PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-tdpf6dcefec-c30c-4163-ad84-03dee33a7ca4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-tdpf6dcefec-c30c-4163-ad84-03dee33a7ca4-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో రాజకీయాలు అనూహ్యంగా మారిపోతాయా. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర సమయం మాత్రమే వైసీపీకి అయింది. ఇంతలోనే గేర్ మార్చేస్తారా. ఏపీలో ఇపుడు విపక్షంలో టీడీపీ ఉంది. బీజేపీ కూడా ముందుకు రావాలనుకుంటోంది. ఏపీలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ తాను బలంగా ఉన్నాను అని చెప్పుకోవాలనుకుంటోంది. ycp tdp;tiru;bharatiya janata party;telugu desam party;jagan;telugu;tirupati;cycle;husband;tdp;ycp;master;partyవైసీపీ నుంచి టీడీపీలోకి ?వైసీపీ నుంచి టీడీపీలోకి ?ycp tdp;tiru;bharatiya janata party;telugu desam party;jagan;telugu;tirupati;cycle;husband;tdp;ycp;master;partySun, 20 Dec 2020 22:00:00 GMTటీడీపీ ఉంది. బీజేపీ కూడా ముందుకు రావాలనుకుంటోంది. ఏపీలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ తాను బలంగా ఉన్నాను అని చెప్పుకోవాలనుకుంటోంది.

మరి దానికి ప్రాతిపదిక ఆధారం ఏది అన్న ప్రశ్న కనుక వస్తే మాత్రం ఫిరాయింపుల వైపు చూడడమే మార్గమని అంటున్నారు. ఏపీలో వైసీపీ బస్సు జనంతో ఫుల్ గా కిక్కిరిసి ఉంది. దాంతో వైసీపీ నుంచి ఎవరైనా అసంతృప్తి పరులు ఉంటే వారికి సైకిల్ ఎక్కించాలని చంద్రబాబు తాజాగా మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు. జగన్ ఏడాదిన్నర పాలనలో తమను పట్టించుకోలేదని పార్టీ నాయకులు ఎవరైనా అసంతృప్తి తో కనుక ఉంటే వారికి లాగేయాలని తమ్ముళ్ళకు అధినాయకత్వం గట్టిగానే ఆదేశాలు జారీ చేసింది అంటున్నారు.

వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ సహా ఇతర పార్టీల నుంచి పోలోమని చాలా మంది నాయకులు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిన వారికి ఏ మాత్రం మర్యాద లేదన్నది వైసీపీ  ఇంటర్నల్ టాక్. ఎందుకంటే పార్టీలో పదేళ్ళుగా  పనిచేస్తున్న వారికే ఇపుడు అవకాశాలు లేవు. అదే సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి నో చాన్స్ అన్నదే వినిపించే మాట. అయితే కొత్తల్లో ఇవేమీ తెలియని వారంతా పార్టీ మార్చేసారు.

ఇపుడు అలాంటి వారు పక్క చూపులు చూస్తున్నారు అని టీడీపీకి ఉప్పు అందిందంట. వారిక సైకిల్ ఎక్కించేస్తే ఏపీలో తాము బలంగా ఉన్నామన్న సంకేతాలను పంపించవచ్చు అని బాబు తెలివైన ప్లాన్ వేశారు అని చెబుతున్నారు. అదే కనుక జరిగితే ఏపీలో రాజకీయం మరో మారు రివర్స్ లో పడి అధికార పార్టీకి కొత్త సవాళ్ళు తెస్తుందని అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికలకు ముందే ఈ రకమైన ఫిరాయింపుల రాజకీయం సాగిపోవాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది అంటున్నారు.




వైసీపీ మూడు రాజధానులపై వెనక్కి తగ్గుతుందా..?

అపర కుబేరుడికి అడుగు దూరంలో ఎలాన్ మాస్క్..

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని!

మోకాళ్లపై పవన్.. ఫ్యాన్స్ కోసం ఇలా చేసే హీరో పవర్ స్టార్ ఒక్కడే!

ఘోర ఓటమితో రవిశాస్త్రి, కోహ్లీలపై వేటు పడేనా..?

బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>