కీయాల‌ వరకే  ప‌రిమిత‌మైన ల‌క్ష్మీ పార్వ‌తి ఇప్పుడు కొత్త మార్గన్ని ఎంచుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ మార్గం ఏంటా... అనుకుంటున్నారా.. మన రంగుల ప్రపంచంలోకి విహరించడానికి  మార్గం సుగమం చేసుకున్నట్లు వినికిడి. మన సినీ వ‌ర్గాల్లో వినిపిస్తున్న స‌మాచారం మేర‌కు లక్ష్మీ పార్వ‌తి ఇప్పుడు సినీ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారట.


ఏ నిర్మాత‌గానో, ద‌ర్శ‌కురాలిగానో కాదండోయ్. ఒక నటిగా,  క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటించబోతున్నారట.  ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు శ్రీనివాస్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రాధాకృష్ణ అనే సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ఈ సినిమాలో ముస్కాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ  సినిమాలోనే ల‌క్ష్మీ పార్వతి ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారని ఇండస్ట్రీస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇంకా ఈ వార్తకి సంబంధిచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ లక్ష్మి పార్వతి నిజంగానే సినిమాల్లో నటిస్తుంటే ఆమె పాత్ర ఇలా ఉంటుందో, ఎన్టీఆర్ భార్యగా ఆమె నటన ఎలా ఉంటుందో అనేది తెరపై చూడాలి.. !!


స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే ?

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని!

మోకాళ్లపై పవన్.. ఫ్యాన్స్ కోసం ఇలా చేసే హీరో పవర్ స్టార్ ఒక్కడే!

ఘోర ఓటమితో రవిశాస్త్రి, కోహ్లీలపై వేటు పడేనా..?

బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>